Click to Donate & Support us or contact us for any Support 8898 318 318

Luke - లూకా సువార్త 21

1. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను.

1. And looking up, he saw the men of wealth putting their offerings in the money-box.

2. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి

2. And he saw a certain poor widow putting in a farthing.

3. ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.

3. And he said, Truly I say to you, This poor widow has given more than all of them:

4. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను.

4. For they gave out of their wealth, having more than enough for themselves: but she, even out of her need, has put in all her living.

5. కొందరుఇది అందమైన రాళ్లతోను అర్పితముల తోను శృంగారింపబడియున్నదని దేవాలయమును గూర్చి, మాటలాడుచుండగా

5. And some were talking about the Temple, how it was made fair with beautiful stones and with offerings, but he said,

6. ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతిమీద రాయి యుండ కుండ అవి పడద్రోయబడు దినములు వచ్చు చున్నవని చెప్పెను.

6. As for these things which you see, the days will come when not one stone will be resting on another, but all will be broken down.

7. అప్పుడు వారుబోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవు నని సూచన ఏమని ఆయన నడుగగా

7. And they said to him, Master, when will these things be? and what sign will there be when these events are to take place?

8. ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
దానియేలు 7:22

8. And he said, Take care that you are not tricked: for a number of people will come in my name, saying, I am he; and, The time is near: do not go after them.

9. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.
దానియేలు 2:28

9. And when news of wars and troubled times comes to your ears, have no fear; for these things have to be, but the end will not be now.

10. మరియు ఆయన వారితో ఇట్లనెనుజనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును;
2 దినవృత్తాంతములు 15:6, యెషయా 19:2

10. Then he said to them, Nation will be moved against nation and kingdom against kingdom:

11. అక్క డక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.

11. There will be great earth-shocks and outbursts of disease in a number of places, and men will be without food; and there will be wonders and great signs from heaven.

12. ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.

12. But before all this, they will take you and be very cruel to you, giving you up to the Synagogues and to prisons, taking you before kings and rulers, because of my name.

13. ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.

13. And it will be turned to a witness for you.

14. కాబట్టి మేమేమి సమాధా నము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.

14. So take care not to be troubled before the time comes, about what answers you will give:

15. మీ విరోధు లందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.

15. For I will give you words and wisdom, so that not one of those who are against you will be able to get the better of you, or to put you in the wrong.

16. తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;

16. But you will be given up even by your fathers and mothers, your brothers and relations and friends; and some of you will be put to death.

17. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.

17. And you will be hated by all men, because of me.

18. గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
1 సమూయేలు 14:45

18. But not a hair of your head will come to destruction.

19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు.

19. By going through all these things, you will keep your lives.

20. యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచు నప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసి కొనుడి.

20. But when you see armies all round about Jerusalem, then be certain that her destruction is near.

21. అప్పుడు యూదయలో ఉండువారు కొండ లకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.

21. Then let those who are in Judaea go in flight to the mountains; and those who are in the middle of the town go out; and let not those who are in the country come in.

22. లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు.
ద్వితియోపదేశకాండము 32:35, యిర్మియా 46:10, హోషేయా 9:7

22. For these are the days of punishment, in which all the things in the Writings will be put into effect.

23. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును.

23. It will be hard for women who are with child, and for her with a baby at the breast, in those days. For great trouble will come on the land, and wrath on this people.

24. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.
ఎజ్రా 9:6, కీర్తనలు 79:1, యెషయా 63:18, యిర్మియా 21:7, దానియేలు 9:26, దానియేలు 12:7, జెకర్యా 12:3, యెషయా 24:19, యెహేజ్కేలు 32:7, యోవేలు 2:30, యోవేలు 2:31

24. And they will be put to death with the sword, and will be taken as prisoners into all the nations; and Jerusalem will be crushed under the feet of the Gentiles, till the times of the Gentiles are complete.

25. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.
కీర్తనలు 46:2-3, కీర్తనలు 65:7, యెషయా 13:10

25. And there will be signs in the sun and moon and stars; and on the earth, fear among the nations and doubt because of the loud noise of the sea and the waves;

26. ఆకాశమందలి శక్తులు కదిలింప బడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.
యెషయా 34:4, హగ్గయి 2:6, హగ్గయి 2:21

26. Men's strength will go from them in fear and in waiting for the things which are coming on the earth; for the powers of the heavens will be moved.

27. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.
దానియేలు 7:13

27. And then they will see the Son of man coming in a cloud, with power and great glory.

28. ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.

28. But when these things come about, let your heads be lifted up, because your salvation is near.

29. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్ష ములను చూడుడి.

29. And he made a story for them: See the fig-tree, and all the trees;

30. అవి చిగిరించుటచూచి వసంత కాలమప్పుడే సమీపమాయె నని మీ అంతట మీరు తెలిసి కొందురు గదా?

30. When they put out their young leaves, you take note of it, and it is clear to you that summer is coming.

31. అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.

31. In the same way, when you see these things taking place you may be certain that the kingdom of God is near.

32. అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

32. Truly I say to you, This generation will not come to an end till all things are complete.

33. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు.

33. Heaven and earth will come to an end, but my words will not come to an end.

34. మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

34. But give attention to yourselves, for fear that your hearts become over-full of the pleasures of food and wine, and the cares of this life, and that day may come on you suddenly, and take you as in a net:

35. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.
యెషయా 24:17

35. For so it will come on all those who are living on the face of all the earth.

36. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించు కొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను.

36. But keep watch at all times with prayer, that you may be strong enough to come through all these things and take your place before the Son of man.

37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.

37. And every day he was teaching in the Temple and every night he went out to the mountain which is named the Mountain of Olives to take his rest.

38. ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి.

38. And all the people came early in the morning to give ear to his words in the Temple.