“వాక్కు”– వ 1. దేవుడు మనిషి అయ్యాడు. రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావం కలిగినవాడయ్యాడు. ఆయన పేరు యేసు. క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. ఆ ఒకే వ్యక్తిలో దేవుని స్వభావం, మానవ స్వభావం పరిపూర్ణమైన విధంగా ఏకమయ్యాయి (మత్తయి 1:18-23
; లూకా 1:26-35
; గలతియులకు 4:4
; హెబ్రీయులకు 2:14
, హెబ్రీయులకు 2:17
). క్రీస్తు వ్యక్తిత్వం దేవుడు వెల్లడి చేసిన గొప్ప రహస్య సత్యం. అందువల్ల దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ మనం నమ్మకంద్వారా ఆ సత్యాన్ని స్వీకరించాలి.
“కృప”– రోమీయులకు 1:7
నోట్. ఇది కొత్త ఒడంబడిక గ్రంథంలోని గొప్ప మాటల్లో ఒకటి. దేవుని కృప, అనుగ్రహం గురించి 100 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తుంది. కృప అంటే అర్హత లేని పాపులకు దేవుడు పాపవిముక్తినీ కొత్త జన్మనూ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అన్నిటినీ ఉచితంగా ఇవ్వడమే. మన కోసం చనిపోయేందుకు తన కుమారుణ్ణి ఇవ్వడమూ, మనలో జీవించేందుకు తన ఆత్మను ఇవ్వడమూ కృప. దేవుని కృప ఎంతో తేటతెల్లంగా యేసు క్రీస్తులో వెల్లడి అయింది. 2 కోరింథీయులకు 8:9
చూడండి. కృప గురించి కొన్ని ప్రాముఖ్యమైన రిఫరెన్సులు వ 17; అపో. కార్యములు 15:11
; అపో. కార్యములు 18:27
; అపో. కార్యములు 20:24
; రోమీయులకు 1:7
; రోమీయులకు 3:24
; రోమీయులకు 5:2
, రోమీయులకు 5:15
, రోమీయులకు 5:20-21
; రోమీయులకు 6:1
, రోమీయులకు 6:14
; 2 కోరింథీయులకు 8:9
; గలతియులకు 1:6
; ఎఫెసీయులకు 1:6
; ఎఫెసీయులకు 2:5-10
; 2 థెస్సలొనికయులకు 2:16
; తీతుకు 2:11
; తీతుకు 3:7
; హెబ్రీయులకు 2:9
; హెబ్రీయులకు 4:16
; యాకోబు 4:6
; 2 పేతురు 3:18
.
“మహాత్యం”– అంటే బహుశా క్రీస్తు స్వరూపం మారిపోయిన సందర్భాన్నీ (2 పేతురు 2:16-17
; మత్తయి 17:1-2
), మొదటి నుంచి చివరిదాకా కృప, సత్యాలతో నిండి వున్న ఆయన జీవితం, పరిచర్యలను రెంటినీ సూచిస్తున్నది.
“సత్యం”– క్రీస్తు అవతారం అంటే సత్యాన్ని వెల్లడి చేయడమే. యోహాను ఒక్కడే సత్యం అనే మాట దాదాపు 25 సార్లు ఉపయోగించాడు (యోహాను 4:24
; యోహాను 8:31-32
; యోహాను 14:6
, యోహాను 14:17
; యోహాను 16:13
; యోహాను 18:37
చూడండి). పాత ఒడంబడిక గ్రంథంలో కూడా దేవుడు సత్యస్వరూపి అయిన దేవుడు – కీర్తన 31:5. యేసు ఆయన అవతారం.
“ఒకే ఒక”– క్రీస్తు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గట్టిగా నొక్కి చెప్పే విధానం ఇది. తండ్రి అయిన దేవునికి ఆయన దైవస్వభావంలో, శాశ్వతమైన ఉనికిలో పాల్గొన్న ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ శుభవార్తలో దేవుణ్ణి 122 సార్లు “తండ్రి” అనడం జరిగింది. ఇతర శుభవార్తల్లో కంటే ఇది చాలా ఎక్కువ సార్లు. మత్తయి 5:16
నోట్ చూడండి.