Acts - అపొ. కార్యములు 19 | View All

1. అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా

1. Bvt it fortuned whan Apollo was at Corinthum, that Paul walked thorow the vpper coastes, and came to Ephesus, and founde certayne disciples,

2. వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.

2. vnto whom he sayde: Haue ye receaued ye holy goost, sence ye beleued? They sayde vnto hi: We haue not herde, whether there be an holy goost.

3. అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.

3. He sayde vnto them: Where with then were ye baptysed? They sayde: With the baptyme of Ihon.

4. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసు నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.

4. Paul sayde: Ihon baptysed with the baptyme of repentaunce, and spake vnto ye people, that they shulde beleue on him, which shulde come after him, that is, on Iesus, that the same is Christ.

5. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.

5. Whan they herde that, they were baptysed in the name of the LORDE Iesu.

6. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.

6. And whan Paul layed the hades on the, the holy goost came vpon them, and they spake with tunges, and prophecied.

7. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు.

7. And all the men were aboute twolue.

8. తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.

8. He wete in to ye synagoge, and preached boldly thre monethes longe, teachinge, and geuynge them exortacions of the kyngdome of God.

9. అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.

9. But whan dyuerse waxed herde herted, and beleued not, and spake euell of the waye of the LORDE before the multitude, he departed from them, and separated the disciples, and disputed daylye in the scole of one called Tyrannus.

10. రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.

10. And this was done two yeares loge, so that all they which dwelt in Asia, herde the worde of the LORDE Iesu, both Iewes & Grekes.

11. మరియదేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;

11. And God wroughte no small miracles by the handes of Paul,

12. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.

12. so that from his body there were broughte napkyns or partlettes vnto the sicke, and the diseases departed from them, and the euell spretes wente out of them.

13. అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులుపౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.

13. But certayne of the vagabounde Iewes which were coniurers, vndertoke to name ye name of the LORDE Iesus, ouer those that had euell spretes, and sayde: We charge you by Iesus whom Paul preacheth.

14. యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.

14. They were seuen sonnes of one Sceua a Iewe the hye prest, which dyd so.

15. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా

15. The euell sprete answered, and sayde: Iesus I knowe, and Paul I knowe, but who are ye?

16. ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.

16. And the ma in who the euell sprete was, ranne vpon them, and ouercame them, and cast them vnder him, so that they fled out of the same house naked and wounded.

17. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.

17. This was knowne vnto all the Iewes and Grekes which dwelt at Ephesus, and there fell a feare vpon them all. And ye name of the LORDE Iesus was magnified.

18. విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసియొప్పుకొనిరి.

18. Many of the also that beleued, came and cofessed, and shewed their workes.

19. మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.

19. But many of them that had vsed curious craftes, broughte the bokes together, and burnte them openly: and they counted the pryce of them, and founde it of money fiftye thousande pens.

20. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.

20. So mightely grewe ye worde of the LORDE, and preuayled.

21. ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మన స్సులో ఉద్దేశించి నేనక్కడికి వెళ్లిన తరువాత రోమాకూడ చూడవలెనని అనుకొనెను.

21. Whan this was done, Paul purposed in sprete to take his iourney thorow Macedonia and Achaia, and to go to Ierusale, and sayde: After that I haue bene there, I must se Rome also.

22. అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.

22. And he sent into Macedonia two that mynistred vnto him, Timotheus and Erastus. But he himselfe remayned in Asia for a season.

23. ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.

23. At the same tyme there rose no litle a doo aboute that waye.

24. ఏలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను.

24. For a certayne man named Demetrius a goldsmyth, which made syluer shrynes for Diana, and broughte them of the crafte no small vauntage.

25. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును.

25. Them he gathered together, and the feloweworkme of the same occupacion, and sayde: Syrs, ye knowe that by this crafte we haue vauntage,

26. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.

26. and ye se and heare, that not onely at Ephesus, but almost also thorow out all Asia, this Paul turneth awaye moch people with his persuadynge, and sayeth: They be not goddes that are made with hondes.

27. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.

27. Howbeit it shal not onely brynge oure occupacion to this poynte to be set at naught, but also the temple of greate Diana shal from hence forth be despysed, and hir maiestye also shalbe destroyed, who neuertheles all Asia and the worlde worshippeth.

28. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి;

28. Whan they herde this, they were full of wrath, cried out, and sayde: Greate is Diana of the Ephesians.

29. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.

29. And all ye cite was on a roore, and they russhed in with one assent in to the open place, and toke Gaius and Aristarchus of Macedonia, Pauls companyons.

30. పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.

30. Whan Paul wolde haue gone in amonge the people, the disciples suffred him not.

31. మరియఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపినీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.

31. Certayne also of ye chefe of Asia which were Pauls good frendes, sent vnto him, and desyred him, that he shulde not preasse in to the open place.

32. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాల మందికి తెలియలేదు.

32. Some cried one thinge, some another. And the congregacion was out of quyete, and the more parte knewe not wherfore they were come together.

33. అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.

33. Some of the people drue forth Alexander, whan ye Iewes thrust him forwarde. Alexader beckened with the hande, and wolde haue geuen the people an answere.

34. అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి.

34. But whan they knewe that he was a Iewe, there arose a shoute of all, and cried the space of two houres: Greate is Diana of the Ephesians.

35. అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?

35. Whan the towne clarke had stylled the people, he sayde: Ye men of Ephesus, what man is it which knoweth not, that the cite of ye Ephesias is a worshipper of the greate goddesse Diana, and of the heauenly ymage?

36. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము.

36. Seinge now that this can not be sayde agaynst, ye ought to be contente, and to do nothinge without aduysement.

37. మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.

37. Ye haue broughte hither these men, which are nether churchrobbers ner blasphemers off youre goddesse.

38. దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును.

38. But yff Demetrius and they that are craftesmen with him, haue ought to saye vnto eny man, the lawe is open, and there are rulers, let them accuse one another.

39. అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అదిక్రమమైన సభలో పరిష్కారమగును.

39. But yf ye wil go aboute eny other thinge, it maye be determyned in a laufull congregacion.

40. మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణ లోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.

40. For we stonde in ioperdy to be accused of this dayes vproure: and yet is there no man giltye, of whom we mighte geue a rekenynge of this vproure.

41. అతడీలాగు చెప్పి సభను ముగించెను.

41. And whan he had sayde this, he let the congregacion departe.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పౌలు ఎఫెసులో యోహాను శిష్యులకు బోధించాడు. (1-7) 
ఎఫెసులో, పౌలు యేసును మెస్సీయగా భావించే భక్తిగల వ్యక్తుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. పవిత్రాత్మ యొక్క అసాధారణ వ్యక్తీకరణలు మరియు ఆధ్యాత్మిక పరిచర్యతో సువార్త అనుబంధం గురించి తెలియక, వారు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పాల్ జాన్ బాప్టిస్ట్ తన బాప్టిజంలు తమను తాము దాటి సూచించాలని ఉద్దేశించినట్లు స్పష్టం చేశాడు, ఇది రాబోయే క్రీస్తు, యేసుపై నమ్మకాన్ని సూచిస్తుంది. కృతజ్ఞతతో, వారు ఈ ప్రత్యక్షతను స్వీకరించారు మరియు ప్రభువైన యేసు నామంలో బాప్టిజం పొందారు. అపొస్తలులు మరియు ప్రారంభ అన్యజనుల అనుభవాలను పోలి ఉండేలా, మాతృభాషలో మాట్లాడటానికి మరియు ప్రవచించేలా వారిని నడిపించేలా, విశేషమైన, విపరీతమైన రీతిలో పరిశుద్ధాత్మ వారిపైకి దిగివచ్చాడు. సమకాలీన అంచనాలు అద్భుత శక్తులపై కేంద్రీకృతం కానప్పటికీ, శిష్యత్వాన్ని ప్రకటించే వారందరూ తమ విశ్వాసం యొక్క నిజాయితీని ధృవీకరిస్తూ, పవిత్రమైన ప్రభావాల ద్వారా పవిత్రాత్మ యొక్క ముద్రను పొందారా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొందరు పరిశుద్ధాత్మను గూర్చి తెలియకుండా ఉండి, ఆయన అనుగ్రహాలు మరియు సౌకర్యాల గురించిన చర్చలను భ్రమలు అని కొట్టిపారేశారు. అలాంటి వ్యక్తుల కోసం, ఒక సంబంధిత ప్రశ్న తలెత్తుతుంది: "అయితే, మీ బాప్టిజం యొక్క అర్థం ఏమిటి?" వారు ఎక్కువగా ఆధారపడే ప్రతీకాత్మక చర్య యొక్క ప్రాముఖ్యత గురించి వారికి తెలియదు.

అతను అక్కడ బోధిస్తాడు. (8-12) 
తర్కించే మరియు ఒప్పించే ప్రయత్నాలు వ్యక్తులకు వారి అవిశ్వాసం మరియు దైవదూషణ వైఖరిని బలపరచడానికి మాత్రమే ఉపయోగపడినప్పుడు, అటువంటి దుర్మార్గపు కంపెనీ నుండి మనల్ని మరియు ఇతరులను దూరం చేసుకోవడం అవసరం అవుతుంది. దేవుడు, తన జ్ఞానంలో, ఈ నీతిమంతుల బోధలను ధృవీకరించడానికి ఎంచుకున్నాడు. వారి ప్రేక్షకులు వారి మాటలను విశ్వసించకపోతే, వారు కనీసం అద్భుత కార్యాలు అందించిన సాక్ష్యాన్ని విశ్వసించగలరు.

యూదు భూతవైద్యులు అవమానించారు. కొందరు ఎఫెసీయులు తమ చెడ్డ పుస్తకాలను కాల్చివేస్తారు. (13-20) 
దుష్టశక్తులను భూతవైద్యం చేయగల సామర్థ్యాన్ని వ్యక్తులు క్లెయిమ్ చేయడం, ముఖ్యంగా యూదుల మధ్య ఒక సాధారణ ఆచారం. క్రీస్తుపై విశ్వాసం ద్వారా దెయ్యాన్ని ప్రతిఘటించడం అతని తిరోగమనానికి దారి తీస్తుంది, అయితే కేవలం క్రీస్తు పేరు లేదా అతని పనులను ఒక రకమైన స్పెల్ లేదా ఆకర్షణగా ఉపయోగించడంపై ఆధారపడటం సాతాను ప్రభావానికి లోనయ్యేలా చేస్తుంది. పాపం కోసం నిజమైన దుఃఖం ప్రార్థనలో దేవునికి మరియు అవసరమైనప్పుడు మనం అన్యాయం చేసిన వారికి బహిరంగ ఒప్పుకోలును ప్రేరేపిస్తుంది.
దేవుని వాక్యం మన జీవితాల్లో అధికారం కలిగి ఉంటే, అనేక అనైతిక, అవిశ్వాస, మరియు చెడ్డ పుస్తకాలు వాటి యజమానులచే విస్మరించబడతాయి లేదా నాశనం చేయబడతాయి. ఈ ఎఫెసియన్ మతమార్పిడులు లాభాపేక్ష కోసం, అటువంటి పనుల వ్యాపారం లేదా స్వాధీనం చేసుకునే వారికి మందలింపుగా పని చేయలేదా? మోక్షానికి సంబంధించిన లోతైన పనిని హృదయపూర్వకంగా కొనసాగించేందుకు, మనస్సుపై సువార్త ప్రభావాన్ని అడ్డుకునే లేదా హృదయంపై దాని పట్టును బలహీనపరిచే ఏదైనా అన్వేషణ లేదా ఆనందాన్ని తప్పనిసరిగా వదులుకోవాలి.

ఎఫెసస్ వద్ద గందరగోళం. (21-31) 
సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు, ఎఫెసియన్ ఆలయానికి పూజలు చేయడానికి వస్తున్నారు, వారితో తిరిగి తీసుకెళ్లడానికి చిన్న వెండి విగ్రహాలు లేదా ఆలయ ప్రతిరూపాలను కొనుగోలు చేశారు. హస్తకళాకారులు తమ స్వంత ప్రయోజనాలను పెంపొందించుకోవడానికి ప్రజల మూఢనమ్మకాలను ఎలా ఉపయోగించుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది వ్యక్తులు తమకు సంపదను తెచ్చే దానిని తీవ్రంగా సమర్థించుకుంటారు మరియు కొందరు క్రీస్తు సువార్తను వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఇది సంభావ్య ఆర్థిక లాభంతో సంబంధం లేకుండా అన్ని అక్రమ వ్యాపారాల నుండి ప్రజలను దూరం చేస్తుంది. ప్రాపంచిక ప్రయోజనాలతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన అసంబద్ధమైన, అసంబద్ధమైన, అసత్యమైన వాటిని తీవ్రంగా సమర్ధించేవారూ ఉన్నారు. నగరం మొత్తం అల్లకల్లోలంగా ఉంది, అబద్ధ మతం పట్ల అత్యుత్సాహంతో కూడిన భక్తి యొక్క ఊహాజనిత ఫలితం.
అయితే, క్రీస్తు గౌరవం పట్ల ఉన్న ఆసక్తి మరియు తోటి విశ్వాసుల పట్ల ప్రేమ ప్రమాదాలను ఎదుర్కోవడానికి అంకితమైన అనుచరులను పురికొల్పుతాయి. తరచుగా, నిజమైన స్నేహం నిజమైన మతం గురించి తెలియని వారి నుండి పుడుతుంది, కానీ క్రైస్తవుల నిజాయితీ మరియు స్థిరమైన ప్రవర్తనను గమనించిన వారు.

అల్లకల్లోలం సద్దుమణిగింది. (32-41)
గందరగోళం మధ్య, యూదులు ముందుకు వచ్చారు. ఏ సహవాసానికి భయపడి, క్రీస్తు సేవకుల నుండి తమను తాము వేరుచేసుకోవడానికి ప్రస్తుతం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న వారు చివరి రోజున వారి తీర్పును ఎదుర్కొంటారు. ఆఖరికి అధికారం ఉన్నవారు గొడవను అణచివేశారు. ఇది ఒక తెలివైన సూత్రం, ఇది వ్యక్తిగత మరియు పబ్లిక్ విషయాలలో వర్తిస్తుంది, ఆకస్మిక చర్యలను నివారించడం, ప్రతిబింబించడానికి సమయాన్ని వెచ్చించడం మరియు మన భావోద్వేగాలపై నియంత్రణను కొనసాగించడం. తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటూ మనం సంయమనంతో ఉండాలి. ప్రజా ఆటంకాలను అణచివేయడానికి చట్టపరమైన విధానాలు ఎల్లప్పుడూ ఉపయోగించబడాలి మరియు సుపరిపాలన ఉన్న దేశాలలో ప్రభావవంతంగా ఉంటాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, చాలామంది దేవుని తీర్పు కంటే తమ తోటి మానవుల తీర్పులకే ఎక్కువ భయపడతారు.
స్వర్గం మరియు భూమి యొక్క న్యాయాధిపతికి మనం ఇవ్వవలసిన ఆసన్న ఖాతా గురించి ఆలోచించడం ద్వారా మన వికృత కోరికలు మరియు కోరికలను శాంతింపజేయగలిగితే అది ప్రయోజనకరంగా ఉంటుంది. మానవ ఆత్మలపై ప్రభావం చూపడం ద్వారా దేవుని ప్రావిడెన్స్ నిగూఢమైన రీతిలో ప్రజా క్రమాన్ని ఎలా కాపాడుతుందో గమనించండి. ఇది ప్రపంచంలోని క్రమంలో కొంత పోలికను నిర్ధారిస్తుంది, వ్యక్తులు ఒకరినొకరు తినకుండా నిరోధిస్తుంది. మనం ఎక్కడ చూసినా, డెమెట్రియస్ మరియు హస్తకళాకారుల మాదిరిగానే ప్రవర్తించే వ్యక్తులను మనం గమనిస్తాము. క్రూర మృగాలతో పోరాడుతున్నట్లే పక్షపాత ఉత్సాహం మరియు విసుగు చెందిన దురాశతో ఆగ్రహించిన వ్యక్తులతో పోరాడడం కూడా అంతే ప్రమాదకరం. వారి ఆర్థిక ప్రయోజనాలను ప్రదర్శించినప్పుడు ఓడిపోయిన అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకుంటే, సంపదను కూడబెట్టుకోవడం వారి అభ్యాసాలను సమర్థిస్తుందని వారు నమ్ముతారు. మతపరమైన వివాదాలలో ఈ ఆత్మ ఎలాంటి వేషధారణతో సంబంధం లేకుండా, ఇది స్వాభావికంగా ప్రాపంచికమైనది మరియు సత్యం మరియు భక్తిని విలువైన వారిచే తిరస్కరించబడాలి. మనం నిరుత్సాహపడవద్దు; పైన ఉన్న సర్వశక్తిమంతుడు అనేక జలాల కోలాహలాన్ని అధిగమిస్తాడు మరియు ప్రజల కోపాన్ని శాంతపరచగలడు.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |