Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.
అపో. కార్యములు 7:2.
2. అతడు హెబ్రీభాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.
3. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి
“గమలీయేల్”– అపో. కార్యములు 5:34-40. “ఆసక్తిపరుడుగా”– ఫిలిప్పీయులకు 3:4-6.
4. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.
అపో. కార్యములు 8:1, అపో. కార్యములు 8:3; అపో. కార్యములు 9:1-2.
5. ఇందునుగూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.
6. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.
అపో. కార్యములు 9:13-18. 9వ అధ్యాయంలో కనబడని ప్రశ్న ఇక్కడ వ 10లో కనిపిస్తున్నది. ఈ ప్రశ్న ప్రభువైన యేసు అధికారానికి అతడు లోబడుతున్నాడని సూచిస్తున్నది. ఇలాంటి విధేయత అతని జీవిత కాలమంతట్లో అతనిలో కనిపిస్తున్నది.
7. నేను నేలమీద పడి సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.
8. అందుకు నేను ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయననేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.
9. నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.
10. అప్పుడు నేను ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.
11. ఆ వెలుగు యొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.
12. అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి
13. సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని.
14. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియ మించియున్నాడు;
ఈ మాటలు 9వ అధ్యాయంలో కనబడడం లేదు. “న్యాయవంతుణ్ణి” (వ 14) – యేసును. అపో. కార్యములు 3:14 చూడండి.
15. నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.
అపో. కార్యములు 1:8.
16. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను. యోవేలు 2:32
బాప్తిసం గురించి అపో. కార్యములు 2:38; మత్తయి 3:2; మార్కు 16:16 నోట్స్ చూడండి. అననీయస్ మాటలను బట్టి చూస్తే బాప్తిసం పాపంనుంచి అంతరంగ శుద్ధీకరణకు బహిరంగ సూచన. ఈ అంతరంగ శుద్ధి క్రీస్తు రక్తం మూలంగానే కలుగుతుంది (హెబ్రీయులకు 9:14).
17. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.
ఈ సంగతి 9వ అధ్యాయంలో రాసిలేదు. బహుశా పౌలు క్రీస్తును స్వీకరించిన కొద్ది కాలానికి జెరుసలంకు వచ్చిన సమయంలో ఇది జరిగింది.
18. అప్పుడాయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.
19. అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచుకొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.
20. మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేనుకూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
అపో. కార్యములు 7:57-60.
21. అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
గలతియులకు 2:7-8.
22. ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించు చుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.
“ఆ మాట”– ఇతర ప్రజల గురించిన మాట. ఆ రోజుల్లో యూదులు ఇతర జాతులపట్ల విరోధ భావాన్ని చూపేవారు. తాము ఇతర ప్రజలకంటే శ్రేష్ఠులమని భావించుకొనేవారు. తమను ఇతర జాతులను సమదృష్టితో చూడడం వారికేమీ ఇష్టం లేదు. ఈ పక్షపాతాన్నీ దురభిమానాన్నీ అనుసరిస్తూ వారు అన్యాయాన్నీ దౌర్జన్యాన్నీ బెదిరింపులనూ హత్యలనూ జరిగించేవారు.
23. వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా
24. వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.
“కొట్టి”– అపో. కార్యములు 5:40; అపో. కార్యములు 16:22-23; మత్తయి 27:26.
25. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచిశిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
అపో. కార్యములు 16:37-38. తాను మరో సారి అన్యాయంగా కొరడా దెబ్బలకు ఎందుకు గురి కావాలి అనుకొన్నాడు పౌలు.
26. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
27. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచినీవు రోమీయుడవా? అది నాతో చెప్పు మనగా
28. అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలునేనైతే పుట్టుకతోనే రోమీయుడ ననెను.
రోమ్ చరిత్రలో ఆ కాలంలో పౌరత్వాన్ని (దానివల్ల కలిగే ప్రయోజనాలతోపాటు) అమ్మడం అనే వింతైన వాడుక ఉంది. దానికి కావలసిన డబ్బుగలవారు దాన్ని చెల్లించి రోమ్ పౌరులయ్యారు.
29. కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతికూడ భయపడెను.
30. మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.
“సభ”– మత్తయి 5:22.