Acts - అపొ. కార్యములు 27 | View All

1. మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్ప గించిరి.

1. When it was cocluded that we shuld sayle into Italy they delivered Paul and certayne other presoners vnto one named Iulius an vnder captayne of Cesars soudiars.

2. ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితివిు; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను.

2. And we entred into a ship of Adramicium and lowsed from lond apoynted to sayle by the costes of Asia one Aristarcus out of Macedonia of the contre of Thessalia beinge with vs.

3. మరునాడు సీదోనుకు వచ్చితివిు. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను.

3. And the nexte daye we came to Sidon. And Iulius courteously entreated Paul and gave him liberte to goo vnto his frendes and to refresshe him selfe.

4. అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితివిు.

4. And from thence lanched we and sayled harde by Cypers because the wyndes were contrarye.

5. మరియకిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితివిు.

5. Then sayled we over the see of Cilicia and Pamphylia and came to Myra a cite in Lycia.

6. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను.

6. And there ye vnder captayne founde a shippe of Alexander redy to sayle into Italy and put vs therin.

7. అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితివిు.

7. And when we had sayled slowly many dayes and scace were come over agaynst Gnydon (because the wynde with stode vs) we sayled harde by the costes of Candy over agaynste Salmo

8. బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితివిు. దానిదగ్గర లసైయ పట్టణముండెను.

8. and with moche worke sayled beyonde yt and came vnto a place called good porte. Nye whervnto was a citie called Lasea.

9. చాల కాలమైన తరువాత ఉపవాసదినముకూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.
లేవీయకాండము 16:29

9. When moche tyme was spent and saylinge was now ieoperdeous because also that we had overlonge fasted Paul put them in remembraunce

10. అప్పుడు పౌలు అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకుకూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.

10. and sayde vnto them Syrs I perceave that this vyage wilbe with hurte and moche domage not of the ladynge and ship only: but also of oure lyves.

11. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.

11. Neverthelather the vndercaptayne beleved the governer and the master better then tho thinges which were spoken of Paul.

12. మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైఋతి వాయవ్యదిక్కుల తట్టుననున్న క్రేతురేవై యున్నది.

12. And because the haven was not comodius to wynter in many toke counsell to departe thence yf by eny meanes they myght attayne to Phenices and there to wynter which is an haven of Candy and servith to the southwest and northwest wynde.

13. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.

13. When the south wynde blewe they supposynge to obtayne their purpose lowsed vnto Asson and sayled paste all Candy.

14. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను.

14. But anone after ther arose agaynste their purpose a flawe of wynde out of the northeeste.

15. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతివిు.

15. And when the ship was caught and coulde not resist the wynde we let her goo and drave with the wether.

16. తరువాత కౌద అనబడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను.

16. And we came vnto an yle named Clauda and had moche worke to come by abote

17. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.

17. which they toke vp and vsed helpe vndergerdynge the shippe fearynge lest we shuld have fallen into Syrtes and we let doune a vessell and so were caryed.

18. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.

18. The nexte daye when we were tossed wt an exceadynge tempest they lyghtened ye ship

19. మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.

19. and the thyrde daye we cast out with oure awne hondes the tacklynge of the shippe.

20. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను.

20. When at the last nether sunne nor starre in many dayes appered and no small tempest laye apon vs all hope that we shuld be saved was then taken awaye.

21. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.

21. Then after longe abstinence Paul stode forth in the myddes of them and sayde: Syrs ye shulde have harkened to me and not have lowsed from Candy nether to have brought vnto vs this harme and losse.

22. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.

22. And nowe I exhorte you to be of good chere. For ther shalbe no losse of eny mas lyfe amonge you save of the ship only.

23. నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;

23. For ther stode by me this nyght the angell of God whose I am and whom I serve

24. నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.

24. sayinge: feare not Paul for thou must be brought before Cesar. And lo God hath geven vnto the all that sayle with ye.

25. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.

25. Wherfore Syrs be of good chere: for I beleve God that so it shalbe even as it was tolde me.

26. అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.

26. How be it we must be cast into a certayne ylonde.

27. పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడుచున్నదని యూహించి

27. But when ye fourtethe nyght was come as we were caryed in Adria about mydnyght the shipmen demed that ther appered some countre vnto the:

28. బుడుదువేసి చూచి యిరువదిబారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి.

28. and sounded and founde it .xx. feddoms. And when they had gone a lytell further they sounded agayne and founde .xv. feddoms.

29. అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమర ములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి.

29. Then fearinge lest they shuld have fallen on some Rocke they cast .iiii. ancres out of the sterne and wysshed for ye daye.

30. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.

30. As the shipmen were about to fle out of the ship and had let doune the bote into the see vnder a coloure as though they wolde have cast ancres out of the forshippe:

31. అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.

31. Paul sayd vnto ye vnder captayne and the soudiers: excepte these abyde in the ship ye cannot be safe.

32. వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి.

32. Then the soudiers cut of the rope of the bote and let it fall awaye.

33. తెల్లవారుచుండగా పౌలు పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు

33. And in ye meane tyme betwixt that and daye Paul besought them all to take meate sayinge: this is ye fourtenthe daye that ye have taried and continued fastynge receavinge nothinge at all.

34. గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.
1 సమూయేలు 14:45, 2 సమూయేలు 14:11

34. Wherfore I praye you to take meate: for this no dout is for youre helth: for ther shall not an heere fall fro the heed of eny of you.

35. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.

35. And when he had thus spoke he toke breed and gave thankes to God in presence of the all and brake it and begane to eate.

36. అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.

36. Then were they all of good cheare and they also toke meate.

37. ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము.

37. We were all together in ye ship two hundred thre score and sixtene soules.

38. వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి.

38. And whe they had eate ynough they lightened ye ship and cast out the wheate into the see.

39. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైన యెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి

39. Whe yt was daye they knew not ye lande but they spied a certayne haven with a banke into ye which they were mynded (yf yt were possible) to thrust in the ship.

40. గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని

40. And when they had taken vp the ancres they comytted them selves vnto the see and lowsed the rudder bondes and hoysed vp ye mayne sayle to the wynde and drue to londe.

41. రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను.

41. But they chaunsed on a place which had the see on bothe the sydes and thrust in the ship. And the foore parte stucke fast and moved not but ye hynder brake with the violence of the waves.

42. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారి పోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని

42. The soudears counsell was to kyll ye presoners lest eny of them when he had swome out shulde fle awaye.

43. శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించివారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు

43. But the vndercaptayne willinge to save Paul kept the from their purpose and commaunded that they yt could swyme shulde cast the selves first in to ye see and scape to londe.

44. కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.

44. And the other he comaunded to goo some on bordes and some on broken peces of the ship. And so it came to passe that they came all safe to londe.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రోమ్ వైపు పాల్ ప్రయాణం. (1-11) 
దేవుని సలహా ద్వారా నియమించబడిన దైవిక ప్రణాళిక, ఫెస్టస్ నిర్ణయానికి ముందే పౌలు రోమ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. రోమ్‌లో ఉన్న పౌలు కోసం దేవుడు ఒక నిర్దిష్ట ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాడు. కథనం వారు వెళ్ళిన మార్గాన్ని మరియు వారు సందర్శించిన ప్రదేశాలను వివరిస్తుంది. ఊహించని మిత్రులను ప్రేరేపించే శక్తి ఆయనకు ఉన్నందున, దేవుడు తన కోసం కష్టాలను ఎదుర్కొంటున్న వారికి తనపై నమ్మకం ఉంచమని భరోసా ఇస్తాడు. నావికులు ప్రబలంగా వీచే గాలులకు అనుగుణంగా సముద్రాల్లో ప్రయాణించినట్లే, మనం కూడా జీవితంలోని సవాళ్లను అధిగమించాలి. విరుద్ధమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, మనం పురోగతి సాధించడానికి ప్రయత్నించాలి. కొంతమంది వ్యక్తులు, అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ముందుకు సాగడానికి కష్టపడతారు, మరికొందరు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, ముందుకు సాగుతారు. అనేకమంది యథార్థ క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక స్థావరాన్ని కాపాడుకోవడం సవాలుగా భావిస్తారు. ప్రతి అకారణంగా స్వాగతించే అవకాశం సురక్షితంగా నిరూపించబడదు. కొంతమంది మంచి సలహాదారులకు గౌరవం చూపిస్తారు, అయినప్పటికీ వారి సలహాను విస్మరిస్తారు. అంతిమంగా, ఫలితాలు తప్పుదారి పట్టించే ఆశల శూన్యతను మరియు కొన్ని చర్యల యొక్క మూర్ఖత్వాన్ని వెల్లడిస్తాయి.

పాల్ మరియు అతని సహచరులు తుఫాను వల్ల ప్రమాదంలో ఉన్నారు. (12-20) 
అనుకూలమైన పరిస్థితులతో మార్గనిర్దేశం చేయబడి, ఈ విశాలమైన ప్రపంచంలో జీవన ప్రయాణాన్ని ప్రారంభించేవారు, ఊహించని తుఫానులు తలెత్తవచ్చు కాబట్టి, తమ లక్ష్యాలను భద్రపరచుకున్నారని భావించకూడదు. నిజమైన భద్రత స్వర్గానికి చేరుకున్న తర్వాత మాత్రమే లభిస్తుంది; అందువలన, మనం అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలలో దేవుని ప్రజల దుస్థితి లాగానే, వారు వెలుగు లేకుండా నడిచినప్పుడు చీకటి మరియు ఆధ్యాత్మిక అనిశ్చితి సమయాలు ఉన్నాయి. ఈ ప్రపంచం యొక్క స్పష్టమైన సంపద, తరచుగా ఒక ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది, ఇది భారంగా మారుతుంది, సురక్షితంగా తీసుకువెళ్లడానికి చాలా గజిబిజిగా మరియు ఒకరిని క్రిందికి లాగగలిగేంత శక్తివంతంగా ఉంటుంది. ప్రాపంచిక వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఆస్తులను తక్షణమే వెచ్చించవచ్చు, అయినప్పటికీ వారు భక్తి, దాతృత్వం మరియు క్రీస్తు కోసం బాధలను సహించే చర్యలలో అయిష్టతను ప్రదర్శిస్తారు. అనేకులు వస్తుసంపదల కంటే తమ జీవితాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుండగా, కొందరు తమ విశ్వాసాన్ని మరియు నైతిక సమగ్రతను లోకసంబంధమైన వస్తువుల కోసం పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నావికుల ప్రయత్నాలు వ్యర్థమని నిరూపించబడ్డాయి, వ్యక్తులు స్వయం-విశ్వాసాన్ని విడిచిపెట్టి, తమను తాము రక్షించుకోవాలనే ఆశను కోల్పోయినప్పుడు, వారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు యేసుక్రీస్తు ద్వారా ఆయన దయపై విశ్వాసం ఉంచడానికి స్వీకరిస్తారు.

అతను భద్రతకు సంబంధించిన దైవిక హామీని పొందుతాడు. (21-29) 
రాబోయే ప్రమాదం గురించి అపొస్తలుడి హెచ్చరికను వారు పట్టించుకోలేదు. అయినప్పటికీ, వారు తమ మూర్ఖత్వాన్ని గుర్తించి, పశ్చాత్తాపపడితే, వారి ఆపద సమయంలో ఆయన వారికి ఓదార్పును మరియు ఉపశమనాన్ని అందిస్తాడు. చాలా మంది వ్యక్తులు తమ అదృష్ట పరిస్థితులను గుర్తించడంలో విఫలమవుతారు, ఎందుకంటే సలహాకు వ్యతిరేకంగా వారి పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించడం ద్వారా తరచుగా హాని మరియు నష్టాన్ని అనుభవిస్తారు.
దేవునితో తనకున్న సంబంధాన్ని గురించి పౌలు చేసిన గంభీరమైన ప్రకటనను గమనించండి. తుఫానులు మరియు తుఫానులు అతని ప్రజల పట్ల దేవుని అనుగ్రహాన్ని అడ్డుకోలేవు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఉండే సహాయకారుడు. దేవుని నమ్మకమైన సేవకులు కష్టాల్లో ఓదార్పుని పొందుతారు, ప్రభువు తమకు చేయవలసిన పని ఉన్నంత కాలం తమ జీవితాలు సుదీర్ఘంగా ఉంటాయని తెలుసు. ఒకవేళ పౌలు ఇష్టపూర్వకంగా తప్పుడు సహవాసంతో సహవాసం చేసి ఉంటే, అతడు దాని పర్యవసానాలను సరిగ్గా ఎదుర్కొని ఉండవచ్చు; అయినప్పటికీ, దేవుడు అతనిని ఆ పరిస్థితికి నడిపించాడు కాబట్టి, అవి కలిసి భద్రపరచబడ్డాయి.
పరిస్థితి వారికి బహుమతి; ఒక మంచి వ్యక్తికి తాము ప్రజల ఆశీర్వాదం అని తెలుసుకోవడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. పౌలును ఓదార్చిన అదే ఓదార్పుతో దేవుడు వారిని ఓదార్చాడు. దేవుడు ఎల్లప్పుడూ విశ్వాసపాత్రుడు కాబట్టి, ఆయన వాగ్దానాలలో వాటా ఉన్నవారు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండాలి. దేవునితో, చెప్పడం మరియు చేయడం ఒకటి అయినట్లే, మన నమ్మకం మరియు ఆనందం విడదీయరానివిగా ఉండాలి. ఆశ ఆత్మకు ఒక యాంకర్‌గా పనిచేస్తుంది, ఖచ్చితంగా మరియు దృఢంగా, వీల్ దాటి అభయారణ్యంలోకి ప్రవేశిస్తుంది. ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నవారు దానిని అంటిపెట్టుకొని ఉండాలి మరియు మరలా ప్రయాణించకుండా ఉండాలి, బదులుగా క్రీస్తులో ఉండి, నీడలు పారిపోయినప్పుడు తెల్లవారుజాము కోసం వేచి ఉండాలి.

పౌలు తనతో ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నాడు. (30-38) 
మోక్షం యొక్క ఫలితాన్ని ముందే నిర్ణయించిన దేవుడు, ఈ షిప్‌మెన్‌ల సహాయంపై ఆధారపడి మోక్షాన్ని సాధించే మార్గాలను కూడా నిర్దేశించాడు. ముగింపు దేవునిచే నియమించబడినప్పటికీ, సాధనాలు మన బాధ్యత. దేవునిపై విశ్వాసం ఉంచడం అనేది కేవలం మౌఖిక అంగీకారమే కాకుండా ఆచరణాత్మక చర్య, మన భద్రత కోసం మన నియంత్రణలోని తగిన మార్గాలను ఉపయోగించడం. అవసరమైన చర్యలను ఉపయోగించకుండా దైవిక రక్షణను క్లెయిమ్ చేయడం విశ్వాసం కాదు, ప్రలోభపెట్టే ప్రొవిడెన్స్.
విచారకరంగా, మానవుల స్వార్థం ఇతరులను పణంగా పెట్టి తమ భద్రతను వెంబడించే వ్యక్తులుగా తరచుగా వ్యక్తమవుతుంది. పాల్ వంటి వారిని తమ సంస్థలో కలిగి ఉండే అదృష్టవంతులు స్వర్గంతో సంబంధాన్ని మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్నవారిపై అతని ఆత్మ యొక్క ఉత్తేజపరిచే ప్రభావాన్ని కూడా అనుభవిస్తారు. ప్రపంచంలోని దుఃఖం నాశనానికి దారి తీస్తుంది, కానీ దేవునిలో ఆనందాన్ని పొందడం వల్ల తీవ్రమైన బాధ మరియు ప్రమాదంలో కూడా జీవితం మరియు శాంతి లభిస్తుంది.
దేవుని వాగ్దానాల సౌలభ్యాన్ని పొందాలంటే, ఆయన వాక్యాన్ని నెరవేర్చడంపై ఆధారపడి మనం ఆయనతో విశ్వాస ఆధారిత సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుడు అందించే మోక్షం ఆయన స్థాపించిన మార్గాలకు-పశ్చాత్తాపం, విశ్వాసం, ప్రార్థన మరియు నిరంతర విధేయతకు కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంటుంది. మరే ఇతర మార్గంలోనైనా మోక్షాన్ని ఆశించడం అహంకారం మరియు ప్రమాదకరం. ఆహ్వానాన్ని అందజేసే వారు ఆయన పట్ల తమ స్వంత నిబద్ధతను ప్రదర్శించినప్పుడు ప్రజలు తమను తాము క్రీస్తుకు అప్పగించడానికి ఇది ప్రోత్సాహకరంగా మారుతుంది.

వారు ఓడ ధ్వంసమయ్యారు. (39-44)
ఖాళీగా ఉన్న సముద్రంలో తుఫానును విజయవంతంగా తట్టుకున్న ఓడ, అది నిలిచిపోయినప్పుడు పగిలిపోతుంది. అదేవిధంగా, హృదయం దృఢంగా జతచేయబడి ప్రపంచంలో చిక్కుకుపోయినట్లయితే, అది నాశనాన్ని ఎదుర్కొంటుంది. సాతాను ప్రలోభాలు దాని మీద దాడి చేస్తాయి, అది పోతుంది. ఏది ఏమైనప్పటికీ, అది ప్రాపంచిక ఆందోళనల కంటే ఎక్కువగా ఉన్నంత కాలం, శ్రమలు మరియు అల్లకల్లోలంతో విసిరివేయబడినప్పటికీ, ఆశ ఉంటుంది. కనుచూపు మేరలో తీరం ఉన్నప్పటికీ, వారు ఓడరేవులో ఓడ ప్రమాదాన్ని అనుభవించారు, ఎప్పటికీ ఆత్మసంతృప్తి చెందకుండా ఒక పాఠంగా పనిచేశారు. వాగ్దానం చేయబడిన మోక్షానికి మార్గం సవాలుగా ఉన్నప్పటికీ, అది నిస్సందేహంగా నెరవేరుతుంది. పరీక్షలు మరియు ప్రమాదాలు ఉన్నప్పటికీ, విశ్వాసులందరూ చివరికి నిర్ణీత సమయంలో సురక్షితంగా స్వర్గానికి చేరుకుంటారు. ప్రభువైన యేసు, మీ స్వంతం ఎవరూ నశించరని మీరు మాకు హామీ ఇచ్చారు. మీరు వారందరినీ స్వర్గపు ఒడ్డుకు సురక్షితంగా తీసుకువస్తారు. అది ఎంత సంతోషకరమైన రాక! మీరు వాటిని మీ తండ్రికి అందజేస్తారు మరియు మీ పరిశుద్ధాత్మ వాటిని శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటుంది.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |