Acts - అపొ. కార్యములు 7 | View All

1. ప్రధానయాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను.

ఈ అధ్యాయంలోని స్తెఫను మాటలలో అతడు యూదులు తనపై మోపిన నేరాలను గురించి ఏమీ చెప్పలేదు. దానికి బదులుగా అతడు ఇస్రాయేల్ జాతి మూలపురుషుడైన అబ్రాహాముతో ఆరంభించి వారి చరిత్ర టూకీగా ఇచ్చాడు. ఇందులో దేవుడు ఎవరిద్వారా తన ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడో అతడు ఆ మోషే విషయాన్ని మరింత నొక్కి చెప్పాడు. దేవునికీ మోషేకూ ధర్మశాస్త్రానికీ దేవాలయానికీ వ్యతిరేకంగా మాట్లాడాడని యూదులు మోపిన నేరాలకు (అపో. కార్యములు 6:11, అపో. కార్యములు 6:13-14) ఈ విధంగా జవాబిచ్చాడు. తన ఉపదేశం పాత ఒడంబడిక గ్రంథానికి అనుగుణంగానే ఉందని అతడు చూపాడు. మొదటినుంచి ఒకే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు – ఆ జాతివారు తమకు దేవుడు నియమించిన నాయకుల మీద ఎప్పుడూ తిరగబడ్డవారు. ఈ తిరగబడే మనసు వారు యేసుప్రభువును చంపడంలో పూర్తిగా బయట పడింది అని యేసుకు మరణ శిక్ష విధించిన యూద సమాలోచన సభ ఎదుట ఈ విధంగా మాట్లాడడంలో స్తెఫను గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించాడు. అతని ధైర్యం లోని రహస్యం అపో. కార్యములు 6:5 లో కనిపిస్తున్నది.

2. అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
కీర్తనల గ్రంథము 29:3

“మహిమ స్వరూపి అయిన దేవుడు”– ఈ పేరు కీర్తనల గ్రంథము 29:3 లో ఉంది. అబ్రాహాము చరిత్ర ఆదికాండము 11:27-32 లో ఉంది.

3. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.
ఆదికాండము 12:1, ఆదికాండము 48:4

4. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను
ఆదికాండము 12:5

5. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.
ఆదికాండము 13:15, ఆదికాండము 15:18, ఆదికాండము 16:1, ఆదికాండము 17:8, ఆదికాండము 48:4, ఆదికాండము 24:7, ద్వితీయోపదేశకాండము 2:5, ద్వితీయోపదేశకాండము 11:5, ద్వితీయోపదేశకాండము 32:49

6. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసు లగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను
ఆదికాండము 15:13-14, నిర్గమకాండము 2:22

7. మరియు దేవుడు ఏ జనము నకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోటనన్ను సేవింతురనియు చెప్పెను.
ఆదికాండము 15:14, నిర్గమకాండము 3:12

8. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అత నికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
ఆదికాండము 17:10-11, ఆదికాండము 21:4

9. ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి
ఆదికాండము 37:11, ఆదికాండము 37:28, ఆదికాండము 39:2-3, ఆదికాండము 39:21, ఆదికాండము 45:4

10. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
ఆదికాండము 41:40, ఆదికాండము 41:43, ఆదికాండము 41:46, కీర్తనల గ్రంథము 105:21

11. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.
ఆదికాండము 41:54-55, ఆదికాండము 42:5

12. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటి సారి పంపెను.
ఆదికాండము 42:2

13. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.
ఆదికాండము 45:1, ఆదికాండము 45:3, ఆదికాండము 45:16

14. యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు
ఆదికాండము 45:9-11, ఆదికాండము 45:18-19, నిర్గమకాండము 1:5, ద్వితీయోపదేశకాండము 10:22

ఆదికాండము 46:26 పోల్చి చూడండి. అక్కడ యాకోబు కొడుకుల భార్యల లెక్క కలపకుండా కనాను దేశంలోని యాకోబు కుటుంబంవారి సంఖ్య 66 అని రాసి ఉంది. కానానులో ఇంకా జీవిస్తున్న యాకోబు కొడుకుల తొమ్మిదిమంది భార్యలను ఆ సంఖ్యలో కలిపితే అది 75 అవుతుంది (యూదా భార్య చనిపోయింది – ఆదికాండము 38:12. సంప్రదాయం ప్రకారం షిమ్యోను భార్య కూడా అప్పటికి చనిపోయింది).

15. యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,
ఆదికాండము 45:5-6, ఆదికాండము 49:33, నిర్గమకాండము 1:6

16. షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
ఆదికాండము 23:16-17, ఆదికాండము 33:19, ఆదికాండము 49:29-30, ఆదికాండము 50:13, యెహోషువ 24:32

17. అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.
నిర్గమకాండము 1:7-8

18. ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి
నిర్గమకాండము 1:7-8

19. తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను.
నిర్గమకాండము 1:9-10, నిర్గమకాండము 1:18, నిర్గమకాండము 1:22

20. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.
నిర్గమకాండము 2:2

21. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.
నిర్గమకాండము 2:5, నిర్గమకాండము 2:10

22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.

23. అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
నిర్గమకాండము 2:11

24. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.
నిర్గమకాండము 2:12

25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి.

“గ్రహించలేదు”– తరచుగా వారి చరిత్రలో ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఉద్దేశాలను గురించి తమ అజ్ఞానాన్ని బయట పెట్టారు, తమకోసం దేవుడు నియమించిన నాయకులను తిరస్కరించారు. ఈ అంశాన్ని స్తెఫను ఇప్పుడు నొక్కి చెప్పడం ఆరంభిస్తున్నాడు.

26. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.

27. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడుమా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?
నిర్గమకాండము 2:13-14

28. నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను.
నిర్గమకాండము 2:13-14

29. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను.
నిర్గమకాండము 2:15-22, నిర్గమకాండము 18:3-4

30. నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.
నిర్గమకాండము 3:1, నిర్గమకాండము 3:2-3

31. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా
నిర్గమకాండము 3:2-3

32. నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింప లేదు.

33. అందుకు ప్రభువునీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి.
నిర్గమకాండము 3:5

34. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.
నిర్గమకాండము 2:24, నిర్గమకాండము 3:7-10

35. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకునిగాను నియమించి పంపెను
నిర్గమకాండము 2:14, నిర్గమకాండము 3:2

ఈ దేవదూతను గురించిన నోట్స్ ఆదికాండము 16:7; నిర్గమకాండము 3:2 చూడండి.

36. ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.
నిర్గమకాండము 7:3, నిర్గమకాండము 14:21, సంఖ్యాకాండము 14:33

ఈ వచనం నిర్గమ 7–17 అధ్యాయాలు, సంఖ్యా 14–21 అధ్యాయాలలో కొంత భాగంలోని కొన్ని సంగతుల గురించి చెపుతున్నది.

37. నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరు లలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.
ద్వితీయోపదేశకాండము 18:15-18

ద్వితీయోపదేశకాండము 18:15. ఈ ప్రవక్త యేసుప్రభువే.

38. సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.
నిర్గమకాండము 19:1-6, నిర్గమకాండము 20:1-17, నిర్గమకాండము 23:20-21, ద్వితీయోపదేశకాండము 5:4-22, ద్వితీయోపదేశకాండము 9:10-11

మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి బదులుగా (అపో. కార్యములు 6:11) స్తెఫను అతణ్ణి ఘనపరచాడు. ధర్మశాస్త్రాన్ని “జీవవాక్కులు” అన్నాడు (యోహాను 6:63; లేవీయకాండము 18:5 పోల్చి చూడండి).

39. ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై
సంఖ్యాకాండము 14:3-4, నిర్గమకాండము 19:1-6, నిర్గమకాండము 20:1-17, నిర్గమకాండము 23:20-21

1,25 వచనాలమీద నోట్స్ చూడండి. ఇస్రాయేల్‌ప్రజలు ప్రవక్త అయిన మోషేపట్ల ఎలా వ్యవహరించారో అలాగే మోషే ముందుగా తెలియజేసిన గొప్ప ప్రవక్త (వ 37) పట్ల వ్యవహరించారు. “తిరిగారు”– ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్ దేశాన్ని విడిచి వచ్చినా వారి తలంపులు, ఆశలు దానిమీదే ఉన్నాయి (నిర్గమకాండము 16:1-3; సంఖ్యాకాండము 14:1-4).

40. మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి.
నిర్గమకాండము 32:1, నిర్గమకాండము 32:23

41. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.
నిర్గమకాండము 32:4-6

42. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?
యిర్మియా 7:18, యిర్మియా 8:2, యిర్మియా 19:13, ఆమోసు 5:25-26

ఆమోసు 5:25-27 గ్రీకు భాష అనువాదాన్ని ఎత్తి చెపుతున్నాడు స్తెఫను, గానీ మాటకు మాట ఖచ్చితంగా చెప్పడం లేదు. అతని ఉద్దేశం ఇస్రాయేల్‌ప్రజల అవిధేయత, తిరుగుబాటుతనం కారణంగా దేవుడు వారిని అబద్ధ పూజకు అప్పగించాడని చూపడం మాత్రమే. నక్షత్రాల పూజ గురించి నోట్స్ ద్వితీయోపదేశకాండము 4:19; ద్వితీయోపదేశకాండము 17:3-5; యెహెఙ్కేలు 8:16-18; ఆదికాండము 1:14-18 చూడండి.

43. మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
ఆమోసు 5:25-26

44. అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.
నిర్గమకాండము 25:1-40, నిర్గమకాండము 25:40, నిర్గమకాండము 27:21, సంఖ్యాకాండము 1:50

45. మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.
ఆదికాండము 48:4, ఆదికాండము 24:7, ద్వితీయోపదేశకాండము 2:5, ద్వితీయోపదేశకాండము 11:5, యెహోషువ 3:14-17, యెహోషువ 18:1, యెహోషువ 23:9, యెహోషువ 24:18, 2 సమూయేలు 7:2-16, 1 రాజులు 8:17-18, 1 దినవృత్తాంతములు 17:1-14, 2 దినవృత్తాంతములు 6:7-8, కీర్తనల గ్రంథము 132:5

48. అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది?

యూదులు జెరుసలంలోని దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. స్తెఫను దానికి వ్యతిరేకంగా మాట్లాడాడన్నది, వారు అతని మీద మోపిన నేరాల్లో ఒకటి (అపో. కార్యములు 6:13-14). ప్రాముఖ్యమైనది దేవాలయం కాదు గాని దేవాలయంలో పేరు ఉన్న దేవుడే అనీ కర్మకాండ, సంస్కారాల కంటే విధేయత, పవిత్రతతో కూడిన జీవితాలే గొప్ప అనీ తన నమ్మకాన్ని తెలియజేసే రీతిలో అతడు మాట్లాడినట్టుంది (యెషయా 1:12-20 పోల్చి చూడండి). ఇక్కడ, తన నమ్మకం పాత ఒడంబడిక గ్రంథానికి అనుగుణంగా ఉందని చూపడానికి అతడు యెషయా 66:1-2 ఎత్తి చెపుతున్నాడు. ఆ వచనాలు ఈ మాటలతో ముగిసాయి – “ఇది యెహోవా వాక్కు. ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాటకు వణుకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది”. స్తెఫను ఈ మాటలు ఎత్తి చెప్పకపోయినా అవి అతని మనసులో ఉండవచ్చు. ఆ మాటలలో వర్ణించినవారికీ అతని ఎదుట ఉన్న యూద నాయకులకూ ఎంత వ్యత్యాసం ఉందో అతడు చూడగలిగినవాడు గదా. అతడు అలా చూచినందువల్లే (అతని హృదయంలోని పవిత్రాత్మ ఆవేశం కారణంగా కూడా) తరువాతి వచనంలో వారితో అంత కఠినంగా తీవ్రంగా మాట్లాడసాగాడని అనిపిస్తున్నది.

49. ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు
యెషయా 66:1-2

50. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.
యెషయా 66:1-2

51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
నిర్గమకాండము 32:9, నిర్గమకాండము 33:3-5, లేవీయకాండము 26:41, సంఖ్యాకాండము 27:14, యెషయా 63:10, యిర్మియా 6:10, యిర్మియా 9:26

తనకు ఎంత కష్టం, ఎంత అపాయం కలిగినా అతడు యేసుప్రభువు లాగే సత్యం ఉన్నది ఉన్నట్టే పలుకుదామని నిశ్చయించుకొన్నాడు. “హృదయంలో...సున్నతి లేని”– లేవీయకాండము 26:41; ద్వితీయోపదేశకాండము 10:16; యిర్మియా 4:4 చూడండి. వారి హృదయాలు కొత్తవి కాలేదు గనుక దేవుని వాక్కు విని దానికి విధేయులు కావడం వారికి అసాధ్యం (యిర్మియా 6:10; మత్తయి 13:14-15). వారు వారి “పూర్వీకుల లాగే మసలుకొంటున్నారు” అనడం వారు పూర్తిగా శిక్షకు పాత్రులని చెప్పడమే (వ 39-43; మత్తయి 23:32). వారు పవిత్రాత్మను ఎదిరించారనే మాట కీర్తనల గ్రంథము 106:33 ను మనసుకు తెస్తుంది. ఇది ఎప్పుడూ ఇస్రాయేల్ ప్రజలు చేసిన ఘోర పాపం. ఈ యూద నాయకులకు ఇది తెలుసు గాని ఇది వారి విషయంలో కూడా నిజమని ఒప్పుకోవడం వారికి ఇష్టం లేదు.

52. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
2 దినవృత్తాంతములు 36:16

మత్తయి 23:33-39. “న్యాయవంతుడు”– క్రీస్తు యేసు (అపో. కార్యములు 3:14).

53. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.

అతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడని వారు అతనిమీద తప్పుగా నేరం మోపారు (అపో. కార్యములు 6:13). అయితే తాము ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకుంటూ వారు పదేపదే దాన్ని మీరుతూ తమ పాదాలకింద తొక్కుతున్నట్టున్నారు (మత్తయి 23:1-3; మత్తయి 15:3-9; రోమీయులకు 2:17-24).

54. వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.
యోబు 16:9, కీర్తనల గ్రంథము 35:16, కీర్తనల గ్రంథము 37:12, కీర్తనల గ్రంథము 112:10

ఇంకా చెప్పడానికి అతనికి ఉందేమో గాని దాన్ని విందామని వారు ఆగలేదు. అపో. కార్యములు 5:33; కీర్తనల గ్రంథము 35:16; యోహాను 3:20 పోల్చి చూడండి. దేవుని సేవకులను చూచి పండ్లు కొరికేవారికి వేరే కారణంవల్ల పండ్లు కొరుక్కునే రోజు వస్తుంది (మత్తయి 8:12; మత్తయి 13:42).

55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచుచున్నానని చెప్పెను.

స్తెఫనును దేవుని మనిషిగా, భయం లేని ధైర్యశాలిగా చేసినదీ, అతనిచేత అలా మాట్లాడించినదీ అతనిలో ఉన్న దేవుని ఆత్మ సంపూర్ణత (అపో. కార్యములు 6:5, అపో. కార్యములు 6:8, అపో. కార్యములు 6:10). అతనికి హింస, మరణం వచ్చిన సమయంలో దేవుడు అతనికి ప్రత్యేక దర్శనం అనుగ్రహించాడు.

56. ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.

“ఇదిగో”– తాను చూస్తున్నదాన్ని ఇతరులు చూడగలరని అనుకొన్నాడా? అతనికి వాస్తవంగా కనిపించినది వారికి కనిపించలేదు. అయితే దేవుడు ఆ సామర్థ్యాన్ని మనుషులకు ఇస్తే వారు పరలోకంలోకి చూడగలరని ఇక్కడ కనబడుతున్నది. పరలోకం అంత దగ్గరగా ఉందన్నమాట. “మానవ పుత్రుడు”– మత్తయి 8:20. స్తెఫను చెప్పిన ఈ మాటలతో అదే ఆలోచన సభ ఎదుట యేసు చెప్పిన మాటలను పోల్చి చూడండి (మత్తయి 26:64).

57. అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి

విద్యావంతులైన మతస్థులు వారికి ఇష్టం లేని సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు అందరిలాగానే అన్యాయంగా, బలాత్కారంగా, అనాలోచితంగా ప్రవర్తించగలరు. తాము ద్వేషించిన యేసుప్రభువును గౌరవించిన మాటలు వినడానికి వారు ఓర్చుకోలేకపోయారు (యోహాను 15:18-25). కాబట్టి వారు విని నమ్మవలసిన మాటలు వినడానికి నిరాకరించారు.

58. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.

రోమ్‌వారి ప్రభుత్వం కింద ఉండి ఎవరినీ చంపడానికి వారికి హక్కు లేదు (యోహాను 18:31). అయితే వారి తీవ్ర కోపం కారణంగా దీన్ని ఆలోచనలోకి తీసుకోలేదు. స్తెఫను దేవదూషణ చేసేవాడనీ అతణ్ణి చంపడం తమ బాధ్యత అనీ వారు అనుకొన్నారేమో (లేదా, అనుకొన్నట్టు నటించారు). యోహాను 16:1; లేవీయకాండము 24:13-16 చూడండి. “సాక్షులు”– అతని మాటలు విని అతని మీద నేరం మోపినవారు. “సౌలు”– తరువాత క్రీస్తురాయబారి పౌలు అయ్యాడు.

59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
కీర్తనల గ్రంథము 31:5

లూకా 23:46. యేసు దేవుడని అతడు నమ్ముకొన్నట్టు స్పష్టమే. దేవుడు తప్ప అతని ఆత్మను ఎవరు చేర్చుకోగలరు? కీర్తనల గ్రంథము 31:5; ప్రసంగి 12:7 చూడండి.

60. అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

లూకా 23:34. అతనిలో ఉన్న దేవుని ఆత్మ సంపూర్ణత ఈ విషయంలో కూడా అతణ్ణి యేసుప్రభువులాగా తయారు చేసింది. మత్తయి 5:43-48 లో యేసు నేర్పిన ప్రేమ నియమాన్ని అతడు నెరవేర్చాడు. కొద్ది కాలంలోనే స్తెఫను అనేక విధాలుగా యేసులాగా అయిన సంగతి చాలా ప్రోత్సాహకరమైన విషయం. అతడు 2 కోరింథీయులకు 3:18 లో ఉన్న సత్యానికి ఆశ్చర్యమైన ఉదాహరణ. “కన్ను మూశాడు”– గ్రీకులో “నిద్రపోయాడు” (యోహాను 11:11, యోహాను 11:14; 1 కోరింథీయులకు 15:51; 1 థెస్సలొనీకయులకు 4:14). శరీరం “నిద్రపోతుంది”, ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |