Click to Donate & Support us or contact us for any Support 8898 318 318

Romans - రోమీయులకు 14

1. విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చు కొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు

1. Accept those whose faith is weak. Don't judge them where you have differences of opinion.

2. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.
ఆదికాండము 1:29, ఆదికాండము 9:3

2. The faith of some people allows them to eat anything. But others eat only vegetables because their faith is weak.

3. తినువాడు తిననివాని తృణీ కరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.

3. People who eat everything must not look down on those who do not. And people who don't eat everything must not judge those who do. God has accepted them.

4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

4. Who are you to judge someone else's servants? Whether they are faithful or not is their own master's concern. They will be faithful, because the Lord has the power to make them faithful.

5. ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.

5. Some people consider one day to be more holy than another. Others think all days are the same. Each person should be absolutely sure in his own mind.

6. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.

6. Those who think one day is special do it to honor the Lord. Those who eat meat do it to honor the Lord. They give thanks to God. Those who don't eat meat do it to honor the Lord. They also give thanks to God.

7. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.

7. We don't live for ourselves alone. And we don't die all by ourselves.

8. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము.

8. If we live, we live to honor the Lord. If we die, we die to honor the Lord. So whether we live or die, we belong to the Lord.

9. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను.

9. Christ died and came back to life. He did this to become the Lord of both the dead and the living.

10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహో దరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.
కీర్తనలు 72:2-4

10. Now then, who are you to judge your brother or sister? Why do you look down on them? We will all stand in God's courtroom to be judged.

11. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు
యెషయా 45:23, యెషయా 49:18

11. It is written, " 'You can be sure that I live,' says the Lord. 'And you can be just as sure that every knee will bow down in front of me. Every tongue will tell the truth to God.' " --(Isaiah 45:23)

12. అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.

12. So we will all have to explain to God the things we have done.

13. కాగా మనమికమీదట ఒకనికొకడు తీర్పు తీర్చ కుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చ యించు కొనుడి.

13. Let us stop judging one another. Instead, make up your mind not to put anything in your brother's way that would make him trip and fall.

14. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.

14. I am absolutely sure that no food is "unclean" in itself. I say this as one who belongs to the Lord Jesus. But some people may consider a thing to be "unclean." If they do, it is "unclean" for them.

15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచినయెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము.

15. Your brothers and sisters may be upset by what you eat. If they are, you are no longer acting as though you love them. So don't destroy them by what you eat. Christ died for them.

16. మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి.

16. Don't let something you consider good be spoken of as if it were evil.

17. దేవుని రాజ్యము భోజన మును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.

17. God's kingdom has nothing to do with eating or drinking. It is a matter of being right with God. It brings the peace and joy the Holy Spirit gives.

18. ఈ విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.

18. Those who serve Christ in this way are pleasing to God. They are pleasing to people too.

19. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.

19. So let us do all we can to live in peace. And let us work hard to build each other up.

20. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము.

20. Don't destroy the work of God because of food. All food is "clean." But it is wrong for you to eat anything that causes someone else to trip and fall.

21. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.

21. Don't eat meat if it will cause your brothers and sisters to fall. Don't drink wine or do anything else that will make them fall.

22. నీకున్న విశ్వా సము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు.

22. No matter what you think about those things, keep it between yourself and God. Blessed are those who do not have to feel guilty for what they allow.

23. అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.

23. But those who have doubts are guilty if they eat. Their eating is not based on faith. Everything that is not based on faith is sin.