Corinthians I - 1 కొరింథీయులకు 14 | View All

1. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.

1. కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి.

2. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకు చున్నాడు.

2. తనకు తెలియని భాషలో మాట్లాడే వాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మానవులతో కాదు. అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు.

3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు.

3. కాని దైవసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపరచాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవసందేశం చెపుతాడు.

4. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.

4. తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగిస్తాడు.

5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
సంఖ్యాకాండము 11:29

5. మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లాడితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో మాట్లాడే వాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభవించకపోతే తెలియని భాషల్లో మాట్లాడే వానికన్నా దైవసందేశం చెప్పేవాడే గొప్ప.

6. సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయ వలెనని యైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెనని యైనను మీతో మాటలాడకపోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?

6. సోదరులారా! నేను అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు ఒక క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దైవసందేశం తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి?

7. పిల్లనగ్రోవి గాని వీణ గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును?

7. పిల్లన గ్రోవి, వీణ వంటి ప్రాణం లేని వస్తువులు కూడా శబ్దం చేస్తాయి. వాటి స్వరాల్లో భేదం లేకుంటే ఏ రాగం వాయిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది?

8. మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చు నప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?

8. బాకా సక్రమంగా ఊది పిలవకుంటే యుద్ధానికి ఎవరు సిద్ధమౌతారు?

9. ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.

9. అదే విధంగా మీ నాలుకతో అర్థం అయ్యే పదాలు మాట్లాడితే తప్ప మీరేం మాట్లాడుతున్నారో యితరులకు ఎట్లా అర్థం అవుతుంది. మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది.

10. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.

10. ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు.

11. మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.

11. ఒకడు మాట్లాడే విషయం నేను అర్థం చేసుకోలేకపోతే, నేను అతనికి పరదేశీయునిగా, అతడు నాకు పరదేశీయునిగా ఉంటాము.

12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.

12. మీకు ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా కోరుకొండి.

13. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.

13. కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన వాటికి అర్థం చెప్పగలిగే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి.

14. నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.

14. ఎందుకంటే నేను నాకు తెలియని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని నా బుద్ధి అందులో పాల్గొనదు.

15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.

15. మరి నేను ఏం చెయ్యాలి? నేను నా ఆత్మతో మాత్రమే కాక, నా బుద్ధితో కూడా ప్రార్థిస్తాను. నా ఆత్మతోను నా మనస్సుతోను కూడా పాడుతాను.

16. లేనియెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్‌ అని వాడేలాగు పలుకును?

16. మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది?

17. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు.

17. మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల మేలు కలుగదు.

18. నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.

18. మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.

19. అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.

19. నేను సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పదివేల పదాలు మాట్లాడటం కన్నా నాకు తెలిసిన భాషల్లో ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని నా అభిప్రాయము.

20. సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.

20. సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్న పిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి.

21. అన్య భాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడియున్నది.
యెషయా 28:11-12

21. లేఖనాల్లో ఇలా వ్రాయబడి వుంది: “ఇతర భాషలు మాట్లాడే వాళ్ళ ద్వారా, విదేశీయుల పెదాల ద్వారా వీళ్ళతో నేను మాట్లాడుతాను. అయినా వాళ్ళు నా మాటలు వినరు.” యెషయా 28:11-12

22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది.

22. తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి వుంటే, అది విశ్వాసం లేని వాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్న వాళ్ళకు అవసరం లేదు. అయినా దైవ సందేశం విశ్వాసం ఉన్న వాళ్ళకే గాని, విశ్వాసం లేని వాళ్ళకు కాదు.

23. సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాట లాడుచున్నారని అనుకొందురు కదా?

23. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కాని వాళ్ళు లేక విశ్వాసం లేని వాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా?

24. అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.

24. దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట.

25. అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
యెషయా 45:14, దానియేలు 2:47, జెకర్యా 8:23

25. అతని మనస్సులో ఉన్న ఆలోచనలు బయట పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు” అని అంగీకరిస్తాడు.

26. సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.

26. సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? మీరంతా సమావేశమైనప్పుడు ఒకడు స్తుతిగీతం పాడుతాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడుతాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి.

27. భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్ప వలెను.

27. తెలియని భాషల్లో మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే, ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అర్థం విడమర్చి చెప్పగలవాడు ఉండాలి.

28. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.

28. అర్థం చెప్పేవాడు లేకపోయినట్లయితే తెలియని భాషలో మాట్లాడేవాడు మాట్లాడటంమానెయ్యాలి. అతడు తనలో తాను మాట్లాడుకోవచ్చు. లేదా దేవునితో మాట్లాడవచ్చు.

29. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.

29. దైవసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. మిగతావాళ్ళు చెప్పిన దాన్ని జాగ్రత్తగా గమనించాలి.

30. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.

30. ఒకవేళ అక్కడ కూర్చున్న వాళ్ళకు దేవుడు తన సందేశాన్ని చెప్పమంటే, మాట్లాడుతున్నవాడు మాట్లాడటం ఆపివెయ్యాలి.

31. అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.

31. అలా చేస్తే ఒకరి తర్వాత ఒకరు దైవసందేశం చెప్పవచ్చు. అలా చెయ్యటం వల్ల అందరూ నేర్చుకొంటారు. ప్రతీ ఒక్కరికి ప్రోత్సాహం కలుగుతుంది.

32. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.

32. దైవసందేశం చెప్పే వాళ్ళు తమ ప్రేరణను అదుపులో పెట్టుకోవచ్చు.

33. ఆలాగే పరిశుద్ధుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.

33. దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు.

34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.

34. ఇతర సంఘాలలో జరుగుతున్నట్లు స్త్రీలు సమావేశాలలో మౌనం వహించాలి. మాట్లాడటానికి వాళ్ళకు అధికారం లేదు. ధర్మశాస్త్రంలో, “స్త్రీలు అణకువతో ఉండాలి” అని వ్రాయబడి ఉంది.

35. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.

35. స్త్రీలు సంఘంలో మాట్లాడటం అవమానకరం. కనుక ఒకవేళ స్త్రీ ఒక విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి.

36. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?

36. దైవసందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు మాత్రమే లభించలేదు.

37. ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.

37. దేవుడు తన ద్వారా సందేశం పంపాడన్నవాడు, లేక తనలో ఆత్మీయ శక్తి ఉందని అనుకొన్నవాడు నేను మీకు వ్రాసినది ప్రభువు ఆజ్ఞ అని గుర్తించాలి.

38. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.

38. అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తించడు.

39. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,

39. సోదరులారా! దైవసందేశం చెప్పాలని ఆశించండి. తెలియని భాషలో మాట్లాడే వాళ్ళను ఆపకండి.

40. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి.

40. కాని అన్నిటినీ చక్కగా, సక్రమమైన పద్ధతిలో జరపండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians I - 1 కొరింథీయులకు 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

భాషల బహుమతి కంటే జోస్యం ప్రాధాన్యతనిస్తుంది. (1-5) 
గ్రంధాన్ని ముందుగా చెప్పడం, లేదా వ్యాఖ్యానించడం, భాషల్లో మాట్లాడటం వంటిది. ఈ దృగ్విషయం స్క్రిప్చర్ యొక్క సూటిగా వివరణ కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది, అహంకారానికి మరింత ఆకర్షణీయంగా ఉంది కానీ క్రైస్తవ దాతృత్వ లక్ష్యాలకు తక్కువ దోహదపడింది. ఇది వ్యక్తుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సమానంగా ప్రయోజనం చేకూర్చడంలో విఫలమైంది. గ్రహించలేనిది ఎప్పటికీ జ్ఞానోదయానికి ఉపయోగపడదు. అత్యంత అద్భుతమైన ప్రసంగాలు ప్రేక్షకుల పట్టుకు మించిన భాషలో ఉచ్చరించినట్లయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఏదైనా నైపుణ్యం లేదా స్వాధీనం విలువ దాని ఆచరణాత్మక ప్రయోజనం ద్వారా నిర్ణయించబడుతుంది. తీవ్రమైన, ఆధ్యాత్మిక ఆప్యాయత కూడా అవగాహన సాధన ద్వారా నిగ్రహించబడాలి; లేకుంటే, వ్యక్తులు తాము సమర్థిస్తున్నట్లు ప్రకటించే సత్యాలకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉంది.

తెలియని భాషలలో మాట్లాడటం లాభదాయకం కాదు. (6-14) 
ఒక అపొస్తలుడు కూడా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో కమ్యూనికేట్ చేస్తే తప్ప సమర్థవంతంగా బోధించలేడు. శ్రోతలకు అర్థం లేని పదాలు చెప్పడం కేవలం ఖాళీ వాక్చాతుర్యం మాత్రమే. వక్త మరియు ప్రేక్షకులు ఇద్దరూ ఒకరికొకరు విదేశీయులుగా మారడం వల్ల అలాంటి కమ్యూనికేషన్ దాని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమవుతుంది. క్రైస్తవ సమ్మేళనాలలో అన్ని మతపరమైన కార్యకలాపాలు ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి మరియు ప్రయోజనం పొందేందుకు అనుమతించే విధంగా నిర్వహించాలి. ప్రజల ఆరాధన మరియు ఇతర మతపరమైన ఆచారాలకు స్పష్టమైన మరియు సులభంగా అర్థమయ్యే భాష చాలా అనుకూలంగా ఉంటుంది. క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు పాండిత్య జ్ఞానం లేదా అనర్గళమైన ప్రసంగం కోసం గుర్తింపు పొందడం కంటే ఇతరులకు మేలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తాడు.

అర్థం చేసుకోగలిగే ఆరాధనకు ఉపదేశాలు. (15-25) 
అవగాహన లేని ప్రార్థనలు నిజమైన ఆమోదాన్ని పొందలేవు. నిజమైన క్రైస్తవ పరిచారకుడు వ్యక్తిగత ప్రశంసలను కోరుకోవడం కంటే ప్రజల ఆత్మలకు ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అందించడానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఇది క్రీస్తు యొక్క నిజమైన సేవకునిగా నిదర్శనం. పిల్లలు కొత్తదనంతో ఆకర్షించబడినప్పటికీ, క్రైస్తవులు మోసం లేదా ద్వేషం లేకుండా అమాయకత్వాన్ని కలిగి ఉండాలి. అయినప్పటికీ, వారు దుర్మార్గపు కుయుక్తులను తప్పించుకుంటూ నీతి వాక్యంలో కూడా నైపుణ్యం కలిగి ఉండాలి.
ప్రజలు దేవునిచే విడిచిపెట్టబడినప్పుడు, వారికి తెలియని భాషలో ఆరాధనను సమర్థించే నాయకులకు అప్పగించబడవచ్చు-ఈ పరిస్థితి ఎటువంటి ప్రయోజనాన్ని తీసుకురాదు. తెలియని భాషలో తమ సందేశాలను అందించే బోధకుల విషయంలో ఇది జరిగింది. ఒక అన్యజనులకు, పరిచారకులు తనకు మరియు సమాజానికి తెలియని భాషలో ప్రార్థన చేయడం లేదా బోధించడం అసంబద్ధంగా అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ, పరిచర్య చేసేవారు లేఖనాల యొక్క స్పష్టమైన వివరణలను అందించినట్లయితే లేదా సువార్త యొక్క ప్రాథమిక సత్యాలు మరియు సూత్రాలపై విశదీకరించినట్లయితే, అన్యజనులు లేదా నేర్చుకోని వ్యక్తి క్రైస్తవ మతం వైపుకు ఆకర్షించబడవచ్చు. వారి మనస్సాక్షి కదిలించబడవచ్చు, వారి హృదయ రహస్యాలు బహిర్గతం కావచ్చు, అపరాధాన్ని గుర్తించి, అసెంబ్లీలో దేవుని ఉనికిని గుర్తించేలా వారిని నడిపించవచ్చు. స్పష్టంగా మరియు సముచితంగా బోధించబడిన లేఖనాలు మనస్సాక్షిని మేల్కొల్పడానికి మరియు హృదయాన్ని కదిలించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

బహుమతులు వ్యర్థమైన ప్రదర్శన నుండి రుగ్మతలు; (26-33)
సామూహిక సమావేశాలలో మతపరమైన కార్యకలాపాల యొక్క ప్రాథమిక లక్ష్యం అందరినీ తీర్చిదిద్దడం. తెలియని భాషలో మాట్లాడే అభ్యాసానికి సంబంధించి, ఎవరైనా వ్యాఖ్యానించగల సామర్థ్యం ఉన్నట్లయితే, రెండు అద్భుత బహుమతులు ఏకకాలంలో ఉపయోగించబడతాయి. ఇది చర్చి నిర్మాణానికి మరియు శ్రోతల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి దారి తీస్తుంది. ప్రవచించే విషయంలో, అందరూ ఒకేసారి మాట్లాడకుండా, ఒకే సమావేశంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే మాట్లాడటం మంచిది. దేవుని ఆత్మచే ప్రేరేపించబడిన వ్యక్తి వారి వెల్లడిని తెలియజేసేటప్పుడు క్రమాన్ని మరియు అలంకారానికి కట్టుబడి ఉంటాడు. ప్రజలు తమ బాధ్యతలను విస్మరించమని లేదా వారి వయస్సు లేదా స్థానానికి భిన్నంగా ప్రవర్తించమని దేవుడు ఆదేశించడు.

మరియు చర్చిలో మాట్లాడే స్త్రీల నుండి. (34-40)
క్రైస్తవ స్త్రీలు ఇంట్లో తమ భర్తల నుండి మతపరమైన అవగాహనను పొందాలని అపొస్తలుడి ప్రోత్సాహం, విశ్వాసుల కుటుంబాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సమీకరించాలని సూచిస్తుంది. క్రీస్తు యొక్క ఆత్మ స్థిరంగా ఉంటుంది మరియు ఏదైనా వెల్లడి అపొస్తలుడి బోధనలకు విరుద్ధంగా ఉంటే, అవి ఒకే ఆత్మ నుండి ఉద్భవించవు. చర్చిలో శాంతి, సత్యం మరియు క్రమాన్ని కాపాడుకోవడంలో ప్రయోజనకరమైన వాటిని అనుసరించడం, దాని శ్రేయస్సుకు హాని కలిగించని వాటిని సహించడం మరియు మంచి ప్రవర్తన, క్రమబద్ధత మరియు మర్యాదలను సమర్థించడం.



Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |