“రుజువు”– మనం క్రీస్తులో నమ్మకం ఉంచడం కారణంగా మనకు వచ్చే హింసలనూ కష్టాలనూ ఓర్పుతో సహించడం మన నమ్మకం నిజమైనది అనేందుకు రుజువు. దేవుని తీర్పు న్యాయమైనది అనేందుకు కూడా ఇది రుజువే. ఇక్కడ దీనికి అర్థం స్పష్టంగా లేదు గాని దేవుడు వారిని ఎన్నుకున్నదీ వారి విషయంలో ఇంత వరకు జరిగించినదీ న్యాయమేనని వారు విశ్వాసంలో నిలకడగా ఉండడం వల్ల రుజువు అయింది. ఫిలిప్పీయులకు 1:27-28 పోల్చి చూడండి.
“దేవుని రాజ్యానికి”– మత్తయి 4:17 నోట్.
“తగినవారుగా”– లూకా 20:35; ప్రకటన గ్రంథం 3:4 పోల్చి చూడండి. ఎవరూ పాపవిముక్తికీ రక్షణకూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికీ అర్హులు కారు – రోమీయులకు 3:9, రోమీయులకు 3:19, రోమీయులకు 3:23; కొలొస్సయులకు 1:13-14. కానీ విశ్వాసులు తమ ప్రవర్తన ద్వారా, విశ్వాసంలో కొనసాగడం ద్వారా దేవుడు వారిని మార్చిన విషయాన్ని చూపిస్తారు, దేవుడు తన రాజ్యానికి తగినట్టు జీవించేలా వారికి సామర్థ్యం ఇచ్చిన విషయాన్నీ రుజువు చేస్తారు.
“కడగండ్లు”– రోమీయులకు 8:17; మత్తయి 5:10. ఇది వారి అర్హతకు రుజువు. దేవుని రాజ్యం కోసం బాధలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండనివారు ఆ రాజ్యానికి అర్హులు కారు.