Joshua - యెహోషువ 8 | View All

1. మరియయెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించు చున్నాను.

1. GOD said to Joshua, 'Don't be timid and don't so much as hesitate. Take all your soldiers with you and go back to Ai. I have turned the king of Ai over to you--his people, his city, and his land.

2. నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్ల నుంచుము.

2. 'Do to Ai and its king what you did to Jericho and its king. Only this time you may plunder its stuff and cattle to your heart's content. Set an ambush behind the city.'

3. యెహోషువయు యోధు లందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహో షువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి

3. Joshua and all his soldiers got ready to march on Ai. Joshua chose thirty thousand men, tough, seasoned fighters, and sent them off at night

4. వారి కాజ్ఞాపించినదేమనగా ఈ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూర మునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.

4. with these orders: 'Look sharp now. Lie in ambush behind the city. Get as close as you can. Stay alert.

5. నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించె దము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.

5. I and the troops with me will approach the city head-on. When they come out to meet us just as before, we'll turn and run.

6. మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలు దేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయి నప్పుడు మీరు పొంచియుండుట మాని

6. They'll come after us, leaving the city. As we are off and running, they'll say, 'They're running away just like the first time.'

7. లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.

7. That's your signal to spring from your ambush and take the city. GOD, your God, will hand it to you on a platter.

8. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్ట వలెను.

8. Once you have the city, burn it down. GOD says it, you do it. Go to it. I've given you your orders.'

9. ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.

9. Joshua sent them off. They set their ambush and waited between Bethel and Ai, just west of Ai. Joshua spent the night with the people.

10. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జను లకుముందుగా హాయిమీదికి పోయిరి.

10. Joshua was up early in the morning and mustered his army. He and the leaders of Israel led the troops to Ai.

11. అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.

11. The whole army, fighting men all, marched right up within sight of the city and set camp on the north side of Ai. There was a valley between them and Ai.

12. వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.

12. He had taken about five thousand men and put them in ambush between Bethel and Ai, west of the city.

13. వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగి పోయెను.

13. They were all deployed, the main army to the north of the city and the ambush to the west. Joshua spent the night in the valley.

14. హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయు టకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.

14. So it happened that when the king of Ai saw all this, the men of the city lost no time; they were out of there at the crack of dawn to join Israel in battle, the king and his troops, at a field en route to the Arabah. The king didn't know of the ambush set against him behind the city.

15. యెహోషువయు ఇశ్రాయేలీయులంద రును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు

15. Joshua and all Israel let themselves be chased; they ran toward the wilderness.

16. వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.

16. Everybody in the city was called to the chase. They pursued Joshua and were led away from the city.

17. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.

17. There wasn't a soul left in Ai or Bethel who wasn't out there chasing after Israel. The city was left empty and undefended as they were chasing Israel down.

18. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనునీవు చేతపట్టు కొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.

18. Then GOD spoke to Joshua: 'Stretch out the javelin in your hand toward Ai--I'm giving it to you.' Joshua stretched out the javelin in his hand toward Ai.

19. అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.

19. At the signal the men in ambush sprang to their feet, ran to the city, took it, and quickly had it up in flames.

20. హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.

20. The men of Ai looked back and, oh! saw the city going up in smoke. They found themselves trapped with nowhere to run.

21. పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.

21. The army on the run toward the wilderness did an about-face--Joshua and all Israel, seeing that the ambush had taken the city, saw it going up in smoke, turned and attacked the men of Ai.

22. తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.

22. Then the men in the ambush poured out of the city. The men of Ai were caught in the middle with Israelites on both sides--a real massacre. And not a single survivor.

23. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.

23. Except for the king of Ai; they took him alive and brought him to Joshua.

24. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రా యేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.

24. When it was all over, Israel had killed everyone in Ai, whether in the fields or in the wilderness where they had chased them. When the killing was complete, the Israelites returned to Ai and completed the devastation.

25. ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.

25. The death toll that day came to 12,000 men and women--everyone in Ai.

26. యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టు కొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.

26. Joshua didn't lower his outstretched javelin until the sacred destruction of Ai and all its people was completed.

27. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.

27. Israel did get to take the livestock and loot left in the city; GOD's instructions to Joshua allowed for that.

28. అట్లు యెహోషువ హాయినిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.

28. Joshua burned Ai to the ground. A 'heap' of nothing forever, a 'no-place'--go see for yourself.

29. యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.

29. He hanged the king of Ai from a tree. At evening, with the sun going down, Joshua ordered the corpse cut down. They dumped it at the entrance to the city and piled it high with stones--you can go see that also.

30. మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము

30. Then Joshua built an altar to the GOD of Israel on Mount Ebal.

31. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.

31. He built it following the instructions of Moses the servant of GOD to the People of Israel and written in the Book of The Revelation of Moses, an altar of whole stones that hadn't been chiseled or shaped by an iron tool. On it they offered to GOD Whole-Burnt-Offerings and sacrificed Peace-Offerings.

32. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.

32. He also wrote out a copy of The Revelation of Moses on the stones. He wrote it with the People of Israel looking on.

33. అప్పుడు ఇశ్రా యేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రా యేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ
యోహాను 4:20

33. All Israel was there, foreigners and citizens alike, with their elders, officers, and judges, standing on opposite sides of the Chest, facing the Levitical priests who carry GOD's Covenant Chest. Half of the people stood with their backs to Mount Gerizim and half with their backs to Mount Ebal to bless the People of Israel, just as Moses the servant of GOD had instructed earlier.

34. ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును విను చుండగా

34. After that, he read out everything written in The Revelation, the Blessing and the Curse, everything in the Book of The Revelation.

35. యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు.

35. There wasn't a word of all that Moses commanded that Joshua didn't read to the entire congregation--men, women, children, and foreigners who had been with them on the journey.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మనల్ని దేవుని నుండి వేరుచేసే అసహ్యకరమైన అడ్డంకి అయిన పాపం నుండి మనల్ని మనం హృదయపూర్వకంగా వదిలించుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే మనం దేవుని నుండి ఓదార్పునిచ్చే మార్గదర్శకత్వాన్ని పొందగలము. మన క్రైస్తవ ప్రయాణం మరియు ఆధ్యాత్మిక పోరాటాలలో ఆయన దిశానిర్దేశం మనతో ఆయన సయోధ్యకు స్పష్టమైన సంకేతం అవుతుంది. జాషువాను ముందుకు సాగమని దేవుడు ఎలా ప్రోత్సహించాడో, అలాగే మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తాడు. Ai విషయానికొస్తే, జెరిఖోలో ఉన్నందున దోపిడీలు నాశనం చేయబడవు, ప్రజలు అదే నేరానికి పాల్పడే ప్రమాదాన్ని తొలగిస్తారు. నిషేధించబడిన దోపిడిని తీసుకున్న ఆచాన్ తన ప్రాణాలను మరియు ఆస్తులను రెండింటినీ కోల్పోయాడు. అయితే, శాపగ్రస్తమైన వాటిని మానుకున్న వారికి వారి విధేయతకు త్వరగా ప్రతిఫలం లభించింది. దేవుడు అనుమతించేవాటిలో ఓదార్పును కనుగొనడంలో కీలకం ఏమిటంటే, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండటం. స్వీయ-తిరస్కరణలో పాల్గొనడం ఎప్పటికీ నష్టానికి దారితీయదు కానీ బహుమతులు మరియు ఆశీర్వాదాలకు దారితీయదు. (1-2)

జాషువా జ్ఞానయుక్తమైన మరియు జాగ్రత్తగా వ్యవహరించిన విధానాన్ని మనం గమనిద్దాం. తమ ఆధ్యాత్మిక పోరాటాలలో పట్టుదలతో ఉండాలనుకునే వారు సంతృప్తి చెందలేరు లేదా సౌకర్యాన్ని ఇష్టపడరు. ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదం కోసం అతను ఒంటరిగా లోయలోకి వెళ్లి ఉండవచ్చు మరియు అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పని పూర్తయ్యే వరకు స్థిరంగా, కదలకుండా ఉండిపోయాడు. తమ ఆధ్యాత్మిక విరోధులకు వ్యతిరేకంగా ఒక వైఖరిని తీసుకున్న వారు తమ నిబద్ధతను ఎన్నడూ వెనక్కి తీసుకోకూడదు లేదా ఉపసంహరించుకోకూడదు. (3-22)

నీతిమంతుడైన న్యాయాధిపతిగా, దేవుడు కనానీయుల దుష్టత్వం కారణంగా వారిపై తీర్పును ప్రకటించాడు మరియు ఇశ్రాయేలీయులు అతని శాసనాన్ని అమలు చేశారు. అయినప్పటికీ, ఇతరులు అనుసరించడానికి మేము వారి చర్యలను సాధారణ ఉదాహరణగా తీసుకోకూడదు. రాజు యొక్క తీవ్రమైన చికిత్స నిర్దిష్ట కారణాల వల్ల ఆపాదించబడుతుంది; అతను చెడ్డవాడు, నీచుడు మరియు ఇశ్రాయేలు దేవుణ్ణి దూషించేవాడు కూడా కావచ్చు. (23-29)

ఏబాల్ మరియు గెరిజిమ్ పర్వతాలకు చేరుకున్న తర్వాత, జాషువా ఇశ్రాయేలు యొక్క అస్థిర రాజ్యాన్ని మరియు వారి శత్రువులను పట్టించుకోకుండా సమయాన్ని వృథా చేయలేదు. మత్తయి 6:33లో నియమించబడినట్లుగానే, ఆయన తన ప్రజలతో ప్రభువు యొక్క ఒడంబడికను వెంటనే పునరుద్ఘాటించాడు. వారు ఒక బలిపీఠాన్ని నిర్మించారు మరియు దేవునికి బలులు అర్పించారు, మధ్యవర్తి ద్వారా సజీవ త్యాగాలుగా దేవునికి తమ అంకితభావాన్ని సూచిస్తారు, ఇది మన కోసం క్రీస్తు త్యాగాన్ని గుర్తుచేస్తుంది, ఇది మనకు దేవునితో శాంతినిస్తుంది. దేవుని చట్టాన్ని వ్రాతపూర్వకంగా కలిగి ఉండటం ఏ ప్రజలకైనా గొప్ప ఆశీర్వాదం మరియు ప్రతి ఒక్కరూ చూడగలిగేలా మరియు చదవగలిగేలా అందరికీ అర్థమయ్యే భాషలో వ్రాతపూర్వక చట్టం ఉండటం సముచితం. (30-35)



Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |