Peter I - 1 పేతురు 2 - గ్రంథ విశ్లేషణ

1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల

1. Come now, you rich, weep and wail over your impending miseries.

2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,

2. Your wealth has rotted away, your clothes have become moth-eaten,

3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
కీర్తనలు 34:8

3. your gold and silver have corroded, and that corrosion will be a testimony against you; it will devour your flesh like a fire. You have stored up treasure for the last days.

4. మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై,
కీర్తనలు 118:22, యెషయా 28:16, దానియేలు 2:34-35

4. Behold, the wages you withheld from the workers who harvested your fields are crying aloud, and the cries of the harvesters have reached the ears of the Lord of hosts.

5. యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
నిర్గామకాండము 19:6, యెషయా 61:6

5. You have lived on earth in luxury and pleasure; you have fattened your hearts for the day of slaughter.

6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
యెషయా 28:16

6. You have condemned; you have murdered the righteous one; he offers you no resistance.

7. విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
కీర్తనలు 118:22, దానియేలు 2:34-35

7. Be patient, therefore, brothers, until the coming of the Lord. See how the farmer waits for the precious fruit of the earth, being patient with it until it receives the early and the late rains.

8. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
యెషయా 8:14-15

8. You too must be patient. Make your hearts firm, because the coming of the Lord is at hand.

9. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.
నిర్గామకాండము 19:5, నిర్గామకాండము 23:22, ద్వితియోపదేశకాండము 4:20, ద్వితియోపదేశకాండము 7:6, ద్వితియోపదేశకాండము 10:15, ద్వితియోపదేశకాండము 14:2, యెషయా 9:2, యెషయా 42:12, యెషయా 43:20-21, నిర్గామకాండము 19:6, యెషయా 61:6

9. Do not complain, brothers, about one another, that you may not be judged. Behold, the Judge is standing before the gates.

10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
హోషేయా 1:6, హోషేయా 1:10, హోషేయా 2:1, హోషేయా 2:23

10. Take as an example of hardship and patience, brothers, the prophets who spoke in the name of the Lord.

11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,
కీర్తనలు 39:12

11. Indeed we call blessed those who have persevered. You have heard of the perseverance of Job, and you have seen the purpose of the Lord, because "the Lord is compassionate and merciful."

12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
యెషయా 10:3

12. But above all, my brothers, do not swear, either by heaven or by earth or with any other oath, but let your "Yes" mean "Yes" and your "No" mean "No," that you may not incur condemnation.

13. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.

13. Is anyone among you suffering? He should pray. Is anyone in good spirits? He should sing praise.

14. రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి.

14. Is anyone among you sick? He should summon the presbyters of the church, and they should pray over him and anoint (him) with oil in the name of the Lord,

15. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.

15. and the prayer of faith will save the sick person, and the Lord will raise him up. If he has committed any sins, he will be forgiven.

16. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.

16. Therefore, confess your sins to one another and pray for one another, that you may be healed. The fervent prayer of a righteous person is very powerful.

17. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.
సామెతలు 24:21

17. Elijah was a human being like us; yet he prayed earnestly that it might not rain, and for three years and six months it did not rain upon the land.

18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.

18. Then he prayed again, and the sky gave rain and the earth produced its fruit.

19. ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.

19. My brothers, if anyone among you should stray from the truth and someone bring him back,

20. తప్పిద మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;

20. he should know that whoever brings back a sinner from the error of his way will save his soul from death and will cover a multitude of sins.