Peter II - 2 పేతురు 3 - గ్రంథ విశ్లేషణ

1. ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను

“జ్ఞాపకం”– 2 పేతురు 1:12-15.

2. పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.

“ప్రవక్తలు”– 2 పేతురు 1:19-21. “ఆజ్ఞ”– 2 పేతురు 2:21. ఇక్కడ మళ్ళీ విశ్వాసుల ఎదుగుదలకు పాత ఒడంబడిక, క్రొత్త ఒడంబడిక రెండు గ్రంథాలూ ప్రాముఖ్యమేనని పేతురు నొక్కి చెప్తున్నాడు.

3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,

“పరిహాసకులు”– 2 పేతురు 2:12; 2 దినవృత్తాంతములు 36:16; కీర్తనలు 1:1; కీర్తనలు 73:8; కీర్తనలు 74:22; సామెతలు 14:9; సామెతలు 15:12; సామెతలు 19:29; సామెతలు 21:24; యెషయా 28:14; అపో. కార్యములు 13:41; యూదా 1:18. బలమైన ఆధారాలు గల క్రైస్తవ నమ్మకాల గురించి అజ్ఞానంతో కొందరు ఎగతాళి చేస్తుంటారు. సాక్ష్యాధారాలనూ రుజువులనూ పరిశీలించి తమ చెడు కోరికలను విడిచిపెట్టడం కష్టం, ఎగతాళి చేయడం తేలికే.

4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్త మును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవ

“రాకడ”– మత్తయి 24:3, మత్తయి 24:10; యోహాను 14:3. యేసుప్రభువు చాలా కాలంగా తిరిగి రాలేదు కాబట్టి ఎప్పటికీ రాడని ఈ పరిహాసకులు అనుకుంటారు.

5. ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
ఆదికాండము 1:6-9

“బుద్ధిపూర్వకంగా మరిచిపోయే”– తమ చెడు కోరికలు తీర్చుకోవడమే వారికి ఇష్టం. దానికి అడ్డు వచ్చే దేనినీ మనసులో పెట్టుకునేందుకు ఇష్టపడరు. వారి నమ్మకాలు వాస్తవాలపై ఆధారపడవు. ఏది నిజమై ఉండాలని వారు ఆశిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటాయి. రోమీయులకు 1:28 పోల్చి చూడండి. వారి అజ్ఞానం, అపనమ్మకం వారు కావాలని బుద్ధి పూర్వకంగా తెచ్చిపెట్టుకున్నవే. “దేవుని వాక్కు వల్లే”– ఆదికాండము 1:1-3, ఆదికాండము 1:6, ఆదికాండము 1:9, ఆదికాండము 1:11, ఆదికాండము 1:14, ఆదికాండము 1:20, ఆదికాండము 1:24, ఆదికాండము 1:26; కీర్తనలు 33:6.

6. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
ఆదికాండము 7:11-21

7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

“వాక్కు”– హెబ్రీయులకు 11:3. “మంటలు”– వ 12; యెషయా 66:15-16; నహూము 1:6; మలాకీ 4:1; ప్రకటన గ్రంథం 20:9. ఆకాశాలు, భూమి అగ్నివల్ల నాశనం అయిపోయేది ఎప్పుడు? పాపవిముక్తి లేనివారి తీర్పు సమయంలోనే, అంతకన్నా ముందు కాదు (ప్రకటన గ్రంథం 20:11-15). మత్తయి 19:28; అపో. కార్యములు 3:21; రోమీయులకు 8:19-21 పోల్చి చూడండి.

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
కీర్తనలు 90:4

క్రీస్తు తాను తిరిగి వస్తానని వాగ్దానం చేసిన తరువాత ఎంతో కాలం గడిచిపోయినట్టు మనుషులకు అనిపిస్తుంది. దేవునికైతే అది రెండు రోజుల్లాగా ఉంది. మనకు లాగా కాలం అనేది ఆయన అనుభవంలో లేదు. ఆయన క్రీస్తును తిరిగి పంపించేందుకు మన లెక్క ప్రకారం రెండు వేల సంవత్సరాలు ఆగాడంటే అందులో ఆయనకు సదుద్దేశం ఉంది. మనుషులను పశ్చాత్తాపంలోకి నడుపుతూ ఉన్నాడు, ఇక జాగు చేయనవసరం లేదని ఆయనకు తెలిసేంత వరకూ ఆ పని చేస్తూ ఉంటాడు. ఆదికాండము 6:3 పోల్చి చూడండి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
హబక్కూకు 2:3-4

“ఎవరూ నశించకూడదని”– యెహేజ్కేలు 18:32; 1 తిమోతికి 2:4; యోహాను 3:16. పశ్చాత్తాపం గురించి నోట్ మత్తయి 3:2; మొ।।.

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన

“ప్రభు దినం”– యెషయా 2:12; యెషయా 13:6-13; యోవేలు 2:1-2, యోవేలు 2:30-31; Zeph 1:14-18; అపో. కార్యములు 2:20; 1 థెస్సలొనికయులకు 5:2; 2 థెస్సలొనికయులకు 2:2. “దినం”– అంటే అక్షరాలా 24 గంటల రోజు కానవసరం లేదు. ఆదికాండము 2:4; యోహాను 9:4; యెషయా 34:8; 1 థెస్సలొనికయులకు 5:5, 1 థెస్సలొనికయులకు 5:8 చూడండి. ఈ “దినం” కాలం వెయ్యి సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. అంటే క్రీస్తు తిరిగి వచ్చినప్పటినుంచి ప్రకటన గ్రంథం 20:11-15 లో ఉన్న అంతిమ తీర్పు సమయం వరకు ఈ “దినం” ఉండవచ్చు. “దొంగ”– 1 థెస్సలొనికయులకు 5:1-3; ప్రకటన గ్రంథం 3:3; ప్రకటన గ్రంథం 16:15. “వేడి”– వ 7. పేతురు భవిష్యత్తులో జరిగే వాటి క్రమం, జాబితా ఇవ్వడం లేదు. మనుషుల అంతిమ తీర్పూ, ఆకాశాలూ భూమీ పూర్తిగా నాశనం అయిపోవడమూ జరిగే సమయానికి ముందు క్రీస్తు తిరిగి వచ్చి వెయ్యి సంవత్సరాలు భూమిపై పరిపాలించే అవకాశాన్ని పేతురు ఇక్కడ రాసిన మాటలు త్రోసి పుచ్చడం లేదు (ప్రకటన గ్రంథం 20:1-6). ఆ వెయ్యి సంవత్సరాలకు ముందు, తరువాత కూడా మంటల ద్వారా తీర్పు ఉంటుంది. 2 థెస్సలొనికయులకు 1:7; యెషయా 24:6-13; యెషయా 29:6; యెషయా 30:30; ప్రకటన గ్రంథం 13:8-9; ప్రకటన గ్రంథం 20:9, ప్రకటన గ్రంథం 20:14-15.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

“పవిత్ర...భక్తి”– తీతుకు 2:11-14; 1 పేతురు 1:15; 1 యోహాను 1:6. “ఎలాంటివారై”– నాశనం కాబోతున్న ఈ లోక విషయాల కోసం బ్రతకడంలో ఏమన్నా అర్థం ఉందా? 1 యోహాను 2:15-17 పోల్చి చూడండి.

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
యెషయా 34:4

“దేవుని దినం”– వ 10; 1 కోరింథీయులకు 1:8; 1 కోరింథీయులకు 3:13; 1 కోరింథీయులకు 5:5; 2 కోరింథీయులకు 1:14; ఫిలిప్పీయులకు 1:6. “శీఘ్రతరం చేస్తూ”– ఆ రోజు త్వరగా రావడానికి విశ్వాసులంగా మనం ఏమి చెయ్యగలం? యేసుప్రభువు మనకు చెప్పినదాన్ని చేయడం ద్వారానే ఆ దినాన్ని శీఘ్రతరం చేయవచ్చు. ఆయన రాజ్యం వచ్చేలా ప్రార్థించాలని ఆయన మనకు చెప్పాడు (మత్తయి 6:10), తన శుభవార్తను భూమిపై ప్రజలందరికీ వినిపించాలన్నాడు (మత్తయి 28:19; మార్కు 16:15). ఆయన సంఘం ఈ పనిని పూర్తి చేసినప్పుడు అంతం వస్తుంది (మత్తయి 24:14).

13. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
యెషయా 60:21, యెషయా 65:17, యెషయా 66:22

“కొత్త”– యెషయా 65:17; ప్రకటన గ్రంథం 21:1. “న్యాయం నివాసం”– ప్రకటన గ్రంథం 21:27; ప్రకటన గ్రంథం 22:14-15; కీర్తనలు 15:1-5; కీర్తనలు 89:14; కీర్తనలు 118:19; యెషయా 11:4-5; 1 కోరింథీయులకు 6:9-10. నీతిన్యాయాలను చిన్నచూపు చూచి వాటిని అనుసరిస్తున్న అలాంటివారిని హింసించే ఈ లోకానికి అది పూర్తిగా వ్యతిరేకం.

14. ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.

Dn 12:10; 1 కోరింథీయులకు 1:8; ఎఫెసీయులకు 1:4; ఎఫెసీయులకు 5:27; ఫిలిప్పీయులకు 1:10; ఫిలిప్పీయులకు 2:15; 1 థెస్సలొనికయులకు 5:23. “శాంతితో”– పాపం, అవిధేయత, అపనమ్మకం ఆయనపై పడుతున్న దెబ్బల వంటివి. నీతిన్యాయాలు, శాంతి ఎప్పుడూ కలిసే ఉంటాయి (కీర్తనలు 85:10; యెషయా 27:5; యెషయా 32:17). ఆయన మనకు చెప్పినట్టు గనుక మనం జీవిస్తే ఆయన రాక కోసం ఆనందంతో, ధైర్యంతో ఎదురు చూడవచ్చు.

15. మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు.

“సహనం”– వ 9. “పౌలు”– దేవుని సహనం గురించి పౌలు రోమీయులకు 2:4; రోమీయులకు 3:25-26; రోమీయులకు 9:22-23; రోమీయులకు 10:21 లో రాశాడు. ఇక్కడ పేతురు ఆ లేఖ గురించి చెప్తున్నాడేమో.

16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.

“గ్రహించడానికి కష్టం”– పౌలు ఉత్తరాలు కొన్నింటిలో కనిపించే కొన్ని భాగాల్లో భాష తీరు, అంశాలు కొన్ని కష్టంగా అనిపిస్తుంది (రోమ్‌వారికి రాసిన లేఖ ఇందుకు మంచి ఉదాహరణ). బాగా ధ్యానించకుండా, మరి ముఖ్యంగా దేవుని ఆత్మ ఇచ్చే గ్రహింపు, జ్ఞానం తోడ్పాటు లేకుండా మనం వాటిని అర్థం చేసుకోలేము. “ఉపదేశం పొందనివారు”– దేవుణ్ణి ఎరుగనివారు, ఆయన వాక్కును ఎలా చదవాలి, అర్థం చేసుకోవాలి అన్న సంగతి గురించి తెలియనివారు. “నిలకడ లేనివారు”– 2 పేతురు 2:14; యాకోబు 1:8 – అంటే సత్యంలో స్థిరంగా లేనివారు (కొలస్సీయులకు 1:23; కొలస్సీయులకు 4:12; 1 థెస్సలొనికయులకు 3:8; 2 థెస్సలొనికయులకు 2:15; 1 పేతురు 5:9-10). “వక్రం”– అపో. కార్యములు 20:30; 2 కోరింథీయులకు 4:2; గలతియులకు 1:7; యిర్మియా 23:36. “నాశనానికి”– 2 పేతురు 2:1, 2 పేతురు 2:3; 2 థెస్సలొనికయులకు 2:10. దేవుడు వెల్లడి చేసినదాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఉపదేశాలను గనుక మనం వక్రం చేస్తే, మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆయన శిక్ష నుంచి తప్పించుకోలేము.

17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి.

18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.

“కృప”– కృప మనకు నేర్పించేదేమిటో మనం దేనిలో ఎదుగుతూ ఉండాలో తీతుకు 2:11-14 లో కనిపిస్తున్నది. “జ్ఞానం”– ఎఫెసీయులకు 1:17; ఎఫెసీయులకు 3:18-19; ఫిలిప్పీయులకు 3:10; కొలస్సీయులకు 1:9; కొలస్సీయులకు 2:2. “పెరుగుతూ”– ఎఫెసీయులకు 4:12-15; 1 పేతురు 2:2. మహిమ క్రీస్తుకే చెందాలని పేతురుకు తెలుసు. దేవుడొక్కడే మహిమకు పాత్రుడు. యెషయా 42:8; రోమీయులకు 11:36; రోమీయులకు 16:27. క్రీస్తు ఆయన అవతారం.