Revelation - ప్రకటన గ్రంథము 10 | View All

1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.

ఈ బలిష్ఠుడైన దేవదూతను గురించిన వివరణను బట్టి చూస్తే ఈయన యేసుప్రభువా అనిపిస్తుంది. ఈ గ్రంథంలో మేఘం, రంగుల విల్లు రెండూ దేవునితో సంబంధం గలవి – ప్రకటన గ్రంథం 1:7; ప్రకటన గ్రంథం 4:3; ప్రకటన గ్రంథం 14:14. ముద్రల విషయంలాగే 6వ బూరకూ 7వ బూరకూ మధ్య కూడా కథలో ఒక అంతరాయం వచ్చింది (ప్రకటన గ్రంథం 7:1-17 గురించిన నోట్ చూడండి). నడుమ రాసిన ఈ మాటలు ఇక్కడనుంచి ప్రకటన గ్రంథం 11:15 వరకు ఉన్నాయి. ఈ భాగంలో వివరించిన భవిష్యత్తు సంగతులు ఆరో బూర ఊదడం వల్ల కలగవు. అసలు వీటిల్లో కొన్ని సంగతులు (ప్రకటన గ్రంథం 11:1-6) బూరల్లో ఒక్కటి కూడా ఊదకముందే, ఆ మాటకొస్తే ఆరో ముద్ర విప్పకముందే జరుగుతాయనడానికి ఆస్కారం ఉంది. “సూర్యమండలం లాంటిది”, “మండుతున్న స్తంభాలలాంటివి”– ఈ మాటలు ప్రకటన గ్రంథం 1:15-16 లోని క్రీస్తును గురించిన దర్శనాన్ని జ్ఞాపకం చేస్తాయి.

2. ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

“చిన్న పత్రం”– ఇది ప్రకటన గ్రంథం 5:1 లోని ఏడు ముద్రలున్న పత్రమని అనుకోవడానికి కారణాలు కనబడడం లేదు. యోహాను దీన్ని “ఆ పత్రం” అనలేదు (ఇది అది ఒకే పత్రమైతే “ఆ పత్రం” అనడా?). అంతేగాక ప్రకటన గ్రంథం 5:1 లోని పత్రం పరలోకంలో ఉంది, అది పూర్తిగా విప్పబడలేదు (ఏడో బూరను ఊదడం ఇంకా జరగలేదు, దాని సమయంలో ఏడు పాత్రలను – 15,16 అధ్యాయాలు – కుమ్మరించడం జరగలేదు). అయితే దేవదూత ఈ చిన్న పత్రాన్ని తినాలని యోహానును ఆదేశించాడు, ఇది పూర్తిగా విప్పి ఉంది. ఈ చిన్న పత్రంలో ఆ ఏడు ముద్రలున్న పత్రంలోని సంగతులపైగా చేర్చబడిన కొన్ని దర్శనాలూ భవిష్యత్ వాక్కులూ ఉన్నాయనిపిస్తుంది. ఇవి ముద్రలూ, బూరలూ వరుస క్రమంలో రావు. ఈ చిన్న పత్రంలో ప్రకటన గ్రంథం 11:1-13 లోని సంగతులు మాత్రమే కాక 12–14,17,18 అధ్యాయాలు కూడా ఉండి ఉండవచ్చు (యోహాను ఈ చిన్న పత్రాన్ని తిన్నాక అతనితో దేవదూత చెప్పినది గమనించండి – వ 11). కానీ తప్పకుండా ఇలా ఉందని చెప్పే వీలు లేదు. “నేలమీద మోపి”– ఈ మాటలను బట్టి చూస్తే ఇది విజయవంతంగా భూమిని స్వంతం చేసుకోవడం అనుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 11:24; యెహోషువ 1:3 పోల్చి చూడండి. అదే అర్థం ఈ మాటలకు ఉంటే (కొందరు పండితులు కాదంటారు) క్రీస్తు మళ్ళీ జ్ఞప్తికి వస్తాడు. భూమినీ, సముద్రాన్నీ సొంతం చేసుకోవడానికి ఆయనకు తప్ప మరెవరికి హక్కు ఉంది?

3. సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.

“సింహం గర్జించినట్లు”– యూదా గోత్ర “సింహం” (ప్రకటన గ్రంథం 5:5) జ్ఞప్తికి వస్తాడు. అయితే ఈ గ్రంథంలో వేరే చోట్ల క్రీస్తును ఒక దేవదూత అని పిలవడం జరిగిందా? జరగలేదు గానీ బైబిలు అంతటినీ చూస్తే జరిగిందని తెలుస్తుంది. ఆదికాండము 16:7 చూడండి. అయితే క్రీస్తును “బలిష్ఠుడైన వేరొక దేవదూత” అనడం తగిన విషయమా? కాదని కొందరి అభిప్రాయం. కాబట్టి ఈ దూత క్రీస్తో కాదో ఖచ్చితంగా చెప్పలేము. ఒక వేళ ఆయన 5:2లోని బలిష్ఠుడైన దేవదూత కావచ్చు.

4. ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.
దానియేలు 8:26, దానియేలు 12:4, దానియేలు 12:9

ఈ ఏడు ఉరుములు పలికినదేమిటి? ఏ మనిషికీ తెలియదు. దాన్ని గురించి ఊహాగానం చేయడం నిష్‌ప్రయోజనం. ద్వితీయోపదేశకాండము 29:29 తో పోల్చి చూడండి.

5. మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
ఆదికాండము 14:19, ఆదికాండము 14:22, ద్వితీయోపదేశకాండము 32:40, Neh-h 9 6, దానియేలు 12:7

ఈ గంబీరమైన గ్రంథంలో ఇది చాలా గంబీరమైన సమయం. ఇది ఈ గ్రంథాన్ని, దీనిలోని సంఘటనలను అర్థం చేసుకోవాలంటే దేవదూత పలికినదానికి చాలా ప్రాముఖ్యత ఉందని సూచిస్తున్నది.

6. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని
నిర్గమకాండము 20:11, కీర్తనల గ్రంథము 146:6

7. యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
దానియేలు 9:6, దానియేలు 9:10, ఆమోసు 3:7, జెకర్యా 1:6

“ఇక ఆలస్యం కాదు”– ఏడో బూర రోజుల్లో ఈ యుగం సమాప్తం అవుతుంది. “రోజుల్లో”– ఈ మాట కొద్ది కాలాన్ని సూచిస్తుంది – కొన్ని సంవత్సరాల్ని లేక ఏదో అస్పష్టమైన దీర్ఘ కాలాన్ని సూచించదు. ఈ “రోజుల్లో” ఏడు పాత్రల్ని కుమ్మరించే సమయం ఉంటుంది (15,16 అధ్యాయాలు). “దేవుని రహస్య సత్యం”– క్రొత్త ఒడంబడిక గ్రంథంలో దేవుడు వెల్లడి చేసిన సత్యం, ఆయన దాన్ని వెల్లడి చేయకపోతే ఎవరూ తెలుసుకోలేని సత్యం. ఇలాంటి రహస్య సత్యాలు కొన్ని క్రొత్త ఒడంబడికలో వెల్లడి అయ్యాయి. మత్తయి 13:11; రోమీయులకు 11:25; 1 కోరింథీయులకు 15:51-52; ఎఫెసీయులకు 3:3-10; ఎఫెసీయులకు 5:22; కొలొస్సయులకు 1:24-27; 2 థెస్సలొనీకయులకు 2:7; 1 తిమోతికి 3:16 చూడండి. ఏడో బూర సమయంలో ఈ రహస్య సత్యాలలో ఏది పూర్తిగా నెరవేరుతుంది? ఒక వేళ ఇక్కడ “‘దేవుని రహస్య సత్యం” అనే ఈ మాటల్లో అనేక రహస్య సత్యాలు ఇమిడి ఉండవచ్చు. అవి అన్నిటికంటే గొప్ప రహస్య సత్యంలో, ఎఫెసీయులకు 1:9-10 లో పౌలు చెప్పిన దానిలో చేర్చబడి ఉన్నాయా? ఇది అసాధ్యం అనిపించదు – ఏడో బూర ఊదే సమయంలో జరగబోయేవేవో చూడండి – ప్రకటన గ్రంథం 11:15-18.

8. అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసికొనుమని చెప్పుట వింటిని.

9. నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
యెహెఙ్కేలు 2:8, యెహెఙ్కేలు 3:1

“తిను”– యెహెఙ్కేలు 3:1-2 పోల్చి చూడండి. “చేదు...తియ్యగా”– దానిలో దేవుని నుంచి వచ్చిన వాక్కులు ఉన్నాయి గనుక అది అతడి నోట్లో తియ్యగా ఉంది. కీర్తనల గ్రంథము 19:9-10; కీర్తనల గ్రంథము 119:103; యిర్మియా 15:16; యెహెఙ్కేలు 3:3. కానీ అది అతడి కడుపులో చేదుగా ఉంది. ఎందుకంటే, రాబోయే తీర్పుల గురించిన భవిష్యత్ వాక్కులను ఆలోచించి గ్రహించినప్పుడు ప్రేమ, జాలిగల హృదయమున్న వారికి అవి చేదుగా మనోవేదనకరంగా ఉంటాయి. యెహెఙ్కేలు 21:6, యెహెఙ్కేలు 21:12; యిర్మియా 9:1; యిర్మియా 10:19; యిర్మియా 13:17; యెషయా 22:4; కీర్తనల గ్రంథము 119:5, కీర్తనల గ్రంథము 119:136 పోల్చి చూడండి. దేవుని నిజ ప్రవక్తలు అలాంటివారు.

10. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను
కీర్తనల గ్రంథము 105:38

11. అప్పుడు వారునీవు ప్రజలను గూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
యిర్మియా 1:10, యిర్మియా 25:30, దానియేలు 3:4, దానియేలు 7:14, కీర్తనల గ్రంథము 105:38

“దేవుని మూలంగా పలకాలి”– ప్రకటన గ్రంథం 1:2-3. “మరో సారి” అన్న మాటలు గమనించండి. యోహాను ఇంతకుముందు చూచిన వినిన విషయాల గురించి మరెక్కువగా పలకాలనీ, ఇదివరకు కనబడిన ప్రజల గురించీ సంఘటనల గురించీ భవిష్యత్ వాక్కులు రాయాలనీ దీని అర్థం కావచ్చు (వ 2 నోటు).Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |