Revelation - ప్రకటన గ్రంథము 15 | View All

1. మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.
లేవీయకాండము 26:21

ప్రకటన గ్రంథం 12:1 తో ఆరంభమైన ఈ దీర్ఘ వివరణ భాగం ప్రకటన గ్రంథం 14:20 తో ముగిసింది. ఇక్కడ ముద్రలు, బూరలు, పాత్రల వరుస క్రమం మళ్ళీ కనిపిస్తున్నది. ఈ ఏడు పాత్రలను కుమ్మరించడం ఏడో బూర సమయంలో జరుగుతుంది, ఆ ఏడు బూరలన్నీ ఏడో ముద్ర కింద ఉన్నాయి. “దేవుని కోపం తీరిపోతుంది”– ప్రకటన గ్రంథం 6:16-17; ప్రకటన గ్రంథం 11:18; ప్రకటన గ్రంథం 14:10, ప్రకటన గ్రంథం 14:19.

2. మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.

దేవదూతలు కోప పాత్రలను కుమ్మరించకముందు ధన్యత సూచించే అందమైన దృశ్యం ఒకటి కనిపిస్తున్నది. “నిప్పు”– నిర్గమకాండము 3:2. భూమి మీదికి రాబోయే దేవుని తీర్పు అమలు జరపడానికి పరలోకమంతా సంసిద్ధంగా ఉంటుంది. “గాజు సరస్సు”– ప్రకటన గ్రంథం 4:6. “మృగం మీద...గెలుపొందినవారు”– వీరు ఎవరంటే మృగం విజయం సాధించి చంపినవారే (ప్రకటన గ్రంథం 13:7, ప్రకటన గ్రంథం 13:15). వారికి దుర్మార్గతతో రాజీపడడం కంటే హత్యకు గురి కావడం మేలు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇది గొప్ప ఆధ్యాత్మిక విజయం. విజయం మృగానికి చెందినట్టు కనిపిస్తుంది. శరీర సంబంధంగా అది జయిస్తుంది. అయితే ఈ విశ్వాసులకు ఆత్మ సంబంధంగా శాశ్వత విజయం కలుగుతుంది. వారి విజయం ఇది – వారు క్రీస్తువిరోధిని పూజించరు, అతడి ముద్ర, గుర్తు వేయించుకోరు. కాబట్టి సంగీతం, గానం చేసే సమయం వారికి వస్తుంది.

3. వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
నిర్గమకాండము 15:1, నిర్గమకాండము 15:11, నిర్గమకాండము 34:10, ద్వితీయోపదేశకాండము 32:4, కీర్తనల గ్రంథము 92:5, కీర్తనల గ్రంథము 111:2, కీర్తనల గ్రంథము 139:14, కీర్తనల గ్రంథము 145:17, యిర్మియా 10:10, ఆమోసు 4:13

“మోషే పాట”– పాత ఒడంబడికలో మోషే పాటలు రెండు ఉన్నాయి – నిర్గమకాండము 15:1-18; ద్వితీయోపదేశకాండము 32:1-43. ఈ సమయం కోసం ఆ రెంటిలో ఏదైనా సరిపోతుంది. మొదటిది ఫరో బారి నుంచి విడుదల గురించినది (ఫరో ఈ మృగానికి దృష్టాంతంగా ఉండవచ్చు). రెండో పాట దుర్మార్గుల అంతిమ ఓటమి గురించినది (ద్వితీయోపదేశకాండము 32:16-19, ద్వితీయోపదేశకాండము 32:22, ద్వితీయోపదేశకాండము 32:32, ద్వితీయోపదేశకాండము 32:35, ద్వితీయోపదేశకాండము 32:41-43). “గొర్రెపిల్ల పాట”– ప్రకటన గ్రంథం 5:9. ఇది తరువాతి మాటల్లో ఉంది. “నీ పనులు గొప్పవి”– నిర్గమకాండము 15:11; కీర్తనల గ్రంథము 92:5; కీర్తనల గ్రంథము 111:2. “పవిత్రులకు రాజా”– కీర్తనల గ్రంథము 47:2 (నోట్‌); కీర్తనల గ్రంథము 145:13; యిర్మియా 10:10; దానియేలు 4:34-35; 1 తిమోతికి 1:17. “నీ త్రోవలు న్యాయమైనవి”– ప్రకటన గ్రంథం 16:5, ప్రకటన గ్రంథం 16:7; ప్రకటన గ్రంథం 19:2; ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తనల గ్రంథము 33:5; కీర్తనల గ్రంథము 89:14; కీర్తనల గ్రంథము 145:17.

4. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
కీర్తనల గ్రంథము 86:9, యిర్మియా 10:7, మలాకీ 1:11

“పవిత్రుడవు”– యేసుప్రభువును గురించి లూకా 1:35; అపో. కార్యములు 2:27; అపో. కార్యములు 3:14 (నోట్‌) పోల్చి చూడండి. దేవుని పవిత్రత గురించి లేవీయకాండము 20:7 చూడండి. “ఎవరు భయపడకుండా”– లోక జనాలన్నీ చివరికి ఆయనకు భయపడి మహిమ కలిగిస్తాయని అర్థం. భయం గురించిన నోట్ ప్రకటన గ్రంథం 14:7. “నీ తీర్పులు”– దుర్మార్గుల మీద కోపాన్ని కుమ్మరించడం ద్వారా ఇవి ప్రదర్శించబడ్డాయి. “జనాలన్నీ”– కీర్తనల గ్రంథము 66:4; కీర్తనల గ్రంథము 86:9; యెషయా 66:23; జెఫన్యా 2:11; జెకర్యా 14:16-17; మలాకీ 1:11.

5. అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.
నిర్గమకాండము 38:21, నిర్గమకాండము 40:34-35, సంఖ్యాకాండము 1:50

“సాక్ష్యం కోసమైన ఆరాధన గుడారం”– నిర్గమకాండము 38:31; సంఖ్యాకాండము 1:50; హెబ్రీయులకు 8:2, హెబ్రీయులకు 8:5. దానిలో “సాక్ష్యం” అంటే దేవుడిచ్చిన పది ఆజ్ఞలు ఉంచారు. ఈ పేరు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇక్కడ కనబడడానికి కారణం బహుశా దేవుని ఆజ్ఞలను దాని కాళ్ళకింద తొక్కిన లోకంమీద దేవుడు తన కోపాన్ని కుమ్మరించబోతున్నాడు. “గర్భాలయం”– ప్రకటన గ్రంథం 7:15; ప్రకటన గ్రంథం 11:19.

6. ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించు కొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.
లేవీయకాండము 26:21

“గర్భాలయం లోనుంచి”– దేవుని సన్నిధినుంచి అన్నమాట.

7. అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.
కీర్తనల గ్రంథము 75:8, యిర్మియా 25:15

“నాలుగు ప్రాణులు”– ప్రకటన గ్రంథం 4:6-8. “కోపం”– ప్రకటన గ్రంథం 14:10 నోట్‌లో రిఫరెన్సులు.

8. అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.
1 రాజులు 8:10-11, 2 దినవృత్తాంతములు 5:13-14, యెషయా 6:3, యెహెఙ్కేలు 44:4, లేవీయకాండము 26:21, నిర్గమకాండము 40:34-35Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |