Revelation - ప్రకటన గ్రంథము 9 | View All

1. అయిదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశమునుండి భూమిమీద రాలిన యొక నక్షత్రమును చూచితిని. అగాధముయొక్క తాళపుచెవి అతనికి ఇయ్యబడెను.

1. And the fifth messenger did sound, and I saw a star out of the heaven having fallen to the earth, and there was given to it the key of the pit of the abyss,

2. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలోనుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములోనుండి లేచెను; ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను.
ఆదికాండము 19:28, నిర్గమకాండము 19:18, యోవేలు 2:10

2. and he did open the pit of the abyss, and there came up a smoke out of the pit as smoke of a great furnace, and darkened was the sun and the air, from the smoke of the pit.

3. ఆ పొగలోనుండి మిడతలు భూమి మీదికి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను.
నిర్గమకాండము 10:12, నిర్గమకాండము 10:15

3. And out of the smoke came forth locusts to the earth, and there was given to them authority, as scorpions of the earth have authority,

4. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.
యెహెఙ్కేలు 9:4

4. and it was said to them that they may not injure the grass of the earth, nor any green thing, nor any tree, but -- the men only who have not the seal of God upon their foreheads,

5. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటివలవ కలుగు బాధ, తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.

5. and it was given to them that they may not kill them, but that they may be tormented five months, and their torment [is] as the torment of a scorpion, when it may strike a man;

6. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
యోబు 3:21, యిర్మియా 8:3, హోషేయ 10:8

6. and in those days shall men seek the death, and they shall not find it, and they shall desire to die, and the death shall flee from them.

7. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్య ముఖములవంటివి,
యోవేలు 2:4

7. And the likenesses of the locusts [are] like to horses made ready to battle, and upon their heads as crowns like gold, and their faces as faces of men,

8. స్త్రీల తలవెండ్రుకలవంటి వెండ్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరలవలె ఉండెను.
యోవేలు 1:6

8. and they had hair as hair of women, and their teeth were as [those] of lions,

9. ఇనుప మైమరువులవంటి మైమరువులు వాటి కుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుఱ్ఱపు రథముల ధ్వనివలె ఉండెను.
యోవేలు 2:5

9. and they had breastplates as breastplates of iron, and the noise of their wings [is] as the noise of chariots of many horses running to battle;

10. తేళ్లతోకలవంటి తోకలును కొండ్లును వాటికుండెను. అయిదు నెలలవరకు వాటి తోకలచేత మనుష్యులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను.

10. and they have tails like to scorpions, and stings were in their tails; and their authority [is] to injure men five months;

11. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.
యోబు 26:6, యోబు 28:22

11. and they have over them a king -- the messenger of the abyss -- a name [is] to him in Hebrew, Abaddon, and in the Greek he hath a name, Apollyon.

12. మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.

12. The first woe did go forth, lo, there come yet two woes after these things.

13. ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము యూఫ్రటీసు
నిర్గమకాండము 30:1-3

13. And the sixth messenger did sound, and I heard a voice out of the four horns of the altar of gold that is before God,

14. అను మహానదియొద్ద బంధింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని యున్న ఆ యారవ దూతతో చెప్పుట వింటిని.
ఆదికాండము 15:18, ద్వితీయోపదేశకాండము 1:7

14. saying to the sixth messenger who had the trumpet, 'Loose the four messengers who are bound at the great river Euphrates;'

15. మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్ట బడిరి.

15. and loosed were the four messengers, who have been made ready for the hour, and day, and month, and year, that they may kill the third of men;

16. గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువదికోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.

16. and the number of the forces of the horsemen [is] two myriads of myriads, and I heard the number of them.

17. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండియున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధకవర్ణముల మైమరువు లుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలు వెడలుచుండెను.
నిర్గమకాండము 9:16

17. And thus I saw the horses in the vision, and those sitting upon them, having breastplates of fire, and jacinth, and brimstone; and the heads of the horses [are] as heads of lions, and out of their mouths proceedeth fire, and smoke, and brimstone;

18. ఈ మూడు దెబ్బలచేత, అనగా వీటి నోళ్లలోనుండి బయలువెడలుచున్న అగ్ని ధూమగంధకములచేత, మనుష్యులలో మూడవ భాగము చంపబడెను,

18. by these three were the third of men killed, from the fire, and from the smoke, and from the brimstone, that is proceeding out of their mouth,

19. ఆ గుఱ్ఱముల బలము వాటి నోళ్లయందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాములవలె ఉండి తలలు కలిగినవైనందున వాటిచేత అవి హాని చేయును.

19. for their authorities are in their mouth, and in their tails, for their tails [are] like serpents, having heads, and with them they do injure;

20. ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.
ద్వితీయోపదేశకాండము 32:17, కీర్తనల గ్రంథము 115:7, కీర్తనల గ్రంథము 135:15-17, యెషయా 17:8, దానియేలు 5:3-4, దానియేలు 5:23

20. and the rest of men, who were not killed in these plagues, neither did reform from the works of their hands, that they may not bow before the demons, and idols, those of gold, and those of silver, and those of brass, and those of stone, and those of wood, that are neither able to see, nor to hear, nor to walk,

21. మరియు తాము చేయు చున్న నరహత్యలును మాయమంత్రములును జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందిన వారు కారు.
2 రాజులు 9:22

21. yea they did not reform from their murders, nor from their sorceries, nor from their whoredoms, nor from their thefts.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Revelation - ప్రకటన గ్రంథము 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రకటన 9:12 మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.
ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడియుండగా (ప్రకటన 8:6) పరిశుద్ధుల ప్రార్ధనలు దేవుని సన్నిధికి దూపముగా వేయబడుట ధ్యానించినాము. దూత ధూపమువేసి దేవుని ప్రజల నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేసిన (సంఖ్య 16:46) తరుణమే బూరలు వూదబడుట చూస్తున్నాము.
అట్లు మొదటి దూత బూర ఊదినప్పుడు ఆరంభమైన శ్రమలు ఐదవ దూత బూర వూదువరకూ కొనసాగినట్లు చూడగలము. మొదటి నాలుగు బూరల కంటే మిగిలిన మూడు బూరల ధ్వనితో ఇంకా కఠినమైన శ్రమలు కలుగబోవు చున్నట్టు తెలుపబడుచున్నది.
ఇది కేవలము సాతాను పై క్రుమ్మరించబడుచున్న దేవుని కోపమా!! సాతాను కూడా ఆత్మ స్వరూపియే కదా. మరి మానవులకు శ్రమలెందుకు? కాగా అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను దూతలు దానితో కూడ పడద్రోయబడిరి (ప్రక 12:9). ఈ మృగ ముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కా రముచేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్య బడెను (ప్రక 13:4, 5). యూట్యూబ్ తెరిచి చూడు ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా ఇంటర్నెట్ లో దేవదూషణతో కూడున వీడియోలు వైరల్ అవుతున్నాయో లెక్కపెట్ట లేము.
మొదటి దూత బూర ఊదినప్పుడు భూమిపైన వడగండ్లును అగ్నియు పడవేయబడెను; భూమిలో మూడవ భాగము కాలి పోయెను.
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని సముద్రములో పడ వేయబడెను. సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణులు మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
మూడవ దూత బూర ఊదినప్పుడు మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి పడెను. నీళ్లు చేదై పోయినందున అనేకులు చచ్చిరి.
నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము కొట్టబడెను.
అయిదవ దూత బూర ఊదినప్పుడు మిడతలు భూమి మీదికి వచ్చెను. మరియు నొసళ్లయందు దేవుని ముద్రలేని మనుష్యులను అయిదు నెలలవరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.
మరణము తధ్యమే కాని, దుర్మరణము పాలు కాకూడదు. ప్రియ స్నేహితుడా, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము (కీర్త 68:20). తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను (ప్రస 6:3). సామూహిక సమాధులు చూస్తూనే ఉన్నాము. బూరలు వూదబడతాయి, దేవుని ప్రణాలికను ఏ శక్తీ ఆపలేదు. మరి, నీవు సిద్ధమా ??

ప్రకటన 9:12 మొదటి శ్రమ గతించెను; ఇదిగో మరి రెండు శ్రమలు ఇటుతరువాత వచ్చును.
మొదటి శ్రమ మరియూ రాబోవు రెండు శ్రమలు అనగా మొత్తము మూడు శ్రమలు సంభవించనున్నట్లు వివరించుచున్నది ప్రవచనము. మొదటి శ్రమలో ఐదు బూరలు వూదబడుట చూశాము. చివరికి నరులు మరణము వెదుకుట కనబడుచున్నది.
ఈ ఐదు బూరల సారాంశము ఒక్కటే : ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న క్రుత్యములును కాలిపోవును (2 పేతు 3:10). పంచభూతములు అనగా 1.భూమి, 2.ఆకాశము, 3.నీరు, 4.గాలి, 5.అగ్ని.
ఒక్కసారి మనము దేవుని సృష్టి క్రమము వైపు చూసినట్లైతే; ఆదియందు దేవుడు 1.భూమి 2.ఆకాశములను సృజించెను (ఆది 1:1). చీకటి 3.అగాధ జలము పైన కమ్మియుండెను (ఆది 1:2). దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచెను (ఆది 1:6). యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు4.గాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను (నిర్గ 14:21). దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు 5.పెద్ద జ్యోతిని [ఎండ వేడిమి - నిర్గ 16:21] రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను (ఆది 1:16).
అంతే కాదు దేవుడు ఆకాశాములోను, మేఘములోనూ, భూగర్భము లోనూ, పర్వత పునాడులలోనూ అగ్నిని దాచి ఉంచాడు అని మనము మరువ రాదు.
ఆదాము అవిధేయుడైనప్పుడు మొదట భూమిని శపించాడు దేవుడు. తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది (ఆది 3:17). ఆ కారణము చేతనే నీటికి నియమించిన సరిహద్దులు విడిచినాడు, జలప్రళయము రప్పించినాడు.
యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా మాటలాడుట చూడండి: ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు (యెష 1:2), భూమిని ఆకాశమును సాక్షులుగా పెట్టి ప్రవచనము వెలువరించాడు. ఆ భూమి ఆకాశముల మీదనే తన ఉగ్రత క్రుమ్మరిస్తున్నట్లు గమనించ గలము కదూ!!
ప్రకటన 8:1 నుండి అనగా ఏడవ ముద్ర విప్పబడిన యప్పటి నుండి ఐదవ బూర వూదబడుట అనగా ప్రకటన 9:11 వరకు మొదటి శ్రమ.
ప్రకటన 9:12 నుండి అనగా ఆరవ దూత బూర ఊదినప్పటి నుండి ప్రకటన 11:13 వరకు రండవ శ్రమ.
తిరిగి ప్రకటన 11:14 నుండి ప్రకటన 20:15 వరకు మూడవ శ్రమ.
రెండవ శ్రమల కాలములో సంభవించనై యున్న సంగతులను ధ్యానించ ముందుకు సాగుదమా. ప్రార్ధన చేద్దాం, ప్రభువు సహాయం కొరకు వేడుకొందాము. ఆత్మ చెప్పుచున్న మాట వినగల చెవులు కలిగియుందుము గాక. ఆమెన్

ప్రకటన 9:13 – 21 ఆరవ దూత బూర ఊదినప్పుడు ....... వారు మారుమనస్సు పొందిన వారు కారు.
ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవునియెదుట ఉన్న సువర్ణ బలిపీఠముయొక్క కొమ్ములనుండి యొక స్వరము మాటలాడుట చూచుచున్నాము. ఇట్టి విషయమును నాడు మోషేతో దేవుడు మాటలాడిన విధానము మనము జ్ఞాపకము చేసుకొనిన యెడల అవగాహన చేసుకొన గలము,
ఎట్లనగా; దేవుడైన యెహోవా మోషేతో: నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు, నేను ఇశ్రా యేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పెదను (నిర్గ 25:22).
మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను (నిర్గ 33:9).
మోషే యెహోవాతో మాట లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను (సంఖ్య 7:89).
అంతట ఆ స్వరము ప్రకటన 7:1-3 వచనాలలో మనము ధ్యానించిన ఆ నలుగురు దూతలు నలుదిక్కుల వున్నవారికి విడుదల ప్రకటించబడినట్లు గమనించగలము. దేవుని ముద్రగల దేవదూత వారిని హెచ్చరించిన విషయము గుర్తుచేసుకుందాము. వారు గాలిని బంధించుటకునూ, విడిచిపెట్టుటకునూ, సముద్రమునకు చెట్లకు హానిచేయుటకునూ అధికారము పొందినవారు.
వారు చేయు హాని బహు భయంకరమైనదే ఐననూ మనుష్యులు మారుమనస్సు పొందకయూ, జీవముగల దేవుని ఎరుగకయూ ఉండినట్లునూ, తాము నమ్మిన జీవములేని విగ్రహములనే ఆశ్రయించుచున్నట్లు కనబడుచున్నది. వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు (కీర్త 115:4-8).
జనులు తాము నమ్మిన దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివైన, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టుట లేదు; ఏలయన వారు మారుమనస్సు పొందలేదు.
కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటకు దేవుడు సమయమిచ్చుచున్నాదని ఎరిగి నేడే ఏసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించు ప్రియ స్నేహితుడా. ప్రభువు ఆత్మ మనల నడిపించును గాక. ఆమెన్


Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |