Judges - న్యాయాధిపతులు 12 | View All

1. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు పోయినీవు అమ్మోనీయులతో యుద్ధము చేయ బోయి నప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా

1. And they of Ephraim made insurreccion, & wente northwarde, & sayde vnto Iephthae: Wherfore wetest thou to the battayll agaynst the children of Ammon, & hast not called vs, that we mighte go with the? We wil burne thy house and the with fyre.

2. యెఫ్తానాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగిన ప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారి చేతులలోనుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి

2. Iephthae sayde vnto the: I and my people had a greate matter with ye children of Ammon, and I cried vpon you, but ye helped me not out of their handes.

3. నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయు లతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.

3. Now whan I sawe yt there was no helper, I put my soule in my honde, and wente agaynst the children of Ammon, and the LORDE delyuered them in to my hande. Wherfore come ye vp to me, to fighte agaynst me?

4. అప్పుడు యెఫ్తా గిలాదువారి నందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారుఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.

4. And Iephthae gathered all the men in Gilead, & foughte agaynst Ephraim. And the men in Gilead smote Ephraim, because they sayde: Ye Gileadites are as they yt fle awaye before Ephraim, (and dwell) amoge Ephraim & Manasse.

5. ఎఫ్రాయి మీయులతో యుద్ధముచేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీ యులలో ఎవడోనన్ను దాటనియ్యుడని చెప్పినప్పుడు గిలాదువారునీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడి గిరి.

5. And the Gileadites toke ye ferye of Iordane from Ephraim. Now wha one of ye fugityue Ephraites dyd saye: Let me go ouer, ye men of Gilead sayde: Art thou an Ephraite? yf he answered: No,

6. అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.

6. they bad him saye: Schiboleth, & he sayde: Siboleth, & coulde not speake it righte: then they toke him, & slew him at ye ferye of Iordane, so yt the same tyme there fell of Epraim two & fortye M.

7. యెఫ్తా ఆరు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను.

7. Iephthae iudged Israel sixe yeares. And Iephthae ye Gileadite dyed, & was buried in one of the cities of Gilead.

8. అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను.

8. After him iudged Israel one Ebzan of Bethleem,

9. అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశ మునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధి పతిగా నుండెను.

9. which had thirtie sonnes and as many doughters: and his thirtie doughters gaue he forth to mariage, and thirtie doughters toke he from without for his sonnes, and iudged Israel seuen yeare,

10. ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.

10. and died, and was buried at Bethleem.

11. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రా యేలీయులకు అధిపతిగానుండెను.

11. After him iudged Israel one Elon a Zabulonite, & he iudged Israel ten yeare,

12. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.

12. & was buried at Aialon in the londe of Zabulon.

13. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారు డగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.

13. After him iudged Israel one Abdo a sonne of Hillel, a Pirgathonite

14. అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమ లును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగు వారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.

14. which had fortye sonnes, & thirtie neuies ( which rode vpo seuentye Asses foales) and he iudged Israel eighte yeare,

15. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీ యుల మన్యము లోనున్న పిరాతోనులో పాతిపెట్ట బడెను.

15. and dyed, & was buried at Pirgathon in the londe of Ephraim vpon the mount of the Amalechites.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judges - న్యాయాధిపతులు 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఎఫ్రాయిమీయులు యెఫ్తాతో గొడవ పడ్డారు. (1-7) 
గిద్యోనుతో చేసినట్లే ఎఫ్రాయిమీయులకు యెఫ్తాతో కూడా అలాంటి వివాదం ఉంది. ఈ గొడవకు మూల కారణం అహంకారం, ఎందుకంటే ఇది తరచుగా విభేదాలు మరియు విభేదాలకు దారితీస్తుంది. వ్యక్తులు లేదా దేశాలను అవమానకరమైన పేర్లతో లేబుల్ చేయడం సరికాదు, ప్రత్యేకించి వారు ఇప్పటికే బాహ్య సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు. అటువంటి చర్యలు ఇక్కడ జరిగినట్లుగా హానికరమైన వివాదాలకు దారితీయవచ్చు. గౌరవం కోసం పోటీపడే సోదరులు లేదా ప్రత్యర్థుల మధ్య తలెత్తే వివాదాల కంటే తీవ్రమైన విభేదాలు లేవు. ప్రతికూల వైఖరులు మరియు ప్రవర్తనలను అధిగమించడానికి మనం అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రార్థించాలి. శాంతిని ప్రోత్సహించే చర్యలు మరియు వైఖరులను అనుసరించడానికి ప్రభువు తన ప్రజలందరినీ ప్రోత్సహిస్తాడు.

ఇబ్జాన్, ఎలోన్ మరియు అబ్దోన్ ఇజ్రాయెల్‌కు న్యాయమూర్తులు. (8-15)
ఈ భాగం ఇజ్రాయెల్ యొక్క ముగ్గురు అదనపు న్యాయమూర్తులను సంక్షిప్త పద్ధతిలో పరిచయం చేస్తుంది. వ్యక్తులు మరియు సమాజం రెండింటికీ అత్యంత కంటెంట్ మరియు సంతృప్తికరమైన జీవితం తక్కువ అసాధారణ సంఘటనలను అనుభవించేదేనని ఇది సూచిస్తుంది. సమగ్రత మరియు ప్రశాంతతతో జీవించడం, ఇతరులకు శాంతియుత ఉపయోగానికి మూలంగా ఉండటం, స్పష్టమైన మనస్సాక్షిని కాపాడుకోవడం మరియు ముఖ్యంగా, జీవితాంతం మన రక్షకుడైన దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండటం మరియు దేవుడు మరియు తోటి మానవులతో శాంతితో నిష్క్రమించడం ఆనందానికి కీలకం. ఈ లక్షణాలు తెలివైన వ్యక్తి కోరుకునే వాటన్నింటినీ కలిగి ఉంటాయి.



Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |