Judges - న్యాయాధిపతులు 9 | View All

1. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో నున్న తన తల్లి సహోదరులయొద్దకుపోయి వారి తోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను

1. Forsothe Abymelech, the sone of Gerobaal, yede in to Sichem to the britheren of his modir; and he spak to hem, and to al the kynrede of `the hows of his modir, and seide,

2. మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.

2. Speke ye to alle the men of Sichem, What is betere to you, that seuenti men, alle the sones of Gerobaal, be lordis of you, whether that o man be lord to you? and also biholde, for Y am youre boon, and youre fleisch.

3. అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమా నులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారుఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి;

3. And the britheren of his modir spaken of hym alle these wordis to alle the men of Sichem; and bowiden her hertis aftir Abymelech, and seiden, He is oure brother.

4. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి.

4. And thei yauen to hym seuenti weiytis of siluer of the temple of Baal Berith; and he hiride to hym therof men pore and hauynge no certeyn dwellynge, and thei sueden hym.

5. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారు లును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను.

5. And he cam in to `the hows of his fadir in Ephra, and killide hise britheren the sones of Gerobaal, `seuenti men, on o stoon. And Joathan, the leste sone of Gerobaal, lefte, and was hid.

6. తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షముక్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి.

6. Forsothe alle the men of Sichem, and alle the meynees of the citee of Mello, weren gadirid to gydere, and thei yeden, and maden Abymelech kyng, bysidis the ook that stood in Sichem.

7. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినిన యెడల దేవుడు మీ మాట వినును.

7. And whanne this thing was teld to Joathan, he yede, and stood in the cop of the hil Garisym, and cried with `vois reisid, and seide, Ye men of Sichem, here me, so that God here you.

8. చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి

8. Trees yeden to anoynte a kyng on hem; and tho seiden to the olyue tre, Comaunde thou to vs.

9. మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

9. Whiche answeride, Whether Y may forsake my fatnesse, which bothe Goddis and men vsen, and come, that Y be auaunsid among trees?

10. అప్పుడు చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా

10. And the trees seiden to the fige tree, Come thou, and take the rewme on vs.

11. అంజూ రపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగు టకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.

11. Which answeride to hem, Whether Y may forsake my swetnesse and swetteste fruytis, and go that Y be auaunsid among othere trees?

12. అటుతరువాత చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి

12. Also `the trees spaken to the vyne, Come thou, and comaunde to vs.

13. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

13. Which answeride, Whether Y may forsake my wyn, that gladith God and men, and be auaunsid among othere trees?

14. అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా

14. And alle trees seiden to the ramne, ether theue thorn, Come thou, and be lord on vs.

15. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియ మించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.

15. Whiche answeride to hem, If ye maken me verili kyng to you, come ye, and reste vndur my schadewe; sotheli, if ye nylen, fier go out of the ramne, and deuoure the cedris of the Liban.

16. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను.

16. Now therfor if riytfuli and without synne `ye han maad Abymelech kyng on you, and ye han do wel with Jerobaal, and with his hows, and ye han yolde while to the benefices of hym,

17. అయితే మీరు నా తండ్రి కుటుంబముమీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహో దరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించి యున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు

17. that fauyt for you, and yaf his lijf to perelis, that he schulde delyuere you fro the hond of Madian;

18. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలె కును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల

18. and ye han rise now ayens the hows of my fadir, and han slayn hyse sones, seuenti men, on o stoon, and `han maad Abymelech, sone of his handmayde, kyng on the dwelleris of Sichem, for he is youre brother;

19. నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన యెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక.

19. therfor if ye han do riytfuli, and with out synne with Gerobaal and his hows, to dai be ye glad in Abymelech, and be he glad in you; but if ye han do weiwardli,

20. లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి

20. fier go out `of hym, and waste the dwelleris of Sichem, and the citee of Mello; and fier go out of the men of Sichem, and of the citee of Mello, and deuoure Abymelech.

21. తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.

21. And whanne he hadde seide these thingis, he fledde, and yede in to Berara, and dwellide there, for drede of Abymelech, his brother.

22. అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను.

22. And Abymelech regnede on Israel thre yeer.

23. అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,

23. And the Lord sente the worste spirit bitwixe Abymelech and the dwelleris of Sichem, whiche bigynnen to holde hym abomynable,

24. అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.

24. and to arette the felony of sleyng of seuenti sones of Gerobaal, and the schedyng out of her blood, in to Abymelech her brother, and to othere princes of Sichem, that hadden helpid hym.

25. ఎట్లనగా షెకెము యజ మానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారి నందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను.

25. And thei settiden buyschementis ayens hym in the hiynesse of hillis; and the while thei abideden `the comyng of hym, thei hauntiden theftis, and token preies of men passynge forth; and it was teld to Abymelech.

26. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్ర యించిరి.

26. Forsothe Gaal, `the sone of Obed, cam with his britheren, and passide in to Siccima; at whos entryng the dwelleris of Sichem weren reisid, and yeden out `in to feeldis,

27. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా

27. and wastiden vyneris, and `to-traden grapis; and with cumpeneys of syngeris maad thei entriden in to `the temple of her God, and among metis and drynkis thei cursiden Abymalech, while Gaal,

28. ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదము గాని మనము అతని కెందుకు దాసులము కావలెను?

28. the sone of Obed, criede, Who is this Abymelech? And what is Sichem, that we serue hym? Whether he is not the sone of Jerobaal, and made Zebul his seruaunt prince on the men of Emor, fadir of Sichem? Whi therfor schulen we serue hym?

29. ఈ జనము నా చేతిలో ఉండిన యెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.

29. `Y wolde, that sum man yaf this puple vndur myn hond, that Y schulde take awei Abimelech fro the myddis. And it was seid to Abymelech, Gadere thou the multitude of oost, and come thou.

30. ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలుమాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను.

30. For whanne the wordis of Gaal, sone of Obed, weren herd, Zebul, the prynce of the citee, was ful wrooth;

31. అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపిఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చి యున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపు చున్నారు.

31. and he sente priueli messangeris to Abymelech, and seide, Lo! Gaal, sone of Obed, cam in to Siccymam, with hise britheren, and he excitith the citee to fiyte ayens thee;

32. కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి,

32. therfor rise thou bi niyt with the puple, which is with thee, and be thou hid in the feeld;

33. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడ వలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను.

33. and first in the morewtid, whanne the sunne rysith, falle on the citee; forsothe whanne he goth out with his puple ayens thee, do thou to hym that that thou maist.

34. అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచి యుండిరి.

34. Therfor Abymelech roos with al his oost bi nyyt, and settide buyschementis bisidis Siccimam, in foure placis.

35. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్ట ణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి.

35. And Gaal, the sone of Obed, yede out, and stood in the entryng of `the yate of the citee. Forsothe Abymelech and al the oost with hym roos fro the place of buyschementis.

36. గాలు ఆ జనులను చూచి జెబులుతోఇదిగో జనులు కొండశిఖరముల మీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులుకొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను.

36. And whanne Gaal hadde seyn the puple, he seide to Zebul, Lo! a multitude cometh doun fro the hillis. To whom he answeride, Thou seest the schadewis of hillis as the `heedis of men, and thou art disseyued bi this errour.

37. గాలుచూడుము, దేశపు ఎత్తయినప్థల మునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను.

37. And eft Gaal seide, Lo! a puple cometh doun fro the myddis of erthe, `that is, fro the hiynesse of hillis, and o cumpeny cometh bi the weie that biholdith the ook.

38. జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమా యెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా

38. To whom Zebul seide, Where is now thi mouth, bi which thou spekist, Who is Abymelech, that we serue hym? Whether this is not the puple, whom thou dispisidist? Go thou out, and fiyte ayens hym.

39. గాలు షెకెము యజ మానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.

39. Therfor Gaal yede, while the puple of Sichen abood; and he fauyt ayens Abymelech.

40. అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.

40. Which pursuede Gaal fleynge, and constreynede to go in to the citee; and ful many of his part felde doun `til to the yate of the citee.

41. అప్పుడు అబీ మెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.

41. And Abymelech sat in Ranna; sotheli Zebul puttide Gaal and hise felowis out of the citee, and suffride not to dwelle ther ynne.

42. మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.

42. Therfor in the dai suynge the puple yede out in to the feeld; and whanne this thing was teld to Abymelech,

43. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీద పడి వారిని హతముచేసెను.

43. he took his oost, and departide `in to thre cumpenyes, and settide buyschementis in the feeldis; and he siy that the puple yede out of the citee, and he roos,

44. అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.

44. and felde on hem with his cumpeny, and enpugnyde and bisegide the citee. Sothely twei cumpenyes yeden aboute opynli bi the feeld, and pursueden aduersaries.

45. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.

45. Certis Abymelech fauyt ayens the citee in al that dai, which he took, whanne the dwelleris weren slayn, and that citee was destried, so that he spreynte abrood salt ther ynne.

46. షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్‌ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.

46. And whanne thei, that dwelliden in the tour of Sichem, hadde herd this, thei entriden in to the temple of her god Berith, where thei hadden maad boond of pees with hym; and of that the place took name, which place was ful strong.

47. షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు

47. And Abymelech herde the men of the tour of Sichem gaderid to gidere,

48. అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.

48. and he stiede in to the hil Selmon with al his puple; and with an axe takun he kittide doun a boow of a tre, and he bar it, put on the schuldur, and seide to felowis, Do ye this thing, which ye seen me do.

49. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి.

49. Therfor with strijf thei kittiden doun bowis of the trees, and sueden the duyk; whiche cumpassiden and brenten `the tour; and so it was doon, that with smooke and fier a thousynde of men weren slayn, men togidere and wymmen, of the dwelleris of the tour of Sichem.

50. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.

50. Forsothe Abymelech wente forth fro thennus, and cam to the citee of Thebes, which he cumpasside, and bisegide with an oost.

51. ఆ పట్టణమునడుమ ఒక బల మైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజ మానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.

51. Forsothe the tour was hiy in the myddis of the citee, to which men togidere and wymmen fledden, and alle the princes of the citee, while the yate was closid stronglieste; and thei stoden on the roof of the tour bi toretis.

52. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా

52. And Abymelech cam bisidis the tour, and fauyt strongli, and he neiyede to the dore, and enforside to putte fier vndur; and lo!

53. ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను.

53. o womman castide fro aboue a gobet of a mylnestoon, and hurtlide to `the heed of Abymelech, and brak his brayn.

54. అప్పుడతడు తన ఆయుధము లను మోయుబంటును త్వరగా పిలిచిఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను.

54. And he clepide soone his squyer, and seide to hym, Drawe out thi swerd, and sle me, lest perauenture it be seid, that Y am slan of a womman. Which performede `the comaundementis, and `killide Abymelech;

55. అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి.

55. and whanne he was deed, alle men of Israel that weren with hym turneden ayen to her seetis.

56. అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరు లను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను.

56. And God yeldide to Abymelech the yuel that he dide ayens his fadir, for he killide hise seuenti britheren.

57. షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజే సెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను.

57. Also that thing was yoldun to men of Sichem, which thei wrouyten, and the curs of Joathan, sone of Jerobaal, cam on hem.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judges - న్యాయాధిపతులు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అబీమెలెకు తన సహోదరులను చంపి రాజుగా చేయబడ్డాడు. (1-6) 
షెకెము ప్రజలు దేవుని మార్గనిర్దేశాన్ని కోరకుండా అబీమెలెకును తమ రాజుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. వారికి రాజు ఉండాలా వద్దా అనే దానిపై ఎటువంటి పరిశీలన లేదు మరియు సరైన అభ్యర్థి ఎవరనే దానిపై ఖచ్చితంగా ఆలోచించలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల చర్యలను మరియు వారు ఎదుర్కొనే పరీక్షలను ముందుగానే చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటే, వారి సంతోషం తరచుగా దుఃఖంతో కప్పబడి ఉండవచ్చు. కృతజ్ఞతగా, మనం భవిష్యత్తు గురించిన జ్ఞానం నుండి తప్పించబడ్డాము మరియు అది ఒక ఆశీర్వాదం. మరీ ముఖ్యంగా, మనం పాపం పట్ల అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన తప్పుడు చర్యలు మన కుటుంబాలకు దీర్ఘకాలిక మరియు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తాయి.

యోతాము షెకెమీయులను మందలించాడు. (7-21) 
చెట్లు తమలో తాము రాజును నియమించుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవి వాటిని నాటిన ప్రభువుకు చెందినవి. అదేవిధంగా, ఇశ్రాయేలుకు మానవ రాజును స్థాపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభువు వారి అంతిమ పరిపాలకుడు. సమాజ శ్రేయస్సు కోసం ఫలవంతంగా సహకరించే వారు కేవలం ప్రతిష్టను కోరుకునే వారి కంటే జ్ఞానుల నుండి గౌరవం మరియు ప్రశంసలకు అర్హులు. కథలోని ఫలాలను ఇచ్చే చెట్లలో ప్రతి ఒక్కటి ఇతర చెట్ల కంటే ఎత్తుగా ఉండటానికి నిరాకరించడానికి లేదా మార్జిన్ సూచించినట్లుగా, "చెట్ల కోసం పైకి క్రిందికి వెళ్లడానికి" ఇలాంటి కారణాలను అందించింది. నాయకత్వ పదవిని చేపట్టడం గణనీయమైన శ్రమ మరియు బాధ్యతను కలిగి ఉంటుంది. ప్రజల విశ్వాసం మరియు అధికారం అప్పగించబడిన వారు తమ స్వంత ప్రయోజనాలు మరియు ప్రయోజనాల కంటే ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా, గౌరవం మరియు అధికార స్థానాలకు ఎదిగిన వారు తమ ప్రభావాన్ని మరియు ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే నిజంగా మంచి చేయాలని కోరుకునే వ్యక్తులు ఎక్కువగా ప్రభావం చూపుతారని భయపడతారు. యోతాము అబీమెలెకు మరియు బ్రాంబుల్ లేదా తిస్టిల్, కాల్చడానికి ఉద్దేశించిన పనికిరాని మొక్కల మధ్య పోలికను చూపాడు. ఈ విధంగా, అతను అబీమెలెక్ తన అధికారం మరియు నాయకత్వ సాధనలో అదే పనికిమాలిన వ్యక్తి అని నిందించాడు.

షెకెమీయులు అబీమెలెకుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. (22-29) 
అబీమెలెకు ఇప్పుడు తన తండ్రి తిరస్కరించిన సింహాసనాన్ని ఆక్రమించాడు. అయినప్పటికీ, ఈ స్పష్టమైన కీర్తి ఎంత క్షణికమైనది? కేవలం మూడు సంవత్సరాలు వేచి ఉండండి, మరియు ముళ్లపొర వాడిపోయి, అగ్నిలో దహించబడుతుందని సాక్ష్యమివ్వండి. దుర్మార్గుల శ్రేయస్సు నిజానికి తాత్కాలికమైనది మరియు మోజుకనుగుణమైనది. అబీమెలెకును సింహాసనంపై ఉంచినందుకు షెకెమ్ ప్రజలు వారి అన్యాయపు చర్యల యొక్క పరిణామాలను అనుభవిస్తారు, మరియు ఇప్పుడు వారు అతని స్వంత చేతులతో విధించిన అతని పాలన యొక్క భారాన్ని భరించారు.

అబీమెలెకు షెకెమును నాశనం చేస్తాడు. (30-49) 
ప్రస్తుతం తనను అగౌరవపరిచినందుకు షెకెమీయులపై ప్రతీకారం తీర్చుకోవాలని అబీమెలెకు ప్లాన్ చేశాడు. అయితే, దేవుని శిక్ష వారికి మాత్రమే కాదు, గిద్యోను కుమారుల హత్యలో వారి ప్రమేయం కూడా ఉంది. దేవుడు తన ప్రణాళికలను అమలు చేయడానికి వ్యక్తులను సాధనంగా ఉపయోగించినప్పుడు, వారి ఉద్దేశాలు అతని దైవిక ఉద్దేశ్యానికి భిన్నంగా ఉండవచ్చు. మోసం మరియు అసత్యాన్ని కనుగొనడానికి మాత్రమే విగ్రహాలను ఆశ్రయించే వారి వలె వారికి శ్రేయస్సును తీసుకురావాలని వారు ఆశించేది ఒక ఉచ్చు మరియు ఉచ్చుగా మారింది.

అబీమెలెకు చంపబడ్డాడు. (50-57)
దుష్టత్వానికి నాయకుడైన అబీమెలెకు షెకెమీయులను నాశనం చేశాడు. పాపులు సులభంగా మరియు విజయవంతమైన కాలాన్ని ఆస్వాదించవచ్చు, కానీ చివరికి, చెడు వారిని పట్టుకుంటుంది. దుష్టత్వం తాత్కాలికంగా వృద్ధి చెందినప్పటికీ, అది శాశ్వత విజయం కోసం ఉద్దేశించబడలేదు. మానవజాతి చరిత్ర, నిజాయితీగా వివరించినట్లయితే, తరచుగా ఈ అధ్యాయంలో వివరించిన సంఘటనలను పోలి ఉంటుంది. అధికార పోరాటాలు మరియు వైరుధ్యాల యొక్క అద్భుతమైన కథనాలు మానవులలో ప్రబలంగా ఉన్నాయి. కొందరిచే ప్రశంసించబడిన ఈ దృశ్యాలు, మానవ హృదయంలోని మోసపూరితత మరియు విపరీతమైన దుష్టత్వం, మానవ కోరికల శక్తి మరియు సాతాను ప్రభావం గురించి లేఖనాల బోధలను స్పష్టంగా వివరిస్తాయి. ప్రభూ, నీ సత్యాన్ని మరియు నీతిని మాకు అందించావు. మీ పవిత్రత, శాంతి మరియు ప్రేమ యొక్క ఆత్మ మాపై కుమ్మరించబడాలని మేము వినయంగా ప్రార్థిస్తున్నాము మరియు మీ పవిత్ర చట్టం మా హృదయాలలో లిఖించబడాలి.



Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |