విజేతగా నిలవాలంటే


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

విజేతగా నిలవాలంటే
Audio: https://youtu.be/K6tTFggExdU

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 కోరింథీయులకు - 15 : 57

విజేతగా నిలవాలంటే ప్రత్యర్థిని గెలవాలనే లక్ష్యాన్ని కలిగివుండాలి.

ఆ లక్ష్యమును ప్రేమిస్తూ నిరంతరము సాధన చెయ్యాలి.

సాధన కోసం అవసరమైన పరికరాలను ఎప్పటికప్పుడు కూర్చుకోవాలి.

సాధన ఒక్కోసారి కష్టతరమైనదే కావొచ్చు, ఆ లక్ష్యము గూర్చి గాని మరియు ప్రత్యర్థి శక్తియుక్తుల్నిగూర్చి గాని ఎన్నడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు.

అలాగని మనల్ని మనం కూడా తక్కువ అంచనా వేసుకొనకూడదు.

ప్రత్యేకమైన ఆటలలో లేదా ఉన్నతమైన విద్యా ఉద్యోగాలలో విజేతలుగా నిలిచిన వారిని "విజేతలుగా ఎలా నిలిచారు" అని ప్రశ్నించినప్పుడు వారి లక్ష్యము, దాని కొరకు చేసిన సాధన గురించి చెబుతూ ఈ సాధనలో సహాయం చేసిన గురువును లేదా సహకరించిన వారిని గురించి చెబుతారు.

మన వ్యక్తిగత జీవితంలో మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరో ఒక స్నేహితుడు లేదా బంధువు లేదా ఒక వ్యక్తి మనకు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేసియుండవచ్చు. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా క్రైస్తవుని మంచి లక్షణం.

జీవితంలో విశ్వాసంతో అపజయాలను అధిగమించి మనం పొందిన విజయాల వెనక కూడా శక్తి సామర్ధ్యమైన క్రీస్తు ఉన్నాడని, ఆరాధనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మన అనుదిన జీవితం ధన్యమైపోతుంది. లౌకిక, ఆధ్యాతిక జీవితంలో లక్ష్యాన్ని చేరుకునే విజేతగా నిలువగలుగుతాము.

అట్టి కృప ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమేన్