తండ్రి చేతిలో ఉంటే - విజయోత్సవమే


  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

తండ్రి చేతిలో ఉంటే - విజయోత్సవమే

Audio: https://youtu.be/nzHq_4srD8s

మట్టిపాత్రగా తయారవ్వలంటే ముందుగా తను ఉన్న స్థలమునుండి వేరుచేయబడుతుంది. ప్రత్యేకపరచబడి, నలగగొట్టబడి, నీళ్ళలో నాని ముద్దగా ఆయ్యేంతవరకు పిసగబడుతుంది లేదా తొక్కబడుతుంది. వీటన్నిటిల్లో దాగివున్న శ్రమ కొంచెమైనదేమీ కాదు. ముద్దగా చేయబడినంత మాత్రాన్న పాత్రగా మారిపోదు కానీ పాత్రగా మలచడానికి సంసిద్దమౌతుంది.

ఇక కుమ్మరి చేతిపనికి, ఆలోచనానేర్పుతో పాత్రగా మలచబడుతుంది. కుమ్మరి తన నైపుణ్యానంతా వుపయోగించి పాత్రలను ఎంతో ఓర్పుతోనూ, నేర్పుతోను చేస్తాడు. పాత్రలో దాగివున్న తడిని పోగొట్టేందుకు ఆరబెట్టబడుతుంది. ఆరిన పాత్ర కాల్చబడుతుంది. కాల్చితీసిన తరువాత ఆ పాత్రకొచ్చిన సొగసును, పటుత్వాన్ని చూసి కుమ్మరి ఆనందిస్తాడు. ఇక ఆపాత్ర ఉపయోగకరంగా మారుతుంది.

కుమ్మరియైన దేవుడు మనల్ని తన పోలికలోనే సృష్టించి, తాను మనయెడల కలిగిన ఉద్దేశాలను నేరవేర్చుకోడవానికి జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పించి మనలను తనకు ఉపయోగపడే పాత్రగా నిర్మించుకున్నాడు. మనం ఆయనకు ఉపయోగపడే పాత్రగా తయారుచేయబడ్డామని గ్రహించినప్పుడు, మన జీవితంలోని అనేక సందర్భాల్లో కలిగే శ్రమలు, ఒడుదుడుకులు మనల్ని కృంగదీయవుగాని, వాటి వలన మన అంతరంగంలోని ఆత్మస్తైర్యం పటిష్టితమై, ఆత్మీయ మరియు దైనందిన జీవితంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగే శక్తిని పొందగలుగుతాము. ఈ అనుభవాలగుండా ప్రయాణిస్తున్నప్పుడే తండ్రి మనలను గూర్చి సొంతోషించేవాడుగా ఉంటాడు. తనకు ఇష్టమైన పాత్రగా మలచబడుతున్న మనయెడల ఆయన చూపించే ఆనందమే మనం పొందే దీవెనాశీర్వాదానందాలు. ఇదే క్రీస్తులో విజయోత్సవం. ఆమెన్.

యిర్మియా 18:6 మీరు నా చేతిలో ఉన్నారు.


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.