విజయశీలుడు


  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Motivation - విజయోత్సవములు

విజయశీలుడు

క్రీస్తు పుట్టుక సర్వ మానవాళికి పండుగ. మనకొరకు జన్మించిన క్రీస్తు పుట్టుకను గూర్చి అనాదిలో ప్రవచింపబడిందని గ్రహించి ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాన్ని ఈ క్రిస్మస్ పర్వ దినాన మనమందరం జ్ఞాపకము చేసుకున్నాము. యేసు క్రీస్తు అను పేరులో ఉన్న శక్తి, ఆయన నామం ద్వారా మనం పొందే విజయాలే.

యెషయా 9:6 లో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు.

1. సర్వాధికారి - ప్రకటన. 1:8
2.అల్ఫాయు ఓమెగయు. ప్రకటన 22:13
3. ఉత్తరవాది. 1 యోహాను 2:1
4. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. హెబ్రీ 12:2
5. జీవాహారము యోహాను 6:35
6. ప్రియ కుమారుడు మత్తయి 3:17
7. పెండ్లికుమారుడు మత్తయి 9:15
8. తలరాయి కీర్తన 118:22
9.ఉగ్రతనుండి మనలను తప్పించువాడు. 1 థెస్స 1 : 10
10. నమ్మకమైనవాడు సత్యవంతుడు. ప్రకటన 19:11
11. మంచి కాపరి. యోహాను 10:11
12. ప్రధానయాజకుడు హెబ్రీ 4:14
13.సంఘమునకు శిరస్సు ఎఫేసి 1:22
14. పరిశుద్ధ సేవకుడు అపో 4:30
15.ఇమ్మానుయేలు. యెషయా 7:14
16. రాజులకు రాజు. ప్రకటన 17:14
17. వెలుగు. యోహాను 8:12
18.మెస్సీయ. యోహాను 1:41
19.విమోచకుడు యోబు 19:25
20. మనుష్యకుమారుడు. లూకా 19:10

యేసు క్రీస్తు నామములు అనంతం. ఆయననను ఏ పేరుతొ పిలిచినా పలికే దేవుడు. అన్ని నామములకంటే ఉన్నతనామమైన దేవుని ఆరాధిస్తే గొప్ప అనుభవాన్ని పొందగలం. దేవుని ఆరాధించడానికి సమయంతో పనిలేదు. యుగయుగములు ఆయనకే మహిమ చెల్లును గాక. ఆమెన్.


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.