సిలువ ధ్యానాలు - Day 4 - సిలువ వెదకుట


  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - సిలువ ధ్యానాలు - 40 Days

సిలువ ధ్యానాలు - Day 4 - సిలువ వెదకుట

యేసు క్రీస్తు సిలువలో మాత్రమే మనం శక్తిలేనిప్పుడు శక్తిని పొందగలుగుతాము. మనం బలహీనంగా ఉన్నప్పుడు మనకు బలం దొరుకుతుంది. నిరీక్షణ లేని సమయములో నిరీక్షణను పొందుకుంటాము. ఒంటరి జీవితాలకు తోడు దొరకుతుంది. సిలువలో మాత్రమే నలిగిన హృదయాలకు నెమ్మది ఉంది.

ప్రతి నిందకు, ప్రతి అవమానమునకు, ప్రతి బలహీనతకు లోక సంబంధమైన ప్రతి దాని నుండి విడుదల కావాలంటే సిలువలోనే వాటికి ముగింపు. సిలువ యొద్దకు వచ్చినవారు ఎన్నడు త్రోసివేయబడరు.

యెషయా 53:6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

దోషమునకు లోతుగా పాతుకుపోయే గుణం ఉంటుంది. దోషము అనగా ముందుగా నిర్ణయించి, ఒక ప్రణాళికతో చేసే తప్పిదం. పశ్చాత్తాపం అనేది లేకుండా ఇష్టపూర్వకముగా చేసే తప్పులను దోషము అంటారు. మీకా 2:1 మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నదని వాక్యం సెలవిస్తుంది. ప్రతి దుష్కర్యము పుట్టేది మంచము మీదనే. దోషము చేసేవారు మంచము మీదనే నిర్ణయుంచి దుష్కర్యములకు పాలుపడతారు. తెలియక లేదా పొరపాటుగ చేసేది దోషము కాదు, ఇష్టపూర్వకముగ ప్రణాళికతో చేసేదే దోషము.

మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోయి మనకు ఇష్టమైన త్రోవకు వెళ్ళినట్లు వాక్యము స్పష్టముగ తెలియజేస్తుంది. తప్పిపోయున గొఱ్ఱె ఉపమానం గమనిస్తే - గొఱ్ఱెల కాపరి దగ్గర వంద గొఱ్ఱెలున్నాయి. ఈ వంద గొఱ్ఱెలకు కావలసినవన్ని ప్రతి రోజు సమకూరుస్తున్నాడు ఈ గొఱ్ఱెల కాపరి. ఏ అపాయము రాకుండ వాటికి కాపుదలయిస్తూ అన్నిటిని సమానముగా చూసుకుంటు వాటి ముందుండి నడిపిస్తున్నాడు గొఱ్ఱెల కాపరి. ఒక రోజు ఏమి జరిగిందో తెలియదు కాని ఒక్క గొఱ్ఱెపిల్ల తప్పిపోయుంది. 99 గొఱ్ఱెలు నడిచే మార్గం విడిచి తనకిష్టమైన మార్గంగుండా వెళ్ళిపోయింది. 99 గొఱ్ఱెలు ఉన్నాయని ఆ కాపరి సంతోషంలేదు కాని, ఆ తప్పిపోయిన గొఱ్ఱెను వెదకి, కనుగొని సంతోషముగ ఇంటికి తీసుకొన వచ్చాడు.

అసలు గొఱ్ఱె తప్పిపోవుటకు కారణమేమిటి? 99 గొఱ్ఱెలు ఒక్క గొఱ్ఱెను విడిచిపోలేదు గాని, ఒక్క గొఱ్ఱె 99ని విడిచి వెళ్ళిపోయింది. తప్పిపోవుటకు ఒక్క కారణం కాదు వెయ్యి కారణాలు ఉన్నాయి. ఈ గొఱ్ఱె దారి తెలియక తప్పిపోలేదు, దారి నచ్చక వెళ్ళిపోయింది. ఇక్కడున్న వసతులకంటే బయట ఇంకా మంచి వసతులు వున్నాయనుకుందేమో, ఇక్కడున్న స్వాతంత్ర్యంకంటే బయట ఇంకా ఎక్కువ స్వాతంత్ర్యం దొరుకుతుందనుకుందేమో. ఇక్కడికంటే భయట నాకిష్టమోచ్చినట్లుగ జీవించవచ్చని అనుకుందేమో త్రోవ తప్పి తనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయింది.

కాని, కాపరి దానిని విడిచిపెట్టలేదు, 99 గొఱ్ఱెలు ఉన్నాయని సంతోషముగ లేడు. నేను లేకుండ అది బ్రతుకలేదు, నేను లేకుండ సంతోషముగ ఉండలేదు, తెలియక తప్పిపోయిందని దానిని వెదకడం ప్రారంభించాడు. ఎక్కడెక్కడ వెదకాడో, ఎంత దూరం వెళ్ళాడో, ఎంత వేదన చెందాడో కాని, చివరికి తప్పిపోయిన గొఱ్ఱెను కనుగొని శిక్షించక సంతోషముగ మెడమీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు.

ప్రియ స్నేహితుడా! ఆ తప్పిపోయున గొఱ్ఱె వలే నీవు ఆలోచిస్తున్నావా? నాకు ఈ ప్రార్ధనలో, ఈ వాక్యములో, ఈ పరిశుద్ధతలో, ఈ సహవాసములో సంతోషం లేదని నీకిష్టమైన మార్గం వైపు పరుగులు పెడుతున్నావా? నా జీవితం నా ఇష్టమని నీకు నచ్చినట్లుగా వాక్యమునకు వ్యతిరేకముగ జీవిస్తున్నావా? ఒకసారి సిలువ వైపు చూడు, మనమందరము తప్పిపోతివిు మనకిష్టమైన త్రోవకు వెళ్ళి మనం చేసిన దోషములన్ని యేసయ్య మీద మోపబడ్డాయి. ఇంకెంతకాలం నా ఇష్టం, ఇంకెంతకాలం నా జీవితమని మాట్లాడుతావు? ఎవరైనా నా జీవితం నా ఇష్టం అనే ప్రవర్తన కలిగియున్నారంటే. సందేహం లేకుండా చెప్పొచ్చు నీవు దోషము చేస్తున్నావని. నీలో సిలువ కార్యం జరిగితే నేనేమైయున్నానో అది క్రీస్తే అని ధైర్యముగ చెప్పగలుగుతావు.

నశించినదానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దోషముల చేత నశించిన దానిని వెదకి, ఆ దోషములు తన మీద వేసుకొని రక్షణ అనుగ్రహించాడు. ఇంకా ఒకవేళ నీవు రక్షణకు దూరముగ ఉంటే ఇదే అనుకూల సమయం, పరుగున సిలువ యొద్దకు చేరిపో!

Audio: https://youtu.be/q_NUMwTLfn0

 


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.