బానిసవా? స్వతంత్రుడవా?


  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Daily Devotion

బానిసవా? స్వతంత్రుడవా?

ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు పరిస్థితిని ఒక మాటతో బైబిల్ వివరించింది అదే ఇనుప కొలిమి. ఇనుప కొలిమంత భయంకరమైన హింస, ఒత్తిడి బానిస కలిగియుంటాడు. బానిస నోరు ఎప్పుడు మాట్లాడకూడదు. బానిస నోటి నుండి ఏడ్పు, మూల్గులే ఉండాలి కాని, ప్రశ్న రాకూడదు. ప్రభుత్వము నుండి సహాయము పొందుటకు ఏ అర్హతలేనివారు, కనికరము పొందనివారు, జనాభ లెక్కలలో లేనివారే బానిసలు.

ఇటువంటి బానిస బ్రతుకు నుండి విడిపించబడి ఉన్నత స్థితికి చేరుకున్న అద్భుతమైన మూడు సంధర్భాలు బైబిల్ లో ఉన్నాయి. ఒకటి సహోదరుల చేత అమ్మివేయబడి ఐగుప్తులో బానిసగా ఉన్న యోసేపు, దేవుని కృప చేత విడిపించబడి అదే దేశము మీద పరిపాలన చేసాడు. రెండవది 420సం।।లు కఠినమైన బానిసత్వం నుండి దేవుని చేత విడుదల పొందుకొని ఒక అద్భుతమైన రాజ్యముగా ఇళ్రాయేలు విస్తరించింది.

మూడవది కొలస్సి 1:13 ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. పాపము వలన దేవునికి దూరస్తులమైన మనము ఆ చీకటిలో దుష్టుని అధికారం క్రింద బానిసలముగ ఉన్నాము కాని, దేవుని మహా కృప చేత యేసు ప్రభువు మరణము ద్వారా అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందుట మాత్రమే కాదు పరలోక వారసులముగ చేయబడ్డాము.

యేసు ప్రభువు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మన అడ్రస్ మారిపోయింది, మన ఉనికి మారిపోయింది. యుద్ధము చేయకుండ విడుదల పొందుకోవడమనేది పరిశుద్ధ గ్రంథములోనే కనిపిస్తుంది. కత్తి అనేది వాడకుండ ఇశ్రాయేలీయులు విడుదల పొందుకుంటే, కత్తి వాడకుండ తన రక్తం చిందించి మనలను విడిపించాడు యేసు ప్రభువు. ఇప్పుడు మనం బానిసలము కాదు స్వతంత్రులము. బానిస ఎప్పుడు తన నిర్ణయాలను అమలు చేయలేడు కాని, స్వతంత్రుడు తన నిర్ణయాలను అమలు చేసే అధికారం కలిగియున్నాడు. మనం చీకటి అధికారం క్రింద ఉండుటకు పిలువబడలేదు, అధికారం చేయుటకు పిలువబడ్డాము.

ఐగుప్తు నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు దేవుడు చెప్పిన మాట సాగిపోవుడి. ఈ రోజు నీ జీవితములో ఎర్ర సముద్రము వలె సమస్యలు అడ్డుగ ఉండి ఏమి చెయ్యాలో తెలియక కలవరపడుతుంటే; దేవుడు నీతో కూడ అదే మాట చెప్పుతున్నాడు సాగిపో. ఆగిపోవుటకు నీవు బంధకములలో లేవు, బయపడుటకు బానిసవు కాదు, ఏడ్చుటకు నీవు చేతకానివాడవు కావు, నీవు దేవుని చేత ముద్రించబడి అధికారం చేయుటకు పిలువబడిన స్వతంత్రుడవు, ఆగిపోక విశ్వాసముతో క్రీస్తుతో సాగిపోతూనే ఒక బలమైన వ్యక్తిగా నీవు స్థిరపడిపోదువు గాక!

https://youtu.be/GvLPJxRN88U

 


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.