నాకు భయమేస్తుంది!


  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

నాకు భయమేస్తుంది!

తన కుమారునికి జరుగ వలసియున్న ఒక ఆరోగ్యసంబంధమైన పరీక్షలను గురించి చెపుతూ ఒక సహోదరి తన బిడ్డను గూర్చిన ప్రార్ధనా అవసరతను మా ప్రేయర్ టీంకు తెలియజేసింది. తానుపంపిన ఆ వర్తమానంలో ఉన్న బాధాకరమైన మాటలు ఇవి “డాక్టర్ గారు ఫలానా ఆసుపత్రిలో పరీక్షలు జరిగించాలని కోరినప్పుడు, ఇంచు మించు 5 గంటల దూరంలో ఉన్న హాస్పిటల్ కు చేరుకోవాలి. చాలా దూరం ప్రయాణం చేసి, తన కుమారుడు ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలను కనుక్కోడానికి డాక్టర్లు ప్రయత్నం చేసిన తరువాత ఎటువంటి సమాధానం వారినుండి వినవలసి వస్తుందో” అన్న సంగతిని గూర్చి తెలియజేస్తూ “నాకు భయమేస్తుంది!” అని తన ప్రార్ధనా విన్నపమును మాకు తెలియజేసింది.

యౌవన కాలంలో గాని లేదా తరువాతి సంవత్సరములలో గాని భయానకమైన జీవిత సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మనలో ఎవరికీ ఇటువంటి భయాలు కలుగలేదు చెప్పండి? ఇటువంటి స్థితి కాకపోయినా ఏదైనా మిమ్మల్ని మెలిపెట్టే సమస్య ఎదురైతే అలాంటప్పుడు సహాయానికి ఎవరి తట్టు తిరుగుతాము? ఎటు పరుగిడుతాము? ఈ రకమైన పరిస్థితిలో ధైర్యాన్ని ఇవ్వగల ఆదరణకరమైన మాటలు లేఖనాలలో మనకు ఎక్కడ దొరుకుతాయి?

మన ప్రతి శోధనలలో దేవుడు మనతో ఉంటాడన్న వాగ్ధానము మనలను నిరీక్షణ కలిగియుండేలా చేస్తుంది. యెషయా 41:13 లో “నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.” అని వ్రాసియుంది.

అంతేకాదు, ప్రార్ధనలో మన కష్టాలను ఆయన ముందుంచినప్పుడు ఫిలిప్పీ 4:6 ప్రకారం “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” మనలను విడువజాలని దేవుని సన్నిధి ద్వారా “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము “ (ఫిలిప్పీ 4:7) ద్వారా, మనలను నిజముగా భయపెట్టే పరిస్థితులను తట్టుకోడానికి అవసరమైన నిరీక్షణను, సహాయమును పొందగలము. ఆమెన్.

https://youtu.be/aIA6RHa8_SQ

 


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.