మనం క్షమించబడ్డాము!


  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మనం క్షమించబడ్డాము!

అనేకసార్లు మన వ్యక్తిగత ప్రార్ధన క్షమించమనే ఎక్కువగా ఉంటుంది. అనుకోని సందర్భాల్లో మనం చేసిన పొరపాట్లు మన హృదయంలో కొంత బాధను కలుగజేసినప్పటికీ, దేవుని క్షమించమని అడుగుతూ చేసే ప్రార్ధన ఆ బాధనుండి ఉపసమనం కలిగించి సంతోషాన్నిస్తుంది. ఈ సంతోషానికిగల బలమైన కారణం దేవుడు మనల్ని క్షమించగలడనే నమ్మకం మరియు క్షమించాడనే విశ్వాసం. ఇట్టి ఆదరణ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. దీనిని ఆశ్వాధించేవారు ధన్యులు.

దావీదు తన అనుభవాన్ని వివరిస్తూ కీర్తన 119:176 లో “తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను” అని అంటూ దేవుని చేత క్షమించబడడమే కాదుగాని, కాపరియైన దేవుడు తనను కాచి కాపాడుతూ, విభిన్న వైరుధ్యాల నడుమ త్రోవను విడినప్పటికీ, తండ్రిగా తన ప్రేమను చూపిస్తూ, ఉన్నతమైన కృపలో పొందిన క్షమాపణ ద్వారా తన త్రోవను సరిచేసిన గొప్ప అనుభవాన్ని వివరిస్తున్నాడు.

ఇట్టి కృపవలన మనం పొందిన క్షమాపణను శిష్యుడును అపోస్తలుడునైన యోహాను, యేసు క్రీస్తు ద్వారా మనం ఉచితంగా పొందిన క్షమాపణను వివరిస్తూ 1 యోహాను 1: 7-9 ప్రకారం - అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

ఈ మాటలు అధ్యయనం చేస్తున్నప్పుడు “వెలుగులో నడవడము” అన్నది యేసును వెంబడించడానికి అలంకారప్రక్రియగా చెప్పబడింది. అంతేకాదు, పరిశుద్ధాత్మ సహాయముతో యేసు క్రీస్తును వెంబడించినట్లయితే విశ్వాసమనే సహవాసముతో అపోస్తలులలో చేరాము అనడానికి గుర్తువంటిది అని యోహాను ఈ వాక్యంలో నొక్కి చెబుతూ ఉన్నాడు. నిజమైన క్రస్తవుడు అనే మాటకు నిదర్శనం ఇదే. 

ప్రియమైన స్నేహితులారా, మనకు కృప సమృద్ధిగా అందుబాటులో ఉంది. మనకవసరమైన క్షమాపణను ప్రార్ధన, విజ్ఞాపనల ద్వారా ఎల్లప్పుడూ పొందవచ్చు. మనము పరిపూర్ణులం కాకపోయినప్పటికీ దేవుని చేత క్షమాపణనుపొంది, అయన జ్ఞానము నుండి తొలగిపోకుండునట్లు అనుదినము మన హృదయాలను నిర్దేశించుకోవాలి. అనుదిన క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఇది ఒక అద్భుతమైన అనుభవం. ప్రయత్నం చేద్దామా! ఆమెన్.

https://youtu.be/IotX4qYmI44


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.