ఎల్లప్పుడూ సంతోషంగా


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ఎల్లప్పుడూ సంతోషంగా

కీర్తన 100:3 “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.”

మనలో ప్రతి ఒకరము దేవునిచే నిర్మించబడినవారము. ఎక్కడ కూడా స్వనిర్మిత పురుషులు గాని స్త్రీలు గాని ఉండరు. అంతేకాదు, వారికి వారు ప్రజ్ఞాశాలులైన వారు, మెరుగుదిద్దుకున్న వారు లేదా తెలివిగలవారు ఎవరులేరు. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు తానే స్వయంగా చేశాడు. ఆయన మనలను గూర్చి ఆలోచన చేసి అనిర్వచనీయమైన తన ప్రేమను బట్టి మనలను నిర్మించాడు అనుటలో ఎట్టి సందేహం లేదు.

దేవుడు నీ దేహాన్ని, మనసును, ప్రాణాన్ని నిర్మించాడు. నిన్ను నిర్మించడం ఇంకా మిగిలే ఉంది, అనుదినం ఆయన నిన్ను నిర్మిస్తూనే ఉన్నాడు. ఆయనకున్న ఏకైక లక్ష్యము మనం పరిపక్వత చెందడం. “నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. “ (ఫిలిప్పి 1:6). దేవుడు నిన్ను మరింత ధైర్యవంతునిగా, బలవంతునిగా, పరిశుద్ధునిగా, మరింత సమాధానకరమైన వానిగా, మరింత ప్రేమగల వ్యక్తిగా, తక్కువ స్వార్థపరునిగా – బహుశా నీవు ఎల్లప్పుడూ ఎలా ఉండాలని ఆశపడ్డావో అలాంటి వ్యక్తిగా చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమపడుతూనే ఉన్నాడు.

యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.” కీర్తన 100:5. దేవుడు ఎల్లప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ అంటే, గతంలో, నేడు కూడా, భవిష్యత్తులో కూడా., ఆయన అంతమువరకు నీ పట్ల నమ్మకముగా ఉంటాడు. నీకు నిత్యము నిలిచియుండే ప్రేమను ప్రసాదించడం తో పాటు, నీ విషయమై ఎన్నడుకూడా విసుగుచెందని దేవుడు నీకున్నాడు. నీ విశ్వాసాన్ని సేద్యపరచినప్పుడు సంతోషంతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదల సంభవిస్తుంది. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఇదొక మంచి కారణం. ఆమెన్.

https://youtu.be/0feOJ6wT2qg