మన కోరికలపై గెలుపు!


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మన కోరికలపై గెలుపు!

కృష్ణా నది తీర ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు అక్కడ నది కలువల ప్రక్క అనేకులు చాపలు పడుతూ ఉండడం గమనించాను. వారు నైపుణ్యత కలిగినవారు కాకపోయినప్పటికీ, ఒకొక్కరు ఒక్కో రీతిలో కనీసం రెండేసి చాపలుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వానపాము వంటి ఎరను ఉపయోగించకుండా, చేపలకు అతి ప్రియమైన తౌడు పదార్ధాలతో చేయబడిన పిండిని గాలానికి జతచేసి, దానిని నీటిలో వేసి వారి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. వారి శ్రమ వృధాకాలేదు. అయితే పిండి పదార్ధమును బట్టి ఆకర్షించే ఎరను వేస్తే చేపలను తేలికగా పట్టుకోవచ్చు.

ఎరను బట్టి చేపాలను ఎలా సుళువుగా పట్టుకుంటామో, యాకోబు 1:14 లో “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడుతాము” అన్న మాటలు నొక్కి చెప్పాడు. మరో విధంగా చెప్పాలంటే మన కోరికలు శోధనలతో కలిసి పనిచేస్తూ, తప్పు దోవ దిశగా మనలను మరలుకొలుపుతాయి. మన సమస్యలకు దేవునిని గాని, సాతానుని గాని నిందించాలన్న శోధన మనకు కలిగినా, నిజానికి ప్రమాదము మనలోనే దాగియున్నది.

అయితే ఒక శుభవార్త ఏమిటంటే, మనలను శోధనకు గురిచేసే విషయాలను గురించి దేవునితో మాట్లాడడము ద్వారా శోధన కలిగించే ఆకర్షణనుండి మనము తప్పించుకోవచ్చు. “దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:13). యాకోబు వివరిస్తున్నట్టుగా చెడు చేయాలన్న మానవ కోరికను ఆయన అర్ధము చేసుకుంటాడు. మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన దయజేస్తానన్న జ్ఞానము కొరకు ఆయనను ప్రార్ధనలో వేడుకోవడమే. ఆమెన్.
https://youtu.be/yGHePwLeHtI