క్షమించు! మర్చిపో!


  • Author: Dr. Suma Jogi
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

సామెతలు 17:9 - ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.

మనం గతంలో పొరపాట్లు చేస్తూ మరలా వాటివైపు మల్లడం సాధారణం అయిపొయింది. పరిశుద్ధ గ్రంథం మనకు రెండు విషయాలు చెబుతుంది..మన సంబంధాలలో ప్రేమ నిలకడగా మరియు వర్ధిల్లాలంటే, మనం ఇతరుల తప్పులను మాత్రమే క్షమించడం కాదు గాని, క్షమించి మరచిపోవడం .అవును దేవుడు కూడా మనలను క్షమించి గతంలో చేసిన తప్పులను మరచిపోయినా, మనుష్యులు మాత్రం మర్చిపోకుండా క్షమించలేని మనస్తత్వాలలో అనేక సంబంధాలు విచ్చిన్నం అయిపోతున్నాయి.

మనం ప్రేమలో ఉండేందుకు మరియు వాక్యంతోమన సంబంధాలలో వృద్ధి చెందడానికి కృషి చేద్దాం. సిలువపై మన ప్రతి తప్పును ఎలా క్షమించారో మరియు మన జీవితమంతా దేవుని ప్రేమ మనపై ఎలా ఉందో మనం గుర్తుచేసుకున్నప్పుడు, మనం క్షమించి మరచిపోతాము. ఆమెన్.