నీవు సిగ్గుపడనక్కర లేదు!


  • Author: Dr. G. Praveen Kumar | Anudina Vahini | Daily Devotions in Telugu
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మనం క్రీస్తులో శాశ్వతంగా స్థిరపరచబడ్డామని మరియు అనుదినం పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నామని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు! ఇది మనకు ఇవ్వబడిన భయం లేదా పిరికితనం గల ఆత్మ కాదు కానీ, శక్తి మరియు ప్రేమ యొక్క దేవుని ఆత్మ. ఈ ఆత్మ స్వీయ-క్రమశిక్షణ మరియు నియంత్రిత మనస్సు గల ఆత్మ. అంతేకాదు, దేవుడు తన బిడ్డలకు జ్ఞానం మరియు వివేచన గల ఆత్మ కూడా దయజేస్తూ, అది దినదినము రగిలించబడగల అద్భుతమైన అనుభవం కలిగియుంది. 

క్రీస్తులో మనకున్న అనేక అమూల్యమైన ఆధిక్యతలు మరియు మనలో దాగి యున్న పరిశుద్ధాత్మ యొక్క అతీంద్రియ శక్తి పొందుకున్న మనం, మన క్రైస్తవ సాక్ష్యాన్ని అరికట్టడానికి బదులుగా ధైర్యంగా నిలబడగలగాలి. అందుకే అపో.పౌలు _2 తిమోతికి 1:8 లో తిమోతికి ఉద్బోధించాడు
కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము_.

ప్రపంచం మరియు మానవజాతి యొక్క విమోచన కోసం దేవుని ఉద్దేశాలు మరియు ప్రణాళికలలో పాల్గొనడానికి మనం రక్షించబడ్డామని మనం గుర్తించాలి. మనకు ప్రత్యేకమైన పిలుపు ఉందని మరియు ఒక ప్రయోజనం కోసం రక్షింపబడినందుకు మనం సంతోషించే వారంగా ఉండాలి. మన కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు యేసు కొరకు సాక్షిగా జీవించాలి.

మన ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గూర్చి మనం ఎన్నటికీ సిగ్గుపడకుండా ఉందాం. ఆయన నామం కోసం మనం పొందే పోరాటాల నుండి దూరంగా పారిపోకుండా, శ్రమలు, బాధలు మన విశ్వాస పోరాటంలో భాగమని జీవిస్తూ..., మన కోసం నీతి కిరీటం సిద్ధపరచబడినది ఎప్పటికీ మరచిపోక, తనను ప్రేమించే వారికి మరియు ఆయనవైపు తిరిగి రావాలని కోరుకునే వారందరికీ తప్పక దయజేస్తాడని విశ్వసిద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.