ప్రతిఫలమిచ్చు దేవుడు | God our Rewarder


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ప్రతిఫలమిచ్చు దేవుడు

కొంచం సమయం కూడా ఖాళీ లేని ఈ ప్రపంచంలో, మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మొత్తం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి అంతా తేలిసేలా సామాజిక మాధ్యమాలు. మనం ఏమి చేస్తున్నాం అన్నది చాలా మందికి చూపించాలనేది మన జీవితంలో భాగమైపోయింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో, మనుష్యులకు కనిపించకుండా, సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే మనం కొన్ని పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. 

మత్తయి 6:18 అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు తనతో వ్యక్తిగత సన్నిహిత సహవాసం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటాడు మరియు సంతోషిస్తాడు. మనం ఆయన చెప్పినది చేసినప్పుడు మనకు ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు .

దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు, "నేను మీకు లోబడియున్నాను" అని చెప్పడానికి ఇది మరొక మార్గం. దేవుడు చెప్పినదానిని పాటించడంలో ఆశీర్వాదాలు దాగి యుంటాయి.. ఇది అవి మనల్ని విశ్వాసక్రమములో మరో మెట్టు ఎదిగేల జేస్తుంది. అలా క్రమ క్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అధికమైన ప్రతిఫలాన్ని పొందగలుగుతాము.

సామాజిక మాధ్యమాలలో అనవసరమైన మన వ్యక్తిగత బహిరంగ ప్రదర్శనకు వీడ్కోలు పలుకుదాం. మన స్వంత  నడవడి కాకుండా విధేయతగాలికే జీవితాన్ని దేవుని సహాయంతో మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. శాశ్వతమైన ప్రతిఫలానికి పాత్రులయ్యేలా ప్రభువు మనలను స్థిరపరచును గాక. ఆమెన్.

God our Rewarder

Today in our updated and upgraded World, it-s all about public display of all you do. Updating status and reels have become part and parcel of life for many. 

When it comes to our father God in our scripture portion Mat 6:18 says so that it will not be obvious to men that you are fasting, but only to your Father, who is unseen; and your Father, who sees what is done in secret, will reward you.

In spiritual world God expects us to do few things not to be seen by men but only by the almighty God. This tells us  that  God is more interested and pleased with a personal intimate fellowship with him  and is a rewarder when we do what he says.

Word of God says,when we say we love God, it-s another way of saying "I obey you". Our blessing is always in obeying what God says.This will take us to the next level of faith and  a better reward as we go up the ladder. 

Lets kiss good bye to a public display of things and train ourselves with divine help to obey God His way and not our way. May the Lord humble us to be worthy of the eternal reward. Amen. God Bless You.


Telugu Audio:
https://youtu.be/JerFm8D1LxM

English Audio:
https://youtu.be/nuzVCRaXtjo