క్రైస్తవుడు అంటే ఎవరు?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-what-Christian.html

వెబ్ స్టర్స్ డిక్షనరీ ప్రకారము “ఒక వ్యక్తి బాహాటంగా యేసుపై తన నమ్మకాన్ని క్రీస్తుగా లేదా యేసుని గూర్చిన బోధనతో మతము లోకి వచ్చుట”. క్రైస్తవుడు అంటే ఏమిటి అని అర్థ౦ చేసుకోవటానికి ఈ మంచి అ౦శ౦ తో మొదలైంది కాని, చాలా లౌకికపు నిర్వచనముల ప్రకారము బైబిల్ ద్వారా మనకు తెలియ చేసే సత్యమేదో వుంది .

నూతన నిబంధనలో “క్రైస్తవుడు” అనే మాట మూడుసార్లు వాడబడింది. (అ.కా 11:26, అ.కా 26:28, 1 పేతురు 4:16). అంతియోక్ లో (అ.కా 11:26) ప్రధమముగా క్రీస్తును అనుసరి౦చేవారిని క్రైస్తవుడు అనేవారు ఎందుకంటే వారి ప్రవర్తన, పనితీరు మరియు భాషతీరు అంతా క్రీస్తు మాదిరిగా ఉ౦డేది. ఆరంభంలో అంతియోక్ లో రక్షింపబడని వారు క్రైస్తవులను ఒక విధమైన తిరస్కారభావముతో ఎగతాళి చేసేవారు. వెబ్ స్టర్స్ డిక్షనరీ నిర్వచనానికి దగ్గరగావున్న ఒకే ఒక అర్థ౦ ఏమిటంటే “క్రీస్తుకి సంబంధించినవారు” లేదా “క్రీస్తుని అనుసరి౦చేవారిగా లేదా హత్తుకొనిపోవువారు.”

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కాలం గడిచే కొలది, “క్రైస్తవుడు” అనే పదం ఎంతో గొప్ప సంబంధం కల తన ఉనికిని కోల్పోయి మరియు ఒక మతపరముగా వాడబడటం. అంతేకాక నైతిక విలువలు కలిగి నిజముగా యేసు క్రీస్తుని అనుసరి౦చేవారే కరువైపోయారు . చాలామంది యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు నమ్మకము ఉ౦చరు కాని తమకు తామే క్రైస్తవులు అనుకుంటారు ఎందుకంటే చర్చికి వెళ్లటం వలన లేదా క్రైస్తవ దేశంలో జీవించుట వలన కాని, చర్చికి వెళ్లటంవలన కాని, నీకంటే పైవారికి సేవచేయుటవలన కాని, లేదా మంచివ్యక్తిగా వుండుట కాని, ఈ పైవాటిలో ఏవి మిమ్ములను క్రైస్తవునిగా పరిగణి౦పజేయవు. మతబోధకుడు ఏమి చెప్పారంటే ఒక వ్యక్తి రోజూ గ్యారేజికి వెళ్లినంత మాత్రాన ఆటోమొబైల్ ఇ౦జనీర్ గా ఎలా అవ్వలేడో అలాగే రోజూ చర్చికి వెళ్ళినంత మాత్రమున క్రైస్తవుడు కాలేడు.. చర్చి సభ్యుడిగా ఉ౦డటంవలన, సేవా కార్యక్రమాలకి సక్రమముగా హాజరయినందువలన, మరియు చర్చిపని చేయున౦త మాత్రముననే ఎవరూ క్రైస్తవులు కాలేరు.

బైబిల్ ఏమి చెబుతుందంటే మనం చేసిన మంచిపనులు వేటిని దేవుడు అంగీకరించరు. తీతు పత్రిక 3:5 ప్రకారము “మనము చేసిన నీతికార్యములను మూలముగా కాక, తన కనికరము వలననే రక్షింపబడితిమి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానూ, పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుటద్వారానూ ఆయన మనలను రక్షించెను”. ( యోహను 3:3, 7 1 పేతురు 1:23 ) ఎవరైతే వారి విశ్వసాన్ని, నమ్మకాన్ని యేసుక్రీస్తు పై ఉ౦చుతారో వారే క్రైస్తవులు. ఎఫెసి 2:8 ప్రకారము “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే -”. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే ఆమె లేక అతడు తాను చేసిన పాపమునకు పశ్చాత్తాపపడి మరియు తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని యేసు క్రీస్తునందు మాత్రమే ఉ౦చటం. వారి నమ్మకం. మతాన్ని వెంబడించటం లేదా ఇది చేయవచ్చు లేదా చేయకూడదు అనే నీతి విలువలతో కూడిన పట్టీని అనుసరి౦చటం కాదు.

నిజమైన క్రైస్తవుడంటే ఆమె లేక అతడు తన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని యేసుక్రీస్తు పై ఉ౦చి మరియు నిజముగా ఆయన పాపముల కొరకై శిలువ పై చనిపోయి తిరిగి మూడవ దినమున లేచి మరణము మీద విజయము సాధించి ఆయనయందు విశ్వాసము ఉ౦చు వాళ్ళందరికీ నిత్యజీవనము ఇవ్వటానికి చేసిన క్రియ. యోహాను 1ఛ12 లో చెప్పినట్లు: “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవునిపిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను”. క్రీస్తు కొరకు ఎవరైతే తమ జీవితాన్ని సమర్పించుకు౦టారో , వారే నిజమైన క్రైస్తవునిగా అనగా దేవుని బిడ్డగా, నిజమైన దేవుని కుటుంబంలో భాగమవుతారు. (1యోహాను 2:4, 10) ప్రకారము నిజమైన క్రైస్తవతత్వము అంటే ఇతరులను ప్రేమించటం మరియు దేవుని మాటకు విధేయత చూపించటం.

rigevidon reddit rigevidon tabletki rigevidon quantity