దేవుడు పరిపూర్ణుడు | God is Perfect


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ఆదికాండము 21:1 - యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.

మన దేవుడు దోషరహితుడు మరియు ఆయన వాక్యము ఎప్పటికీ స్థిరమైనది. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది మన జీవితాలను చుట్టుముట్టే అన్ని ప్రతికూల పరిస్థితుల కంటే బలమైనది, ఈ మాటలు మనకు సహజంగా అసాధ్యం అనిపించవచ్చు. పరిమితమైన మన ఆలోచనలు, అపరిమితమైన దేవుని వాగ్దానాలపై సందేహం లేదా ప్రత్యామ్నాయం కోసం చూస్తాయి.

కానీ దేవుడు మానవుడు కాదు, ఋతువులు మారినట్టు ఆయన మనసు మార్చుకోడు. ఆయన మార్పులేని దేవుడు, ఆయన తన వాగ్దానాలను నెరవేర్చడంలో పరిపూర్ణుడు.

శారా గర్భము దాల్చడానికి ఎటువంటి మార్గం లేదని గ్రహించినప్పుడు. దేవుని వాగ్దానమును సందేహించిన శారాహాగరు ద్వారా అబ్రాహాము కోసం ఒక బిడ్డను తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ప్రయత్నించింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, శారాకు దేవుడు ఇచ్చిన మార్పులేని శాశ్వతమైన వాగ్దానం ఆమె ఇస్సాకుకు జన్మనిచ్చినప్పుడు నెరవేరింది.

ఈరోజు, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు నిస్సందేహమైన ఆశీర్వాదముతో కూడిన నిరీక్షణ దాగి ఉంటుంది. ఎందుకంటే, ఆయన పరిపూర్ణుడు మరియు మన జీవితాలలో తన వాగ్దానాలను నెరవేర్చగల సమర్ధుడు. ఆమేన్.

అనుదిన వాహిని
https://www.youtube.com/watch?v=iiEKRv2Cmck

God is Perfect

Gen 21:1 Now the LORD was gracious to Sarah as he had said, and the LORD did for Sarah what he had promised.

Our God is flawless, and His word is established forever. When God promises, it is far above all the unfavourable conditions which surround our lives, which may naturally make it look impossible.
Our limited human thinking, doubt the promises of God and looks for alternative. But God is not human who would change with seasons and mood swings. He is an unchanging God, who is perfect in fulfilling His promises.

Sarah had absolute no hope to give birth, considering her age. She doubted God-s Promise and chose alternative way out to bring in a child for Abraham through Hagar. Despite of all this, what God promised  to Sarah was fulfilled when she gave birth to Isaac.

Today, Undoubtedly we have the blessed hope, when God speaks to us through His Word. God is perfect and is well able to fulfil His promises in our lives. Amen God Bless.

https://www.youtube.com/watch?v=2nDac5tJZp4