ఎల్లప్పుడు ఆయనను వెదకుడి | Seek Him Always


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ఎల్లప్పుడు ఆయనను వెదకుడి

యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.

మన యెడల దేవుని కృప విస్తరించబడాలి అంటే ఆయనను ఎల్లప్పూడు మనం వెదికేవారంగా ఉండాలి. దేవుని వెతికే మార్గాలు ఈ రీతిగా ఉన్నాయి.
1. ప్రార్ధన లో: ప్రార్ధన, దేవునిని వెతకడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి. కాబట్టి, దేవునితో మాట్లాడటానికి ప్రతిరోజూ సమయాన్ని వెచ్చించండి మరియు మీ అవసరాలు మరియు చింతలను ఆయనకు చెప్పండి.
2. దేవుని వాక్యం ద్వారా: బైబిల్ చదవడం మరియు ప్రతిరోజూ కొన్ని వచనాలను ధ్యానించడం దేవుని గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం. “లోగోస్” అనేది గ్రీకు పదం, ఇది దేవుని వ్రాతపూర్వకమైన దేవుని వాక్యం లేదా అక్షరానుసారమైన బైబిల్‌ గ్రంధాన్ని సూచిస్తుంది. ఇది సత్యం, జ్ఞానం మరియు అవగాహనకు మూలమైనది. “ర్హేమా” అనేది గ్రీకు పదం, ఇది దేవుడు మనతో మాట్లాడే సంగతిని గూర్చి సూచిస్తుంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనకు వెల్లడి చేయబడిన దేవుని సత్యమైన వాక్యం.
3.ఆరాధన ద్వారా: దేవుని వెతకడానికి ఆరాధన మరొక మార్గం. కాబట్టి, ఆయనను స్తుతించండి మరియదేవుడు మీ కోసం చేసిన అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయడం.
4. ఆజ్ఞలను పాటించుటలో: దేవుని వెతకడంలో ఆయన ఆజ్ఞలను పాటించడం చాలా అవసరం. కాబట్టి, దేవుని వాక్యాన్ని అనుసరించండి మరియు ఆయన దృష్టిలో సరైనది చేయడానికి కృషి చేయండి.
5. సహవాసం లో: ప్రభువును వెదకమని మిమ్మల్ని ప్రోత్సహించే మరియు సవాలు చేయగల తోటి విశ్వాసులతో సమయాన్ని వెచ్చించడం. కాబట్టి, మీరు విశ్వాసంలో ఎదగడానికి బైబిల్ స్టడీ లేదా ఏదైనా సంఘ కార్యాలలో చేరండి.
వీటన్నిటిని బట్టి దేవుని వెదక గలిగితే ఆయన ఎల్లప్పుడూ మనకు సమీపంగానే ఉంటాడు. ఆమెన్.

Telugu Audio:http://tempuri.org?link=new


Seek Him Always

Isaiah 55:6 Seek the LORD while he may be found; call on him while he is near.
We should seek the Lord while He may be found and call upon Him while He is near, while He is at hand and the door of mercy is open and the season of grace continues. Here are the ways we can seek the lord.
1. Pray: Praying to the Lord is one of the best ways to seek Him. Take time each day to talk to Him and tell Him your needs desires and worries.
2. Read the Bible: Reading the Bible and meditating few verses daily is an important way to learn about God. Logos is a Greek term that refers to the written Word of God or the Bible. It is the source of truth, wisdom and understanding. Rhema is a Greek term that refers to the spoken Word of God. It is the spoken truth of God that is revealed to us through the Holy Spirit.
3.Worship: Worship is another way to seek the Lord. Sing praises to Him and thank Him for all He has done for you.
4. Obey: Obeying Gods commands is essential in seeking Him. Follow His Word and strive to do what is right in His eyes.
5. Fellowship: Spend time with other believers who can encourage and challenge you to seek the Lord. Join a Bible study or church group to grow in your faith.

If we can seek God based on all these, He will always be near to us. Amen.

Connecting With God

English Audio: https://youtu.be/EI3M3xo6AkQ