దేవుని చిత్తమైన సమయం | In His Time


  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

దేవుని చిత్తమైన సమయం

జెఫన్యా 3:19 ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను.

క్రైస్తవ విశ్వాసులమైన మనం – వ్యతిరేక పరచే ప్రజలు, పరిస్థితులు లేదా ఆధ్యాత్మిక దాడులు వంటి వివిధ రూపాల్లో శత్రువులను ఎదుర్కోవచ్చు. మనం వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడటం లేదా భయపడటం చాలా సులభం, కానీ మనల్ని రక్షించడానికి మరియు మన శత్రువులపై చర్య తీసుకోవడానికి దేవుడు చేసిన వాగ్దానాలలో మనం ఓదార్పు మరియు బలాన్ని పొందవచ్చు. మనం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకోసం పోరాడతాడు.

 దేవుని సమయం మరియు పద్ధతులు ఎల్లప్పుడూ మన స్వంతదానితో సరిపోలకపోవచ్చు అని గుర్తుంచుకోవడం ముఖ్యమైనది . మనం ఊహించని, అర్థం చేసుకోని మార్గాల్లో ఆయన జోక్యం చేసుకొని మనకు విజయాన్ని దయజేస్తాడు. కానీ ఆయన సార్వభౌమాధికారుడని ఎల్లప్పుడూ మన మంచి కోసం పనిచేస్తాడని మనం విశ్వసించడం ఆశీర్వాదకరం.

ఈరోజు, మనం మన శత్రువులతో పోరాడే మన ప్రార్థనలో దేవుని పై భారం వేస్తూ ఆయన మన తరపున చర్య తీసుకుంటాడని పూర్తిగా విశ్వసిద్దాం. దేవుని ప్రేమను ప్రకటిద్దాం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/GwRtZ-Y4zEQ

In His Time

Zephaniah 3:19 At that time I will deal with all who oppressed you; I will rescue the lame and gather those who have been scattered. I will give them praise and honour in every land where they were put to shame.

As believers, we may face enemies in various forms such as people, circumstances, or even spiritual attacks. It-s easy to become discouraged or fearful when we face opposition, but we can find comfort and strength in God-s promises to protect us and take action against our enemies. We don-t have to fight our battles alone. God is on our side, and He will fight for us. 

It-s important to remember that God-s timing and methods may not always align with our own. He may choose to intervene in ways we don-t expect or understand. But we can trust that He is sovereign and always working for our good. When we face enemies, let-s turn to God in prayer and trust that He will take action on our behalf. Let-s also remember to pray for our enemies, that they may come to know the love and salvation of Jesus Christ.

English Audio: https://youtu.be/_B1UhhwLwEs