నా కొరకు యుక్తమైన ధర్మం ఏది?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-right-religion.html

సరిగ్గా మనకి కావలిసినట్టే ఆనతి చేయడాన్ని అనుమతించే ఈ త్వరగా వడ్డించే ఫలహారశాలలు మనలని ఆకట్టుకుంటాయి. కొన్ని కాఫీబడ్డీలు తమ వద్ద ఒక వందకన్నా ఎక్కువ సువాసన మరియు వైవిధ్యం కల భిన్నమైన కాఫీలు దొరుకుతాయని అతిశయోక్తులు చెప్తారు.

మనం ఇళ్లని మరియు కార్లనీ కొన్నప్పుడు కూడా మనకి అభిరుచి ఉన్న తీరుల కోసం మనం చూస్తాం. మనం ఇంక ఒక చోక్లేట్ ,వనీలా మరియు స్ట్రాబెరీ లోకంలో జీవించడం లేదు. అభిరుచే రాజు! మీ వ్యక్తిగత ఇష్టాలు మరియు అవసరాలకి అనుగుణంగా మీరేది కోరుకున్నారో మీరు దానిగురించి కనుక్కోగలరు.

కాబట్టి మీకు సరిపడే ధర్మం మాట ఏమిటి? అపరాధ భావన లేకుండా ఏ హక్కులనీ అడగకుండా ఇది-చేయి, అది-చేయవద్దు వంటి ఎన్నో ఇబ్బందికరమైనవాటితో నిండక ఉన్న ఒక ధర్మం మాట ఏమిటి? అది నేను వర్ణించినట్లే అక్కడ లేదు. కానీ ఒక ఇష్టమైన సువాసన గల ఐస్‌క్రీమ్ వలె ధర్మం ఏదో ఎంచుకునేదా?

మన ధ్యానం కోసం పోటీపడుతున్న ఎన్నో కంఠాలు ఉన్నాయి. అయితే ఎవరైనాకానీ మొహమ్మద్ లేక కన్ఫూసియస్ లేక ఛార్లస్ తాజ్ రస్సెల్ లేక యోసేఫు స్మిథ్ పైన యేసుని ఎందుకు పరిగణించాలి? అన్ని దార్లూ పరలోకానికే దారి తీయవా? అన్ని ధర్మాలూ ప్రాధమికంగా ఒకటే కావా? నిజం ఏమిటంటే అన్ని బాటలూ ఇండియానాని వెళ్ళనట్టే అన్ని ధర్మాలూ పరలోకానికి దారి తీయవు.

యేసు ఒక్కడే మృత్యువుని జయించేడు కనుక యేసు ఒక్కడే దేవుని అధికారంతోపాటు మాట్లాడుతాడు. మహమ్మదు, కన్ఫూసియస్‌ మరియు ఇతరులు తమ సమాధుల్లో అదే దినాన్న కుళ్ళిపోతారు. కానీ యేసు తన అధికారంయందు క్రూరమైన రోమను శిలువపైన మరణించిన మూడుదినాల పిమ్మట సమాధినుండి దూరం నడిచేడు. మరణంపైన అధికారం ఉన్న ఎవరైనా మన ధ్యానానికి పాత్రులు. మరణంపైన అధికారం ఉన్న ఎవరైనా సరే వారికి మాట్లాడే యోగ్యత ఉంది.

యేసు యొక్క పునరుత్ధానానికి ఆధారాన్ని ఇస్తున్న సాక్ష్యం బ్రహ్మాండమైనది. మొదట, లేచిన క్రీస్తుకి అక్షరాలా సాక్ష్యమిస్తున్న వారు ఐదువందలకన్నా ఎక్కువమంది. అది ఎంతో ఎక్కువ. ఐదువందల స్వరాలు నిర్లక్ష్యపెట్టేవికావు. రిక్త సమాధి యొక్క సంగతి కూడా ఉంది. పునరుత్ధానం యొక్క అన్ని పుకార్లనీ యేసు శత్రువులు అతని మృత కుళ్ళిపోతున్న శరీరాన్ని చూపించి సులభంగానే ఆపేవారు, కానీ చూపించడానికి వారి వద్ద ఏ మృతదేహం లేదు. సమాధి ఖాళీగా ఉంది. శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించి ఉంటారా? అసాధ్యం. అటువంటి అనిశ్చయత్వాన్ని అడ్డుకోవడానికి యేసు సమాధి ఆయుధాలు పట్టుకుని ఉన్న సైనికులవల్ల గట్టిగా కాపలా కాయబడింది. ఆయనకి అతి సన్నిహితమైన అనుచరులు ఆయన అడ్డగింపు మరియు శూలారోపణ పట్ల భయంతో పారిపోయేరన్నది పరిగణించితే భయపడి ఉన్న ఈ చింకిగుడ్డల జాలరుల మేళం శిక్షణ పొందిన శాస్త్రజ్ఞులని ఢీకొనడం అన్నది అతి అసంభవం. వారు అనేకమంది చేసినట్లు తమ జీవితాలనీ త్యాగం చేసి ఉండి మృతవీరులు అయిఉండేవారు కారు- ఒక మోసం కోసం. సరళమైన సంగతి ఏమిటంటే యేసు యొక్క పునరుత్ధానం విశదీకరించబడలేదు.

తిరిగి మరణంపైన శక్తి ఉన్న ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. యేసు మృత్యువుపైన తన శక్తిని నిరూపించేడు; కాబట్టి ఆయన చెప్పేది మనం వినడం అవసరం. రక్షణకి మార్గం తాను ఒక్కడే అని యేసు చెప్తాడు( యోహాను 14:6). ఆయన ఒక మార్గము కాదు; ఆయన అనేకమైన మార్గాల్లో ఒకటి కాడు. యేసే మార్గము.

మరియు ఇదే యేసు చెప్తాడు “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకి రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును”( మత్తయి 11:28). ఇది ఒక కఠినమైన లోకం మరియు జీవితం కష్టమైనది. మనలో అనేకమందిమి ఎక్కువగానే రక్తం కార్చి, దెబ్బలు తగిలి, యుద్ధపు మచ్చలని మోస్తున్నవారిమి. ఒప్పుకుంటారా? మీకేమిటి కావాలి? పునస్థాపనమా లేక ఒట్టి ధర్మమా? ఒక సజీవుడైన రక్షకుడా లేక మృతులైన అనేకమంది “ ప్రవక్తల” లో ఒకడా? ఒక అర్థవంతమైన సంబంధమా లేక రిక్త సంస్కార విధా? యేసు ఒక ఎంపిక కాదు- ఆయనే ఎంపిక.

మీరు కనుక క్షమాపణ కోసం చూస్తూ ఉంటే యేసు యుక్తమైన “ధర్మం” ( కార్యములు 10:43). దేవునితో ఒక అర్థవంతమైన సంబంధం కోసం కనుక మీరు చూస్తూ ఉంటే యేసు సరియైన “ధర్మం” (యోహాను 10:10). యేసు మీ రక్షకునిగా మీరు మీ విశ్వాసాన్ని ఆయనపైన ఉంచండి; మీరు చింతించరు ! మీ పాపాలకి క్షమాపణకోసం మీరు ఆయన్ని నమ్మండి. మీరు నిరాశ చెందరు.

ఈ వాక్యాలని చెప్పడంతో అవి మిమ్ము రక్షింపవు గానీ క్రీస్తుపైన విశ్వాసముంచడం మిమ్ము రక్షిస్తుంది. ఈ ప్రార్థన దేవునియందు మీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు అర్పించడానికి ఒక దారి మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షకి పాత్రుడనని నాకు తెలుసు. కానీ నా శిక్షని ప్రభువు యేసుక్రీస్తు తీసుకున్నాడు. దాని వల్ల ఆయనయందు ఉన్న విశ్వాసము ద్వారా నేను క్షమింపబడగలను. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీ మీద పెడుతున్నాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క వరం! ఆమెన్ ‍.