తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

తండ్రి – మన రక్షకుడు, సమస్తము దయజేయువాడు

కీర్తనల గ్రంథము 147:14 నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే

“ఒక మహిళ రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుండగా, ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు..” అని ఒక వార్తా పత్రికలో ముఖ్యాంశాలుగా ఇలా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మరో మహిళ జెస్సికా, అదే సమయములో తను కూడా అదే మార్గంలో వెళ్ళినప్పటికీ తను మాత్రం ఎలా తప్పించుకుందో తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఆ నేరస్తుడిని కలిసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాధానం సేకరించింది.
ఆ వ్యక్తి నుండి సమాధానం ఏమిటంటే, అతను జెస్సికాపై దాడి చేయాలని ప్లాన్ చేసాడు, కానీ ఆమె వెనుక ఇద్దరు వ్యక్తులు ఆమెకు కాపలాగా ఉండటంతో, అతను ఆమె దగ్గరికి వెళ్ళలేదు.

జెస్సికా ఆశ్చర్యపోయింది, వాస్తావానికి తాను ఒంటరిగానే ఉందని తనకు తెలుసు మరియు ఆమెతో ఎవరూ రాలేదు అని కూడా తెలుసు. ప్రియమైన వారలారా, దేవుడు తన పిల్లలకు ఇచ్చే రక్షణ ఇది, అవును ఆమె పని నుండి ఇంటికి వెళుతున్నప్పుడు తనతో పాటు ఉన్నవారు ఆమెను రక్షించే దేవదూతలు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన.

యేసు క్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, రక్షణ మరియు సమృద్ది ఆయన పిల్లలుగా మనం పొందే ఆశీర్వాదంలో భాగమని గ్రహించాలి. దేవుడు మన సరిహద్దుల్లో ఎల్లప్పుడూ సమాధానాన్ని అనుగ్రహించే వాడు. అంతేకాదు, మనకు సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించాగల మన రక్షకుడైన తండ్రితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మన రోజువారీ అవసరాల కోసం ఆయన వైపు చూసే వారంగా ఉండాలి.  ఇలాంటి ఆశీర్వాదాన్ని ప్రతిరోజూ అనుభవించడానికి ఈరోజు యేసును మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/MghNGKfxIH4