ప్రతి ప్రార్ధనకు జవాబు


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini

ప్రతి ప్రార్ధనకు జవాబు

1 దినవృత్తాంతములు 4:10యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను. 

యబ్బేజు ప్రార్థన దేవునిపై విశ్వాసం మరియు నమ్మకానికి ఒక వినూత్మమైన ఉదాహరణ. దేవుడు మాత్రమే తన ప్రార్థనకు జవాబివ్వగలడని మరియు అతను కోరుకున్న వాటిని అనుగ్రహించగలడని అతనికి తెలుసు. యబ్బేజు యొక్క విశ్వాసం మరియు దేవునిపై నమ్మకం నుండి మనం నేర్చుకోవచ్చు. 

మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎల్లప్పుడూ దేవుని వైపు తిరిగి ఆయన సహాయం కోసం అడగవచ్చు. ఆయన మన ప్రార్థనలన్నింటికీ జవాబిచ్చి మనకు అవసరమైన వాటిని అనుగ్రహిస్తాడు. 

ఈరోజు, మనం చేయవలసిందల్లా ఆయనపై నమ్మకం ఉంచడం మరియు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడనే విశ్వాసం కలిగియుండడం. మనం దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఎల్లప్పుడూ మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు అనుటలో ఎట్టి సందేహం లేదు. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/GYtBuketWQw