జీవితానికి అర్థం ఏమిటి?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-meaning-life.html

జీవితానికి ఉన్న అర్థం ఏమిటి? నేను జీవితంలో ఉద్దేశ్యాన్ని, నేరవేర్పుని మరియ సంతోషాన్ని ఎలా పొందగలను? శాస్వతమయిన ప్రాముఖ్యతని పొందే సామర్థ్యత నాకు ఉంటుందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలని పరగణించడానికి అధికమంది ఎప్పుడూ ఆగలేదు. సంవత్సరాల పిమ్మట, వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూసి తమ సంబంధాలు ఎందుకు తెగిపోయేయో మరియు తాము ఎందుకు అంత శూన్యంగా భావిస్తున్నామో అని ఆశ్చర్యపడతారు. బేస్‌బాల్ హాల్ ఓఫ్ ఫేమ్‌కి చేరిన ఒక బేస్‌బాల్ ఆటగాడిని, అతను మొదట బేస్‌బాల్‌ని ఆడటం ప్రారంభించినప్పుడు ఎవరైనా అతనికి ఏమిటి చెప్పవలిసి ఉండేదో అని అతను ఏమిటి కోరుకున్నాడో లేదోనని ప్రశ్నించబడింది. “ నీవు పైశిఖరానికి చేరిన తరువాత అక్కడేదీ లేదని ఎవరైనా నాకు చెప్తారని నేను ఆశించేను” అని అతను సమాధానం ఇచ్చేడు. చాలా సంవత్సరాల వ్యర్థ ప్రయత్నం తరువాత చాలా గమ్యాలు తమ శూన్యత్వాన్ని వెల్లడిపరుస్తాయి.

మన మానవ సమాజంలో మనుష్యులు వాటిలో తమకి అర్థం దొరుకుతుందని అనుకుంటూ అనేకమైన ఉద్దేశ్యాలని వెంబడిస్తారు. వారి కొన్ని ప్రయత్నాలలో వ్యాపారపు విజయం, ఆస్థి, మంచి బాంధవ్యాలు, లైంగిక సంబంధాలు, వినోదం మరియు ఇతరులకి మంచిచేయడం కలిగి ఉంటాయి. వారు ధనార్జన యొక్క గమ్యం, బాంధవ్యాలు మరియు సుఖసంతోషాలు సాధించినప్పటికీ కూడా , వారికి మనస్సులో ఒక గాఢమైన శూన్యత, ఏదీ నింపలేని ఒక రిక్తమైన భావన ఉందని, మనుష్యులు సాక్ష్యం పలికేరు.

అతడు “ వ్యర్థము! వ్యర్థము!........ సమస్తమూ వ్యర్థమే (ప్రసంగి 1:2) అని చెప్పినప్పుడు, ఈ భావనని ప్రసంగి యొక్క బైబిల్‌యుతమైన గ్రంధం యొక్క గ్రంధకర్త వ్యక్తపరుస్తాడు. ప్రసంగి యొక్క గ్రంధకర్త అయిన సోలొమోను రాజు వద్ద లెక్కలేనంత ఆస్థి ఉండి, అతనికి అతని సమకాలీనులకు మరియు మనకాలంలో ఉన్న ఏ మనిషికన్నా కూడా ఎక్కువ వివేకం, వందల గొద్దీ స్త్రీలు, రాజ్యాలు ఈర్ష్య పడే కోటలు, తోటలు అతి ఉత్తమమైన ఆహారం మరియు ద్రాక్షారసం మరియు సాధ్యమయే ప్రతి విధమైన వినోదం ఉండేవి. తన మనస్సు దేన్ని కోరినాకానీ, తను దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తానని అతడు తన జీవితంలో ఒకానొక సమయంలో చెప్పేడు. అయినప్పటికీ అతను దాన్ని “ఆకాశము క్రింద ఉన్న జీవితం” అని సంక్షిప్తంగా చెప్పేడు- జీవితానికున్నదల్లా మన కళ్లతో చూడగలిగేది మరియు మనం అనుభూతి చెందేది- అది –వ్యర్థము! అక్కడ అంత శూన్యత ఎందుకు ఉంది? ఎందుకంటే దేవుడు మనలని మనం ఇప్పుడే- ఇక్కడే అనుభవించేదానికన్నా మించిన దేనికోసమో సృష్టించేడు. ఆయన శాస్వత కాలజ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని........(ప్రసంగి 3:11) అని సొలొమోను దేవుని గురించి చెప్పేడు. ఉన్నదంతా ఇక్కడే-ఇప్పుడే అన్నదే కాదని, మనం మన హృదయాల్లో ఎరిగి ఉన్నాం.

బైబిల్ యొక్క ప్రధమ గ్రంధం అయిన ఆదికాండములో మానవజాతి దేవుని ప్రతిరూపమున సృజింపబడిందని మనం చదువుతాం (ఆదికాండము 1:26). మనం ఇంకేదాని కన్నా కూడా( ఏ ఇతర జీవాకృతియైనా) ఎక్కువ దేవుని వలె ఉన్నాం అని దీని అర్థం.

మానవజాతి పాపంలో పడి, పాపం యొక్క శాపం భూమిపైన పడినముందు ఈ కిందవి సత్యం అని కూడా మనం చూస్తాం. (1) దేవుడు మనిషిని ఒక సామాజిక జీవిగా చేసెను( ఆదికాండము 2:18-25); (2) దేవుడు మనిషికి పని ఇచ్చెను( ఆదికాండము 2:15); (3) దేవుడు నరునితో సహవాసము చేసెను( ఆదికాండము 3:8); మరియు (4) దేవుడు నరునికి భూమిమీద అధినివేశాన్ని ఇచ్చేడు(ఆదికాండము 1:26). ఈ సంగతుల ప్రాముఖ్యత ఏమిటి? వీటిలో ప్రతీదీ, మన జీవితంలో నిర్వర్తింపుని తేవాలని దేవుడు ఉద్దేశ్యించేడు, కానీ ఇవన్నీ (ప్రత్యేకంగా దేవునితో నరుని సహవాసం) మనిషి పాపంలో పడటం మరియమరియు భూమిమీద శాపంగా పరిణమించడంవల్ల వ్యతిరేకంగా పరిణమించేయి (ఆదికాండము 3).

బైబిల్లో ఆఖరి గ్రంధం అయిన ప్రకటన గ్రంధంలో, మనకి తెలిసి ఉన్న ఈ ప్రస్తుత భూమిని మరియు పరలోకాలని నాశనం చేసి, ఒక నూతన పరలోకమునీ మరియు ఒక నూతన భూమినీ సృష్టించడంతో, నిత్యమైన రాజ్యాన్ని ప్రవేశపెడతానని దేవుడు వెల్లడిపరుస్తాడు. రక్షింపబడనివారు అయోగ్యులని మరియు వారు అగ్నిగుండంలోనికి త్రోయబడాలని తీర్పు తీర్చబడినప్పుడు (ప్రకటన 20:11-15), ఆ సమయాన్న తను పునరుత్ధరించబడిన మానవజాతితో ఒక పూర్ణమైన సహవాసాన్ని దేవుడు మరల అనుగ్రహిస్తాడు. పాపం యొక్క శాపం నశించిపోయి ఏ పాపం, దుఃఖం, రోగం, మృత్యువు, నొప్పి ఇత్యాదివి ఇంక ఉండవు( ప్రకటన 21:4), మరియు విశ్వాసులు అన్ని సంగతులనీ స్వతంత్రించుకుంటారు. వారితో దేవుడు నివశించి వారు ఆయన కుమారులవుతారు( ప్రకటన 21:7). అలాగు, ఆయనతో సహవాసము ఉండటానికి దేవుడు మనలని సృజించి, మనిషి పాపం చేసి, ఆ సహవాసాన్ని తెంపినందువల్ల మనం చుట్టూ తిరిగి అక్కడికే వస్తాం. దేవుడు పూర్ణంగా తనవల్ల యోగ్యులుగా పరిగణించబడినవారికి ఆయన ఆ సహవాసాన్ని మరల అనుగ్రహిస్తాడు.

ఇప్పుడు, జీవితంలో ప్రతీదీ సాధిస్తూ, జీవితాన్ని గడిపి నిత్యత్వంకోసం దేవునితో వేరుపడి మరణించడంకోసమే అయితే అది వ్యర్థం కన్నా చెడుగానున్నది! కానీ నిత్యమైన ఆశీర్వాదం సాధ్యపరచడానికేకాక (లూకా 23:43), భూమిపైన జీవితాన్ని సంతృప్తికరంగా మరియు అర్థవంతంగా కూడా గడిపే ఒక దారిని దేవుడు చూపించేడు. ఈ నిత్యమైన ఆశీర్వాదం మరియు “పరలోకము మరియు భూమి” ఎలా ప్రాప్తమవుతాయి? యేసుక్రీస్తు ద్వారా మరల అనుగ్రహింపబడిన జీవితానికి అర్థం జీవితంలో ఉన్న నిజమైన అర్థం ఇప్పుడు మరియు నిత్యత్వంలో రెండిటిలో ఆదాము మరియహవ్వలు పాపంలో పడిన సమయాన్న, కోల్పోయిన దేవునితో సంబంధాన్ని పునస్థాపించడంలో కనిపిస్తుంది. ఈకాలం దేవునితో ఆ సంబంధం ఆయన కుమారుడైన యేసుక్రీస్తుద్వారా మాత్రమే సంభవం ( అపొస్తులల కార్యములు 4:12; యోహాను 14:6; యోహాను 1:12). ఎవరైనా తన పాపానికి (ఇంక దానిలో గడపక క్రీస్తు వారిని మార్చివేసి, వారిని ఒక నూతన వ్యక్తివలె చేయాలని కోరితే) మారుమనస్సు పొంది, మరియు రక్షకునిగా క్రీస్తుపైన ఆధారపడటం ప్రారంభిస్తే ( ఈ అతి ముఖ్యమైన అంశంపైన ఎక్కువ సమాచారంకోసం “ రక్షణ యొక్క ప్రణాళిక ఏమిటి? అన్న ప్రశ్నని చూడండి), నిత్యజీవితం లభిస్తుంది.

జీవితపు పరమార్ధం యేసుని రక్షకునిగా చూడటం వల్ల మాత్రమే కనిపించదు

( అది ఎంత అద్భుతమైనది అయినప్పటికీ). అంతకన్నా ఎవరైనా తను క్రీస్తుని అతని శిష్యుని వలె, వెంబడిస్తూ ఆయనవల్ల నేర్చుకుని ఆయనతో ఆయన వాక్యం అయిన బైబిల్‌యందు సమయాన్ని వెచ్చిస్తూ, ఆయనతో ప్రార్థనయందు సంభాషిస్తూ, మరియు ఆయన శాసనాలపట్ల విధేయతతో నడుస్తూ ఉన్నప్పుడు, అదే జీవితపు పరమార్థం. మీరు కనుక ఒక అవిశ్వాసి అయి ఉంటే (లేక బహుశా ఒక క్రొత్త విశ్వాసేమో), “ అది నాకు చాలా ఉత్తేజకరంగా లేక సంతృప్తిగా ఏమీ అనిపించడం లేదే “ అని మీకు మీరే చెప్పుకుంటూ ఉండే సంభావ్యత ఉంది. కానీ దయచేసి ఇంకొద్దిపాటు చదవండి. యేసు ఈ క్రిందనున్న మాటలని చెప్పేడుః

“ప్రయాసపడి భారమును మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకి రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను కనుక మీమీది నా కాడి ఎత్తికొని, నాయొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సుళువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి” ( మత్తయి 11:28-30). గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను( యోహాను 10:10 బి). “అప్పుడు యేసు తన శిష్యులని చూచి –ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును” ( మత్తయి 16:24-25). “యహోవానుబట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును( కీర్తన 37:4).

ఈ వచనాలన్నీ చెప్తున్నది మనకి ఒక ఎంపిక ఉందని. మనం మన స్వంత మార్గదర్శులమి అవడానికి శోధిస్తే, అది శూన్యమైన జీవితంగా పరిణమిస్తుంది. లేక మనం దేవుడిని మరియు ఆయనచిత్తాన్ని పూర్ణ హృదయంతో మన జీవితాల కోసం వెంబడిస్తే, అది జీవితాన్ని మన హృదయపు ఇచ్ఛలని నెరవేరుస్తూ, సంతోషం మరియు సంతృప్తిని కనుక్కుంటూ, సంపూర్ణంగా జీవించడంగా పరిణమిస్తుంది. మన సృష్టికర్త మనలని ప్రేమించి మనకోసం అతి ఉత్తమమైనది( అతి సులభమయిన జీవితం అయితే తప్పకకాదు, కానీ అతిగా సంతృప్తి కలిగించేది) కావాలని కోరినందువల్ల అది ఇలా అవుతుంది.

మీరు కనుక ఆటల/క్రీడల అభిమాని అయి ఉండి, ఒక వృత్తిపరమైన ఆటకి వెళ్తే, మీరు కొన్ని డాలర్లని వెచ్చించి, క్రీడా దర్శకకేంద్రంలో పైనున్న వరుసలో ఒక “ముక్కు- రక్తంకారే” సీటు పొందడానికి నిర్ణయించుకోవచ్చు లేకపోతే మీరు కొన్ని వందల డాలర్లని వెచ్చించి చర్య జరుతున్న చోటుకి దగ్గిరగా మరియు సన్నిహితంగా అవవచ్చు. క్రైస్తవ జీవితంలో అలా ఉండదు. దేవుడు పని చేయడాన్ని కొత్తగా చూడటం ఆదివారపు క్రైస్తవుల పనికాదు. వారు మూల్యాన్ని చెల్లించలేదు. దేవుడు పని చేయడాన్ని సమీపంనుంచి చూడటం తను దేవుని ఉద్దేశ్యాలని సాధించడం కోసం ఆమె/ అతను తన ఇచ్ఛలని సాధించడానికి ప్రయత్నం చేయడం నిజంగా మానివేసే పూర్ణహృదయపు శిష్యుల పనే. వారు మూల్యాన్ని చెల్లించేరు( క్రీస్తు మరియు ఆయన చిత్తానికి సంపూర్ణమైన అప్పగింత); వారు తమ జీవితాన్ని అతి ఉత్తమంగా ఉల్లసిస్తున్నారు; మరియు వారు తమని తాము, తమ సహవాసులని, తమ సృష్టికర్తనీ చింతించనక్కరలేకుండా ఎదురుకోగలరు. మీరు మూల్యాన్ని చెల్లించేరా? మీకు సమ్మతమేనా? అలా అయితే, మీరు అర్థం లేక ఉద్దేశ్యం వెనుక మరల ఆశపడరు.

rigevidon reddit rigevidon risks rigevidon quantity


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.