వివాహామునకు ముందు లైంగిక చర్య విషయమై బైబిలు ఏమి చెప్తుంది?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-sex-before-marriage.html

హీబ్రూలో గాని గ్రీకు భాషలో గాని ఎక్కడ కూడా వ్వివాహామునకు ముందు లైంగిక చర్య విషయమై ప్రత్యేక పదం ఉపయోగించలేదు. బైబిలు నిస్సందేహముగా జారత్వమును, వ్యభిచారమును ఖండిస్తుంది. అయితే వివాహామునకు ముందు లైంగిక చర్య జారత్వమా? 1 కొరింధి 7:2 ప్రకారము అవును అన్నదే స్పష్టమైన జవాబు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య యుండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త యుండవలెను. ఈ వచనముతో పాటు జారత్వమునకు విరుగుడు వివాహమే అన్నట్లు పేర్కొన్నాడు. 1 కొరింధి 7: 2 ప్రాధమికంగా చెప్పినదేమిటంటే మనుష్యులు తమను తాము జారత్వములో పడిపోకుండా అదుపులో పెట్టుకోలేరు కాబట్టి అనేక మంది వివాహేతర లైంగిక సంభంధాలు కలిగి యుంటున్నారు. కాబట్టివివాహము దానికి విరుగుడు. అప్పుడు వారి కోరికలు నైతికమైన పద్దతిలో తీర్చుకోగలుగుతారు.

1కొరింధి 7:2 స్పష్టముగా వివాహమునకు ముందు లైంగిక సంభంధము జారత్వముగా నిర్వచించింది. కాబట్టి బైబిలులో జారత్వమును పాపమని ఖండిస్తున్న ప్రతీవచనము వివాహామునకు ముందు లైంగిక చర్య పాపమను చూపిస్తుంది. జారత్వమునకు వున్న బైబిలు పరమైన నిర్వచనములలో వివాహామునకు ముందు లైంగిక చర్య చేర్చబడింది. వివాహామునకు ముందు లైంగిక చర్య పాపమంటూ అనేక లేఖనభాగలున్నాయి(అపొస్తలుల కార్యములు 15:20; 1 కొరింధీయులకు 5:1; 6:13, 18; 10:8; 2 కొరింధీ 12:21; గలతీయులకు 5:19; ఎఫెసీయులకు 5:3; కొలస్సీయులకు 3:5; 1 ధెస్సలోనీయులకు 4:3; యూదా 7). వివాహమునకు ముందు ఎటువంటి లైంగిక సంభంధమును కూడ బైబిలు ప్రోత్సాహపరచదు మరియు నిషేధించుద్ది. భార్య భర్తల మధ్యనుండే లైంగిక సంభంధమును మాత్రమే దేవుడు అనుమతిస్తున్నాడు (హెబ్రీయులకు 13:4).

లైంగిక చర్య అనే అంశాన్ని చాలసార్లు ఆహ్ల్లాదంను ఇచ్చే విషయంగా నొక్కి వక్కాణిస్తాముగాని ఉత్పన్నం ఛేయటం అనే అంశాన్ని గురించి మరచి పోతుంటాము. వివాహము సంభంధములో నున్నటువంటి లైంగికచర్యలో వినోదం, వికాసం వుండేటట్లు దేవుడు రూపించాడు. వివాహ సంభంధంలో స్త్రీ పురుషులు ఆనందించాలనేది దేవుని ఆశ. పరమగీతములాంటి మరియు ఇతర అనేక బైబిలు భాగాలు (సామెతలు 5:19లాంటి), లైంగిక సంభంధంలో నున్న సుఖాన్ని వివరిస్తున్నాయి. అయితే దేవుడు లైంగిక సంభంధాన్ని అనుగ్రహించినదాంట్లో పిల్లలను ఉత్పత్తి చేయటం దేవుని ఉద్దేశం అని దంపతులు మరచిపోకూడదు. కాబట్టి వివాహమునకు ముందు లైంగిక సంభంధం కల్గియుండటం రెంఢూ విధాలుగా తప్పు. 1). వాళ్ళకు అనుమతించని సుఖాన్ని అనుభవించటాన్ని ప్రయత్నించటం. 2). దేవుడు ఆశించిన కుటుంబ వ్యవస్థకు బయట ఒక ప్రాణాన్ని ఉత్పత్తి చేయటం.

ఇది ప్రయోగాత్మకంగా సరియైనది కాదా అని తేల్చిచెప్పటం కంటే, ఒకవేళ బైబిలు వివాహమునకు ముందు వుండే లైంగిక చర్యలకు సంభంధించిన ఆదేశాలకు విధేయత చూపినట్లయితే లైంగిక సంభంధమైనటువంటి జబ్బులు తక్కువవుతాయి. గర్భస్రావాలు తక్కువవుతాయి. పెళ్ళికాని తల్లులు తక్కువవుతారు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు తక్కువవుతారు. వివాహమునకు ముందు లైంగిక చర్య విషయములో దేవునికున్న నియమము నిషేధించడమే. జీవితాలను కాపాడతాది, బిడ్డలకు భద్రత కల్పిస్తాది, లైంగిక సంభంధాలకు సరియైన విలువనిస్తాది. అన్నిటికంటే ముఖ్యంగా దేవునిని గౌరవిస్తాది.