దేవుడు చెడును సృష్టించాడా?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-create-evil.html

దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి చెడునుకూడ ఆయనే సృష్టించివుంటాడని తొలుత అనిపిస్తుంది. అయితే చెడు అనేది ఒక రాయి లేక విద్యుత్తులాగా వస్తువుకాదు.కూజాడు చెడును కలిగిఉండటం అనేది అసాధ్యం. చెడు దానంతట అది ఉనికిలో ఉండలేదు, వాస్తవానికి మంచిలోపించటమే చెడు. ఉదాహరణకు రంధ్రాలు వాస్తవమే కాని అవి ఉనికిలో వుండాలి అంటే ఇంకా ఏదన్న ఒక వస్తువు ఖచ్చితముగా ఉండాలి. దేవుడు సృష్టించినపుడు వాస్తవానికి మంచివిగా సృష్టించాడు. దేవుడు సృష్టించిన మంచివాటిలో మంచిని ఒకటే ఎంపిక చేసుకోగలిగేది స్వేఛ్చగలిగిన జీవులు మాత్రమే. వాస్తవికమైన ఎంపిక చేసుకోవటానికి వీలు కల్పించుటకుగాను, మంచికి భిన్నముగాని ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. దేవుడు, దేవదూతలు మరియు మనుష్యులకు మంచిని అంగీకరించే లేక మంచిని తృణీకరించీ (చెడు) చేయుటకుగాను ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. రెండు మంచి విషయముల మధ్య చెడు సంభంధమున్నట్లయితే దానిని చెడ్డది అని అంటాం. అయితే అది దేవుడు సృష్టించిన చెడ్డ వస్తువు కాదు. అయితే అది ఒక వస్తువు అయిపోలేదు, దానిని దేవుడు సృష్టించాడుఅన్నట్లు.

ఈవిషయాన్ని అర్ధంచేసుకోవడానికి మరొక దృష్టాంతం చలి ఉనికిలో ఉందా అని ఎవరైనా అడిగితే ఉంది అని జవాబివ్వవచ్చు. అయితే అది సరియైన జవాబు కాదు. ఎందుకంటే చల్లదనం ఉనికిలో ఉండదు, ఉష్ణతలోపించడమే చల్లదనం. అదేవిధంగా అంధకారము అనేది ఉనికిలో ఉండదు, వెలుగు లోపించడమే. చెడు అనేది మంచిలోపించటమే. ఇంకా శ్రేష్టమైన జవాబు ఏంటంటే చెడు అనేది దేవుడు లోపించడమే.

దేవుడు చెడును సృష్టించాల్సిన ఆసరంలేదు. అయితే మంచి లేకుండా ఉండగలిగేవుండే పరిస్థితిని అనుమతించాలి. దేవుడు చెడును సృష్టించలేదుగాని అనుతించాడు. ఒకవేళ దేవుడు చెడును అనుమతించకుండవుండినట్లయితే దేవతలు మానవులు సేవించేది ఎంపికనుబట్టి కాదుగాని, భాధ్యతలేక నియామాన్నిబట్టే. తయారుచేసిన, రూపొందించిన నియామాలకు అనుగుణంగా వ్యవహరించే యంత్రాలను (రొబొట్స్)తయారుచేయాలని ఆయన ఉద్దేశ్యం కాదు. దేవుడు చెడు చేయటానికి అనుమతిని ఇవ్వడంద్వారా మనము స్వచ్చిత్తాన్ని కలిగినవారమై ఆయనను సేవించాలావద్దా అనేది ఎంపికచేసుకోవడానికి సాధ్యమైంది.

పరిధులుకలిగినటువంటి మానవులముగా అపరిమితమైన దేవుడును ఎన్నడు పరిపూర్ణముగా ఎన్నికచేసుకోలేం (రోమా 11:33-34). కొన్నికొన్ని సార్లు దేవుడు ఎందుకిలాచేసాడు అని అనుకోని తర్వాత దేవుడు వేరే వుద్దేశ్యంతో ఇలాచేసాడని అర్థంచేసుకుంటాం. దేవుడు విషయాలను పవిత్రమైన నిత్యమైన దృక్పధంలో చూస్తాం. మనము విషయాలను పాపపు భూలోక మరియు పరిమితమైన దృక్పధంలో చూస్తాం. దేవుడు ఆదామును హవ్వను సృష్టించి భూమిమీద ఎందుకుపెట్టారు? వారు పాపముచేసి తద్వార చెడును మరికొన్ని శ్రమను మానవాళిపై తీసుకొస్తారని తెలిసికూడా? ఎందుకు ఆయన మనలను సృజించి పరలోకములో విడిచిపెట్టలేదు? అక్కడ శ్రమలులేకుండా పరిపూర్ణంగా వుండివుండే వాళ్ళం కదా. నిత్యత్వపు ఇవతలవున్నామనము ఆప్రశ్నలకు సమగ్రమైన జవాబులు ఇవ్వలేము. మనము గ్రహించగలిగేది దేవుడు పరిశుధ్ధుడని ఏదిచేసిన పవిత్రమైనదని, పరిపూర్ణమైనదని మరియు ఆయనకు మహిమకరమైనదని ఎంపిక ద్వార ఆయనను ఆరాధించే కల్గించుటకుగాను చెడును దేవుడు అనుమతించాడు. ఒకవేళ దేవుడు చెడును అనుమతించకపోయినట్లయితే ఆయన నియమాన్నిబట్టి ఆరాధించేవాళ్ళము కాని మనము ఆయన స్వచ్చిత్తాన్ని బట్టి ఎంపికకాదు.