యేసుక్రీస్తు మరణ పునరుత్ధాన మధ్యకాలాం నరకానికి వెళ్ళాడా?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Jesus-hell.html

ఈ ప్రశ్న విషయంలో తీవ్రమైన గందరగోళమున్నది. ఈ విషయము ప్రాధమిక అపోస్తలుల విశ్వాసప్రమాణములో అదృశ్యలోకములోనికి దిగిపోయెననియు అని పేర్కొంటుంది. లేఖానాలలో కొన్ని వాక్య భాగాలు యేసుక్రీస్తు నరకమునకు వెళ్ళెనని అర్థంవచ్చినట్లు వాదించారు. ఈ అంశంను పరిశోధించకముందు బైబిలు మరణించినవారి లోకము గురించి ఏవిధంగా భోధిస్తుందో అవగాహన చేసుకోవాలి.

హీబ్రూ లేఖానాలో మృతులలోకము షియోల్ అని వివరించారు. సామాన్య అర్థం మృతులుండే ప్రదేశము,లేక విడిచి వెళ్ళిన ప్రాణాత్మల ప్రదేశము. క్రొత్తనిబంధనలో గ్రీకు పదము దీనికి సమాంతరముగా హెడెస్ కూడ మృతుల ప్రదేశమునే చూపిస్తుంది. క్రొత్తనిబంధనలోని లేఖనభాగాలు పాతాళమును తాత్కాలికమైన ప్రదేశమనియు అక్కడ ఆత్మలు అంతిమ పునరుత్ధానముకోసం వేచియుంటారని సూచిస్తుంది. ఈరెండిటిని మధ్య వ్యతాసాన్ని ప్రకటన 20:11-15 చూపిస్తుంది.నరకము (అగ్నిగుండం)శాశ్వతమైనది. తీర్పు తర్వాత నశించినవారి అంతిమస్థానము. హెడెస్ తాత్కాలికమైన ప్రదేశము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువువారు నరకమునకు వెళ్ళలేదు. ఎందుకంటె అది భవిష్యత్తులోకానికి సంభంధించింది. మరియు గొప్ప ధవళ సింహాసనపు తీర్పు తర్వాత ప్రాతినిధ్యములోనికి వచ్చేది ( ప్రకటన 20:11-15) .

షియోల్/ హెడెస్, రెండు భాగాలు కలిగివున్నవి (మత్తయి 11:23, 16:18;లూకా 10:15, 16:23; అపొస్తలుల కార్యములు 2:27-31). ఒకటి రక్షింపబడినవారికి, రెండవది, నాశనమైనవారు. రక్షింపబడినవారి యొక్క ప్రదేశము పరదైసు గాను, అబ్రాహామురొమ్ము గాను పిలువబడుతుంది. రక్షింపబడినవారికి, నాశనమైనవారికి మధ్య వేరుపరుస్తు పెద్ద అగాధమున్నది (లూకా 16:26). యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమైనపుడు పరదైసులోనున్న విశ్వాసులను తనతోపాటు కొనిపోయెను (ఎఫెసీపత్రిక 4:8-10). అయితే పాతాళములోనున్న నాశనమయినవారి స్థితి మార్పు లేనిదిగానున్నది. అవిశ్వాసులుగా మరణించినవారి అంతిమ తీర్పుకై అక్కడ వేచియుంటారు. యేసుక్రీస్తు షియోలుకి/ హెడెస్సుకి, పాతాళమునకు వెళ్ళారా? అవును ఎఫెసీపత్రిక 4:8-10 మరియు 1 పేతురు 3:18-20 ప్రకారము.