కావలెను...కావలెను...


  • Author: Bro. Pradeep Kumar
  • Category: Articles
  • Reference: Bro. Pradeep Kumar

కావలెను...కావలెను...
సమూయేలు వంటి దేవుని సన్నిధిలో గడిపే బాలుడు
యోసేపు వంటి తన పవిత్రతను కాపాడుకొనిన దేవుని భయము గలిగిన యోవ్వనుడు
దావీదు వంటి దేవునికి 7సార్లు ప్రార్ధించే మధ్య వయస్కుడు
అబ్రాహాము వంటి దేవునికి స్నేహితుడైన వృద్ధుడు
కావలెను...కావలెను... కాని ఎక్కడ దొరుకుతారు వీరు నేటి మన క్రైస్తవ సమాజములో

కావలెను...కావలెను...
యెహోషువ కుటుంబము వంటి దేవుని సేవించే కుటుంబము
యోబు వంటి తన పిల్లల పరిశుద్ధతను కాపాడే తండ్రి
హన్నా వంటి తన పిల్లల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్ధించే తల్లి
ఇస్సాకు వంటి విధేయత కలిగిన కుమారుడు
యెఫ్తా కుమార్తె వంటి తన తండ్రి దేవునితో చేసిన ప్రమాణమును నెరవేర్చిన కుమార్త
కావలెను...కావలెను... కాని ఎక్కడ దొరుకుతారు వీరు నేటి మన క్రైస్తవ సమాజములో

కావలెను...కావలెను...
బెరయ సంఘము వంటి ప్రకటించబడిన దేవుని వాక్యము పరిశీలించే సంఘము
ఏలియా వంటి విశ్వాసముతో ప్రార్థించే వీరుడు
యేసుక్రీస్తు వంటి మాదిరి కలిగిన సువార్తికుడు
దావీదు వంటి ఆత్మీయ కీర్తనాకారుడు
స్తెఫను వంటి క్రీస్తుకోసం మరణించే హతసాక్షి
కావలెను...కావలెను... కాని ఎక్కడ దొరుకుతారు వీరు నేటి మన క్రైస్తవ సమాజములో