ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు- కనీస క్రమశిక్షణ


  • Author: Unknown
  • Category: Messages
  • Reference: General

ప్రియ దేవుని సంఘమా! మనమందరం ఆదివారం ఆరాధనకి వెల్లడానికి ఇష్టపడతాం.(దేవుణ్ణి ప్రేమించే వారంతా). అయితే ఆరాధనకి వెళ్ళిన తర్వాత ఆరాధన మీద – వాక్యం మీద మన మనస్సు, ధ్యానం లఘ్నం చేస్తున్నామా లేదా? ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం ? కొంచెం ఆలోచిద్దాం.

దేవుని సమాజంలో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చు చున్నాడు. కీర్తన 82:1.
దీనికి సపోర్టింగ్ రిఫరెన్సు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుంటారో వారి మధ్య నేను వుంటాను అని యేసయ్య సెలవిచ్చారు. మత్తయి 18:20;

కాబట్టి దేవుని ఆలయంలో దేవుడు వున్నారు, ఆయనకి భయపడాలి, ఆయనని గౌరవించాలి అన్న ధ్యాస మనలో వుంటే, వాక్యం మీదనే లక్ష్యం ఉంచుతాం తప్ప ఇటు అటు చూడము, ఇటు అటు తిరగం.

ఆయన దేవాదిదేవుడు, రాజాధిరాజు, మహోన్నతుడు. (కీర్తనలు గ్రంధం). ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అన్న పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, భయంకరుడైన (reverend--- ఆయన మాత్రమే). ఆయనని ఆరాధించడానికి వచ్చియున్నాము అన్న విషయం గుర్తుంటే దేవుని సన్నిధిని అజాగ్రత్తగా ఉండము.

మరికొంతమంది ఆరాధనలో నిద్రపోతూ వుంటారు. ఇంకొంతమంది ప్రక్కవారితో మాట్లాడుకొంటూ వుంటారు. మొబైల్ లో గేమ్ ఆడుకొనేది కొంతమంది. ఆదివారం నాడు ఆరాధనకి రాకుండా సినిమాలకి, షికార్లకి వెళ్ళేవారు కొంతమంది.

కీర్తన 84:10, నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది. అదేవిధంగా ఒక్క దినం మిస్ అవడం వెయ్యి దినాల ఆశీర్వాదంను పోగొట్టుకోవడమే. అందుకే ఆరాధనకి వస్తాము, వచ్చి నిద్రపోతాం. వాక్యం వినం. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రసంగం అయ్యాక వచ్చేది కొంతమంది. కానుకల సమయంలో గాని, ఆశీర్వాదం ఇచ్చే సమయంలో గాని వచ్చేవారు కొంతమంది. వారి ఆలోచన ఆదివారంనాడు గుడికి వచ్చి, Attendance వేయిన్చుకొంటే చాలు.1000 days blessings వచేస్తాయ్ అని పొరబడుతున్నారు. అలా చేస్తే దేవుని ఆశీర్వదాలకి ప్రతికూలంగా దేవుని శాపాన్ని పొందుకొంటున్నావ్ అని మర్చిపోకు.

మరి ఏం చెయ్యాలి???
మొదటగా దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము. ప్రసంగీ 5:1
నీ ప్రవర్తన, నీ మాటలు, నీ వస్త్రధారణ అన్ని జాగ్రతగాచూసుకోవాలి. ఎందుకు? ముందు చెప్పిన విధంగా దేవుడు మనమధ్య వున్నారు, ఆయన రాజులరాజు, ప్రభువుల ప్రభువు, భయంకరుడైన దేవుడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి.

దయచేసి ఒక విషయం గమనించాలి. మనం వెళ్ళేది మార్కెట్ కి కాదు, సినిమా హాల్ కి కూడా కాదు. క్రిస్టియన్ గెట్ టుగెదర్ కి అంతకన్నా కాదు, పెళ్ళికో , ఫంక్షన్ కో, వ్యాపారానికో కూడా కాదు. రారాజుని పూజించటానికి వెళ్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన, మన వస్త్రధారణ క్రమబద్ధంగా వుండాలి . కొంతమంది యువతి యువకులు నేటి కాలంలో ఘోరమైన వస్త్రధారణతో సంఘానికి వస్తున్నారు. Tight T-shirt వేసుకొని, ఖండలు, 6 pack చూపించేవారు కొంతమంది. స్త్రీలు పెదాలకి రంగు, కనుబోమలకి రంగు, ఇంకా భయంకరమైన వస్త్రధారణతో వస్తున్నారు. విచారం ఏమిటంటే, మాదిరిగా ఉండాల్సిన సేవకుల భార్యలు, పిల్లలు సంఘస్తుల కంటే భయంకరంగా తయారై , బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేషం వేసుకొని సంఘానికి వస్తున్నారు. ఇక సంఘస్తులు ఇంక ఎలా వుంటారు.

CHURCH IS NOT A FASHION SHOW.
మన వస్త్రధారణ, నడక దేవునికి అనుకూలంగా వుండాలి గాని, లోకస్తులు చేసినట్టు, లోకాన్ని మరియు ఇతరురలను ఆకర్షించేదిగా ఉండరాదు. ఒక కలెక్టర్ ఆఫీస్ కి ఆ రకమైన వస్త్రధారణతో వెళ్ళగలవా? దయచేసి గమనించమని మనవి.

2. ఆరాధనకి వచ్చి నిద్రపోతారు. దేవుడంటే భయం వుంటే నీకు నిద్రరాదు. దేవుడంటే నిజమైన ప్రేమ వున్నా నిద్ర రాదు. ప్రియ సహోదరీ/సహోదరుడా! శనివారం నాడు సాయంత్రం తర్వాత దయచేసి TV చూడకు,TV కట్టేసి, ప్రార్ధన చేసుకొని, భోజనం చేసి తొందరగా నిద్రపో! ఆదివారం గుడిలో నీకు నిద్రరాదు. రాత్రి ఒంటిగంట వరకు నివు TV చూస్తే నీకు ఆదివారం చర్చి లో నిద్ర వస్తుంది.చాల మంది ఆదివారం నాడే పనులు పెట్టుకొంటారు. ఎదో మ్రొక్కుబడికి గుడికి వచ్చిన వాక్యం వినరు. మీరు చేసేది ఆచారం తప్ప ఆరాధన కాదు. దేవునికి మీ ఆచారాలు అవసరం లేదు. ఆత్మతోను సత్యం తోనూ చేసే ఆరాధన కావాలి.

౩. దయచేసి ఆరాధనలో మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఒక రెండు మూడు గంటలు మీ మొబైల్ కట్టేస్తే కొంపలు మునిగిపోయేదేమి లేదు. నీవు ఎవరో ముఖ్యమైన వారిని కలిసి నప్పుడు గాని, ఒక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు గాని మొబైల్ కట్టేస్తావ్ కదా. ఆ కలెక్టర్ ని కూడా పుట్టించింది నా యేసయ్య అని మర్చిపోతున్నావ్. మరి చర్చి లో ఎందుకీ మొబైల్ ఆపడం లేదు. మొబైల్ లో గేమ్స్ ఆడుకొనే వారు కొంతమంది. కొంతమంది మొబైల్ లో బైబుల్ వుంది అందుకే ఆపడం లేదు అంటారు. ప్రియ దేవుని బిడ్డా! మొబైల్ లో బైబుల్ ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు చదువుకోడానికే తప్ప ఆదివారం ఉపయోగించడానికి కాదు. నివు దైవ గ్రంధాన్ని మోస్తే అది నిన్ను ఒకరోజు మోస్తుంది. మరి ముక్యంగా అది జీవ గ్రంధం.దానిని ప్రతీరోజు చదవాలి అంతే కాకుండా ఆదివారం గుడికి తీసుకు రావాలి. అలా కాకుండా మొబైల్ తో సరిపెట్టుకోగూడదు. నీకోసం ప్రాణం పెట్టిన నీ దేవునికి ఇచ్చే మర్యాద ఇదేనా? నీ మొబైల్ లో బైబుల్ తో పాటు ఇంకా ఏమేమి వున్నాయి? సినిమా పాటలు, గేమ్స్ , ఇంకా నానా చెత్త అంత దానిలోనే స్టోర్ చేస్తున్నావ్ కదా. వాటి ప్రక్కనే బైబుల్. దయచేసి బైబుల్ ని మోయండి. బైబుల్ కి ఇచ్చే ప్రాధాన్యత బైబుల్ కి ఇవ్వండి.

4. ప్రార్ధనా పూర్వకంగా రావాలి. ప్రభువా ఈరోజు నాతొ మాట్లాడండి. నన్ను నీ ఆత్మతో తాకండి, ముట్టండి. అని ప్రార్ధన పూర్వకంగా వస్తే దేవుడు తప్పకుండా తన మెల్లని చల్లని స్వరం నీకు వినిపిస్తారు. ఎదో విదంగా, ఎదో రకంగా దేవుడు నీతో మాట్లాడతారు.
Do not Expect Anything If You Do not Concentrate On Word Of God.

5. నీకు ఎవరిమీదనైన కోపం, ద్వేషం గాని వుంటే మొదట వారితో సమాధాన పడు. లేదా ఆ వారంలో నీవు ఎవరినైన ఏమైనా అంటే, ఎవరినైనా నొప్పించి వుంటే మొదట వారిని క్షమాపణ అడుగు. లేకపోతె నివు గుడిలో ప్రార్ధించడం మొదలుపెట్టిన వెంటనే సాతాను గాడు గొప్ప ప్రార్ధన చేసేస్తున్నావ్ గాని ఫలాని వాళ్ళని ఇన్ని మాటలు అన్నావ్. ఇప్పుడు ఏమి ఎరగనట్టు ప్రార్ధన చేస్తున్నావ్. దేవుడు నీ ప్రార్ధన వింటాడా? వినడు. అని నీకు చెప్పి నిన్ను ప్రార్ధన చెయ్యకుండా ఆపెస్తుంటాడు. వాడి మాటలు విన్నావా నీవ్ చివరకు బ్రష్టుడవైపోతావ్. అందుకే దేవుని దగ్గర మరియు ఆ వ్యక్తీ దగ్గర క్షమాపణ అడుగు. నీ ఇగో ని వదిలేయ్. నిన్నూ పరలోకం చేర్చేది నీ ఇగో కాదు. ఒకసారి నీ ఇగో వదేలేయ్. నీకు మనశ్శాంతి , ఆ వ్యక్తీ నీకు మద్య శాంతి. దేవునితోను ఆ వ్యక్తితోను సమాధానం కలిగి వుంటావ్. నీ ఇగో ని సంతృప్తి పరచాలని చూసావా 100% నరకానికి పోతావ్.

దయచేసి ఈ రకమైన సిద్దపాటు క్రమశిక్షణ కలిగి ఆరాధనకి వస్తే ఆ ఆరాధన నీకు ఆశీర్వదకరంగా వుంటుంది, మరుసటి ఆదివారం ఎప్పుడొస్తుందా అని నీ హృదయం తహతహలాడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
ఆమెన్