ఆరాధనలో పాటించాల్సిన కనీస క్రమశిక్షణ - వస్త్రధారణ


  • Author: Unknown
  • Category: Messages
  • Reference: General



స్త్రీ పురుష వేషం వేసుకోనకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోనకూడదు.ఆలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ద్వితీ 22:5.

గమనిచారా? బైబుల్ గ్రంధం క్లియర్ గా చెబుతుంది స్త్రీ పురుష వేషం వేయకూడదు పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు అనగా స్త్రీ పురుషుని వలె వస్త్రధారణ చేసుకోకూడదు. ఐతే నేటి దినాల్లో మోడరన్ కల్చర్ మన దేశంలో రాజ్యం చేస్తుంది, మన దేశ ఆచార వ్యవహారాలను మించిపోయింది మోడరన్ కల్చర్.దానివల్ల ఇప్పడు అమ్మాయిలు స్త్రీలు Jeans ప్యాంటు- టైట్ T-షర్టు వేసుకొని తిరుగుతున్నారు. ఏమంటే చాల కంఫర్ట్ గా వుందని కొందరు, లేటెస్ట్ ఫాషన్ అని కొందరు, లేటెస్ట్ ట్రెండ్ అని కొందరు, ఫలానా హీరొయిన్ వేసుకోంది కాబట్టి నేను వేసుకొంటున్నాను అంటున్నారు.

అయితే బైబుల్ దీనిని ఖండిస్తుంది. స్త్రీ పురుషునిలాగా బట్టలు వేసుకోకూడదు. మన భారత దేశ వస్త్రధారణ ప్రకారం జీన్స్ ప్యాంటు T షర్టు స్త్రీ వేషం కాదు. అది ఏ దేశ మైన అది పురుషుని వేషమే. మరి వీరు దేవుడైన యెహోవాకు అసహ్యులు కారా? దేవునికి అసహ్యులు అంటే పరలోకం చేరలేరు. పరలోకం లేదు అంటే నరకానికి సీట్ ఖాయం అన్న మాట.

సరే బయటి వారి కోసం మనకు అనవసరం. అయితే నేటి దినాల్లో చాల మంది అమ్మాయిలు పాటలు చాలా బాగా పాడుతున్నారు. worship చేస్తున్నారు. నడిపిస్తున్నారు.పరలోకాన్ని క్రిందికి దించుతున్నారు అందుకు దేవునికే మహిమ. గాని వారిలో కొందరు జీన్స్ ప్యాంటు లు T షర్టులు ,షర్టు లు వేసుకొని పాటలు పాడుతున్నారు. ఇది దీవెనా? శాపమా?

ప్రియమైన సంఘకాపరి! ఎప్పుడైనా వీరిని వారించావా? ఎవరైనా చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? వారి కానుకలు ఆశించి ఇలాంటివి భోదించడం మానేశావా?ఖండించుము గద్ధించుము భుద్ధిచెప్పుము. (2 తిమోతి 4:2)లో నీకు అధికారం ఇస్తే వారి కానుకలు ఆశించి వారికి అనుకూల భోదలు చేస్తున్నావా? అవి భోదించక పొతే వారి ఆత్మలకి వుత్తరవాదివి నీవే అని మరచి పోతున్నావా? యేహెజ్కేలు 3: 16 -21.

ప్రియమైన తల్లిదండ్రులారా! మీరు మీ పిల్లలను వాక్యపు వెలుగులో పెంచుతున్నారా లేదా? బైబుల్ ని వారికి ప్రతీ రోజు భోదిస్తున్నారా లేదా? వాళ్ళు వేసుకొంటున్న వస్త్రధారణ వాక్యానుసారమైనదా లేదా కనిపెడుతున్నారా? దేవుని బిడ్డలకు తగిన వస్త్రధారనా కాదా అని చూస్తున్నారా? లేక వారు కోరిన బట్టలు కొని పెడుతున్నారా? అవి మంచివా కావా? వాక్యానికి వ్యతిరేఖమా అని సరి చేస్తున్నారా లేదా? వాక్యానికి వ్యతిరేఖమైన ఈ వస్త్రధారణ శరీరాన్ని కప్పేది పోయి శరీరపు కొలతలు చూపించేదిగా, పురుషులకి కోర్కెలు పెంచేవిగా ఉంటున్నాయి, అలాంటివి వేసుకొని ఆరాధనకి వస్తే ఆరాధన ఎలా జరుగుతుంది. మీరు ఎలా ఒప్పుకొంటున్నారు?

ప్రియమైన సహోదరి! ఒకవేళ మీ భోదకుడు , మీ పేరంట్స్ చెప్పకపోతే ఎప్పుడైనా వాక్యాన్ని చదివావా? నీవు చేసే ప్రతీదానికి అది మంచిదైన సరే చెడ్డదైన సరే విమర్శ దినమందు లెక్క చెప్పాలని తెలియదా?

నేటి దినాల్లో అనేక మంది దైవ సేవకుల కుమార్లు కుమార్తెలు మాదిరిగా వుండటం మానేసి వారే లోకస్తుల మాదిరి విచ్ల్చల విడిగా వస్త్రధారణ చేస్తూ, లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దైవ సేవకుల కుమార్తెలే టైట్ బట్టలు పాంట్ షర్టులు వేసుకొని సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ప్రియమైన సహోదరి! నిజంగా ఈ వాక్యాన్ని ఇంతవరకు చదివి యుండకపొతే, నీకు ఎవరు భోదించకపొతే, ఇప్పుడైనా సరే అటువంటి వస్త్రధారణ మానేయ్. ముఖ్యంగా సంఘంలో అట్టివి కుదరనే కుదరదు. దైవ భక్తీ గలవారమని చెప్పుకొనే స్త్రీలకూ తగినట్టుగా వస్త్రధారణ చేసుకోమని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను.



ఇక పురుషులారా! సినిమా హీరోలు చేసే చెత్త హెయిర్ స్టైల్, చెత్త బట్టలు పొట్టి బట్టలు వేసుకొని బ్రస్తుడవై పోవద్దు. జేఫన్యా 1:8 అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకొనే వారినందరినీ నేను శిక్షింతును. అని సెలవిస్తుంది, అన్య దేశస్తుల వలె వస్త్రధారణ చేసుకొనే స్త్రీని గాని పురుషున్ని గాని దేవుడు శిక్షిస్తాను అంటున్నారు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. గడ్డపు ప్రక్కలు కత్తిరించుకో కూడదు అని బైబుల్ క్లియర్ గా సెలవిస్తుంది లేవీఖాండము 19:27; అనగా ఫ్రెంచ్ కటింగ్,హిప్పీ కటింగ్ దేవునికి ఇష్టం లేదు. లోకస్తుల వలె నీవు స్టైల్ చేస్తే దేవునికి ఇస్టుడిగా వుండలేవు. యాకోబు 4:4 ఎవరైతే ఈ లోకాన్ని స్నేహం చేస్తారో వారు దేవునికి వైరం అనగా శత్రుత్వం చేస్తున్నారు. దయచేసి లోకస్తుల వలె వేషం వేసుకొని సంఘంలో పాటలు పాడకు. సంఘాన్ని నీవు కాదు క్రీస్తే ఆకర్షించనీ. సంఘంలో పాటించాల్సిన కనీస క్రమ శిక్షణ ప్రియ సహోదరి సహోదరుడా పాటించమని దైవ దీవనలు పొందమని మనవి చేస్తున్నాను. అట్టి కృప మనందరికీ కలుగును గాక!

దైవాశీస్సులు . ఆమెన్