శుద్ధిచేయు తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

శుద్ధిచేయు తలంపులు :

కీర్తనలు 51:10 - "దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము".

మన హృదయాలు ఆయన అధిష్ఠించు సింహాసనమువలె ఉన్నవి. ఆయన వాటిపై అధికారముతో ఆసీనుడై ఉండులాగున అవి తయారుచేయబడినవి.   అటువంటి ప్రత్యేకమైన, పవిత్రమైన స్థలమును శుద్ధపరచుకోకుండా బదులుగా మాలిన్యాలను మన హృదయంలో ఉంచుకొనియున్నాము.  మనం గతం, అందులోని చేదుజ్ఞాపకాలు, కష్టాలు, బాధలు, అవమానాలు... వీటన్నింటినీ మన హృదయంలో ఉంచుకొనియున్నాము. చెరువు గుర్రపుడెక్కతో నిండిపోయినట్లు మన హృదయాలు వీటితో నిండిపోతే సరిచేయడం చాలా కష్టం. మనలోని లోకాశలను నశింపజేసినప్పుడే అలా చేయగలము.   అది ఎంతో కష్టము తో కూడుకొన్నప్పటికీ మన ప్రభువు మనకు సహాయము చేస్తొడు.  కీర్తనాకారుడైన దావీదు అర్థించుచున్నట్లు మనము కూడా ఆయనను వేడుకొందాము

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నీవు నాలో ఉండి పనిచేయుచున్నందుకు నీకు వందనములు.   నా హృదయములో ఉన్న కలుషితాన్ని తీసివేసి శుద్ధిచేసుకొనుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Cleansing Thoughts: 

Psalms 51:10 - “ Create in me a clean heart, O God." Our hearts are like a throne room, designed for the King to live and rule from a place of authority where He has a complete reign. But we aren’t very good at housekeeping, and we store all kinds of junk in our throne rooms. We don’t get rid of the old baggage, or the boxes with memories of old flames, traumas or bad experiences. When we allow our hearts to become cluttered, the process of emptying, ordering, stripping and restoring gets harder and harder, and more and more painful. The process of restoring the throne to the King, is a process of dying to ourselves. There will be things in our lives that are hard to root out, but the King will take the time to do so because he wants a clear throne room. He longs for us to have no distractions, so He can speak and we can hear clearly. The King is ready to be given back His throne, He’s waiting for you to accept this challenge to gently re-order your throne room and let Him take up permanent residence. Are you ready?

Talk to The King:  

Almighty King, I thank You for  the way You work in me so that You alone can reign as King in my Life. Help me declutter my throne of unnecessary things and give place to You. In Jesus name, Amen.