సిద్ధపరచు తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

సిద్ధపరచు తలంపులు :

మత్తయి 8:26 - "అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారు".

జీవితం ఒక సముద్రంలాంటిది. ఎప్పుడూ ఆటుపోటులతో నిండియుంటుంది.  కెరటాలు ఎగసిపడి మనలను ఎక్కడికో తోసివేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అటువంటి పరిస్థితులకు సిద్ధపడుతాము.  ప్రళయంవంటి పరిస్థితుల్లోనుండి నడవబోతున్నామని మనకు తెలుసు.  కొన్నిసార్లు జాగ్రత్తపడి సిద్ధంగా ఉంటే మరికొన్నిసార్లు ఆనందంగా స్వాగతిస్తాము.  మనం సిద్ధపడకపోతే మనం చిక్కుకుపోతాము. అల్పవిశ్వాసముతో మనం ఎదుర్కోలేము.  జీవితమంతా ప్రళయాన్ని మనం ధైర్యముగా ప్రభువువలె ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రళయం మనకు తలొగ్గుతుంది.  ఆ ఎదుర్కోవడానికి చాలా శక్తి అవసరం. అది ప్రభువైన యేసుక్రీస్తు వలననే మనకు లభిస్తుంది.   మన ప్రతీ కష్టంలో, ప్రతీ అవసరతలో, బాధలో మనకు కావలసిన ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు.  నీవు ఈరోజు ఎలాంటి కష్టములో ఉన్నా అల్పవిశ్వాసముతో కృంగిపోక ప్రభువువైపు చూడుము.


ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నన్ను కృంగిపోనీయక నీ కృపతో నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రములు.   అలాంటి ప్రళయములలో నన్ను బలపరచినందుకు నీకు వందనములు.   ఎన్నడూ అల్పవిశ్వాసముతో ఉండక సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి ‌సహాయము చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Preparing Thoughts:  

Matthew 8:26 - “Why are you fearful, O you of little faith?” Life is like an ocean. It’s full of twists and turns, currents pulling us in different directions, and waves that seem to crash over us out of nowhere.  Sometimes we’re ready and waiting for the waves. We know we’re about to walk through a storm, we we’re prepared, ready to protect ourselves from any eventuality. Other times we’re happily enjoying a quiet time for the soul, then, in an instant, we are being pounded with the  storm that arrived with no warning. We aren’t ready and we’re stuck and we try to fight back   If we spend our life fighting against every method that God may use to make us more like Him, then the trials and storms will only intensify - He doesn’t give up on us! He has wonderful plans for your partnership with Him, and as long as we profess trust and commitment to Him, He will draw us to Himself by any means necessary. What if, the great storm that you may be in, is in fact, His great rescue plan? 


Talk to The King:   

Father thank You for not letting me down my own way but bringing me back to You in Your grace and mercy. Thank You for the storms in my life through which You strengthen me. In Jesus name, I pray, Amen.