మెల్కొలిపే తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

మెల్కొలిపే తలంపులు :

1 పేతురు 5:8 -  "నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి".

మనము తరచూ నోవాహు ఉన్నప్పటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము.  సాతాను దాడిచేయబోతున్నాడని ఏదో ముప్పు వాటిల్లబోతుందని మెలకువ కలిగి దేవుని వాక్యమునందు విశ్వాసముంచాలి.   ముందుచూపు లేకుండా, గ్రుడ్డివారుగా ఉంటే అపవాది యొక్క వ్యూహాలలో చిక్కుకుపోతాము.  అపవాది మొదటి నిన్ను అబద్ధం ద్వారా మోసపుచ్చుటకు ప్రయత్నిస్తాడు.  దేవుడు సత్యవంతుడు ఆయన ఎల్లప్పుడు సత్యమునే పలుకుతాడు.  అపవాది అబద్ధికుడు వాడెల్లప్పుడూ అబద్ధములే పలుకుతాడు.  దేవుని హృదయంతో నీ హృదయం ఏకీభవించుటకు నిశ్చయించుకొనుము.  దేవుడు సిలువయాగము ద్వారా మనకు అపవాదిని జయించే శక్తిని ప్రసాదించాడు. గనుక సాతాను యత్నాలను ఎదుర్కోవడానికి మెలకువ కలిగి అప్రమత్తంగా నడుచుకుందాము.

ప్రార్థనా మనవి:

ప్రియమైన తండ్రి!!! మెలకువ కలిగి నడుచుకోమని నన్ను హెచ్చరించినందుకు నీకు వందనములు.   ప్రతీ విధమైన శోధనను జయించుటకు నీయందు ఆధారపడియుండుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Vigilant Thoughts:  

I Peter 5:8 -  “Be sober, be vigilant.” Too often, we live our lives like in the days of Noah, believing that no storm is pending, no evil is lurking, but the Word of the Lord states that we need to be vigilant. To be blind, deaf, and mute to this knowledge is to leave yourself open and vulnerable to the lies and strategies of your enemy. The enemy's primary strategy is to lie to you. Remember, God is Truth and can only tell the truth. The enemy is a liar and will always lie. Commit to renewing your mind with the mind of Christ. The cross of Christ disarms the enemy, destroying and demolishing him. God gives you authority by the works of the cross to stand firm in agreement that the enemy has no hold on you, for God has called you out of darkness and into His marvelous, magnificent, and wonderful light.

Talk to The King:   Father, thank you for your admonishing and reminding me how important it is to be vigilant. Help me to rely on You to defeat every evil. In Jesus name, I pray, Amen .