నేటి ప్రపంచములో ప్రకృతి బీభత్సలకు, విలయాలకు కారణం

  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Articles
  • Reference: Jesus Coming Soon Ministries

ప్రస్తుత దినములు అపాయకరమైన కాలములని 2 తిమోతి పత్రిక 3:1 లో మనము చూస్తాము.KJV  *తర్జుమలో know it the coming days are very dangerous.* అని చూస్తాము. ఇలాంటి దినాలలో ఏమి జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? మనుష్యులు ఎలా వుండబోతున్నారు? అంతము ఎప్పుడు అనే విషయాలను జాగ్రత్తగా తెలుసుకుందాం.

ప్రస్తుత దినాలలో  ప్రజలందరూ టెలివిజన్ ముందు కూర్చుని చూస్తుంటారు. ఆకస్మికముగా బ్రేకింగ్ న్యూస్ అనే మాట తెరమీదికి రాగానే అందరికళ్ళు టీవీ తెర మీదనే ఇలాంటి భయంకరమైన దినాలలో మనమున్నము. మనుష్యులు ఎప్పుడు  ఆలోచించేది రాబోయే దినాలు ఎలావుండబోతున్నాయి?అని తీవ్రంగా ఆలోచిస్తూవుంటారు. అంతేకాక తర్కవాదములు  డిబేట్ లు జరిగిస్తుంటారు. ఒక్కక్కరిది ఒక్కొక్క ఆలోచన .అయితే  మనుష్యులు ఎన్ని ఆలోచించినా, ఎంత వాదించుకున్న అంతిమంగా దేవుడు నిర్ణయించినదే దేవుడు జరిగిస్తాడు.

నేటి దినాలలో  మనుష్యులు ఎల్లపుడు రేపేమీ జరుగుతుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కారణం భయం ,ఆందోళన. ఈ రెంటి మధ్య మానవుడు సతమతమవుతున్నడు.కనుకవాస్తవంగా ఆలోచిస్తే నాడు నేడు అపాయకరమైన దినములు అనగా ప్రకృతి  వైపరిత్యాలు,వరద భీభత్సలు ,ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ,భూకంపాలు, కరువులు , యుద్ధంలు, కుటుంభముల మధ్య అవగాహనలేమి మొదలగు ఎన్నో పరిస్థితులగుండా మనము వెళ్తున్నాము. వీటి వెనుక కారణాలను మనము తెలుసుకోవాలి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి.


ప్రకృతి వైపరిత్యాలకు మరియు విలయాలకు కారణాలు:-

దీనికంతటికీ మూల కారణం మానవుడు చేసిన పాపం. ఆది మానవుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. నాటి నుండి నేటివరకు మానవుడు పాపము చేస్తూనే ఉన్నాడు.కాబట్టి మానవుడు పాపము చేసినప్పుడు ఆ పాపము యొక్క బరువు భూమి మీద పడుతుంది కనుక భూమి మీద  పడిన మానవుల యొక్క పాపపు బరువు మనలను మోస్తున్న  భూమి మోయలేక పోతుంది.యేషయా 24:17 నుండి 20 వ వచనము వరకు జాగ్రత్తగా పరిశీలించినచో..

1.. భూమి మత్తుని వలే తూలుచున్నది.

2..పాకవలె ఇటు అటు  ఊగుచున్నది.

కారణమేమిటో అని లోతుగా పరిశీలించినట్లైతే మానవుని యొక్క పాపమును భూమి మోయలేకపోవడమే కాకుండా భూమి అపవిత్రప్రచబడింది.నోవాహు కాలములో (ఆది కాండము6:11,12 వచనాలను మనము పరిశీలిoచినట్లైతే ఆ దినములలో లోకము ఏ స్థితిలో వున్నది మనము గమనించగలము.దేవుడు సృష్టి అందలి సమస్తమును  సృజించినపుడు  అంతయు దేవుని దృష్టి కి మంచిదిగా నుండెను.అయితే ఆదాము హవ్వల  యొక్క పాపము, ఆ తర్వాత కయినుకు,ఆ తరువాత మనుష్యులకు  ప్రాప్తించేను .అందువలన వారి హృదయము యొక్క తలంపులోని ఊహా  చెడ్డది అయి  ఉండుటచేత  ఈ లోకము ఏ స్థితిలో  వుందో క్రింద గమనించగలుగుతాం.

1. భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. 12ఏ

2.భూలోకము భలాత్కారముతో నింపబడెను.12బి.

దేవుడు చూచినప్పుడు అది చెడి పోయి ఉండెను.సమస్త శరీరులు తమ మార్గమును చేరిపి వేసుకొని ఉండిరి.దేవుడు నిన్ను చూచినప్పుడు నీవు ఎలాగున్నావ్? ఏ స్థితిలో ఉన్నావ్? ఎలాంటి  పాపములో జీవించుచున్నావు? జాగ్రత్తగా పరిశీలన చేసికో. నైతికంగా నీవు చెడిన స్థితిలో ఉన్నవా? మానసికంగా,శారీరకంగా ,ఆత్మీయంగా నీ స్థితిగతులేంటీ?

పై కారణాలను బట్టి దేవుడు మొదటిసారిగా నరులను   సృజించినందుకు సంతపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను.అని ఆదికాండము 6:6 లో గమనిస్తాము.సంతాపమంటే ఎవరైన చనిపోతే వారికొరకు సంతాపపడే దినాలను మనం వింటాము గానీ దేవుడు నరులను సృజించినందుకు   సంతాప పడటం ఎంత బాధాకరం అంతేకాక దేవుని హృదయం వేదనతో కృంగి వున్నది .అందుకే దేవుడే మనుకున్నాడు, ఆదికాండం 6: 13 వ లొ దేవుడు నోవహుతో చెప్పిన మాటలు. “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమి తో కూడా  నాశనము చేయుదును” అన్నాడు కాబట్టి ప్రజలతో పాటు దేవుని ఉగ్రత భూమ్మీద పడింది అందుకే మొట్టమొదటి సునామీని చూడగలుగుతున్నాము. అందువల్లనే భయంకరమైన జల ప్రళయము నలువది పగళ్లు నలువది రాత్రులు వర్షం కురియట ద్వారా ఒక నోవాహు కుటుంబం తప్పా అందరూ నాశనమైపోయిరి. ఎంత సిగ్గు కరం మన వలన భుమి అపవిత్రపరచబడుతున్నదని

స్వ విమర్శ చేసుకోవాలి. లేకపోతే భూమి బరువెక్కి అపవిత్రపరచబడి ప్రకృతి వైపరీత్యాలకు మనమే కారణమౌవుతాము. నీవు నీ కుటుంబం భూమి మీద జీవించడం వలన నష్టం లేదుగానీ నీవు చేసే పాపమునుబట్టి భూమికి ఈ  బాద కలుగుతుంది. అందరికంటే ఎక్కువగా దేవునికి బాధ కలుగుతుంది. కాబట్టి మనలను మన కుటుంబాలను గురించి మనము  ఆలోచించవలసి ఉంది.*సునామిని గురించి ఒక మాట*

ఒక భయంకరమైన జలప్రళయము నకు శాస్త్రజ్ఞులు పెట్టిన పేరు సునామీ. దీని గురించి దేవుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆమోసు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. ఆమోసు 5 :8 ,9 వచనాలను పరిశీలించినట్లయితే *సముద్ర జలమును పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారచేయువాడు. ఆయన పేరు యెహోవా. అని మనము చూస్తాము ..2009లో సునామీ అను ఈ జలప్రళయంలో మన దేశములో కూడా రావడముతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశం కంటే ముందు ఇండోనేషియా దేశం మీదికి వచ్చింది. మనదేశ మీద కూడా దాని ప్రభావం పడింది. ఆ తర్వాత జపాన్లో భయంకరమైన జలప్రళయం సునామి రూపంలో విరుచుకుపడింది. నేటికి ఇలాంటి వి సంభవిస్తూనే ఉన్నాయి ఇలాంటివెన్నో ప్రభు రాకముందు చూస్తాము హగ్గయి 2 :6 లో మనము గమనించినట్లయితే మరియు సైన్యములకు అదిపతిఅగు యెహోవా సెలవిచ్చినది ఏమనగ- ఇంకా కొంతకాలం ఇంకోకమారు ఆకాశమును భూమిని నేలను నేను కంపింప చేతును. అని మనము చూస్తాము కావున ఒకేసారి ఆకాశంలో, భూమిలో, సముద్రంలో, నేలలో, భయంకరమైన భూకంపం సంభవింప పోతుంది. అప్పుడందరూ మరణిస్తారు.కావున నీవు నీ పాపములను ఒప్పుకొని యేసు రక్తంలో శుద్ధికరించుకొని ఆయన  బిడ్డ గా జీవిస్తె పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు లేకపోతే నీవు నరకంలో పడతావు.మార్కు సువార్త 16 :16 లొ దేవుని వాక్యం ఇలాగు బోధిస్తుంది నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును,  నమ్మని వానికి శిక్ష విధించబడును.* కనుక నీవలన భూమి సమయం ఉన్నందున ఆ పవిత్ర పరచబడి బరువెక్కి అనేక వైపరీత్యాలకు కారణమైన నీవు మార్పుచెంది  ప్రభు బిడ్డగా జీవించాలని ప్రభువు ఆశిస్తున్నాడు కాబట్టి మనము ఈ లోకంలో చాలా జాగ్రత్తగా జీవించాలి ఒక ప్రార్థన చేయాలి జీవించాలి .

1విసుగక  ప్రార్దన చేయాలి

2.పరిశుద్దంగ  జీవీంచాలి.

3.యేసుక్రీస్తు యొక్క మనుగడ కొరకు సిద్ధపడాలి

దేవుడు  మిమ్మును దీవించి ఆయన రాకడ కొరకు మిమ్ములను ఆయతం చేయునుగాక