ఎఫెసిలో వున్న సంఘము

  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Messages
  • Reference: Jesus Coming Soon Ministries

క్రీస్తునందు ప్రియపాఠకులారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక !  ఎఫెసి  సఘంపు చరిత్రను ఇంకా లోతుగా ధ్యానించె ముందు సంఘము, సంఘముయొక్క స్థితిగతులను ధ్యానించుకుందాము. సంఘము అనగా అనేకమంది దేవుని బిడ్డలతో కూడిన  గుంపు ఈ గుంపులో విశ్వాసులు అవిశ్వాసులు మిలితమైయుందురు.  ఈలాంటి గుంపుగా వున్న ఎఫెసి సంఘమునకు బలమైన సందేశము ఇవ్వమని దేవుడు శిష్యుడైన యోహాను కు తెలియజేశాడు.కావున సంఘం యొక్క క్రియలు అనగా సంఘంలో విశ్వాసులు యొక్క జీవిత విధాన శైలి మరియు వారి యొక్క ప్రవర్తన మరియు సంఘము బయట వారు ఏలాగు జీవించవలసి ఉన్నదో చెప్పె బలమైన సందేశమును వినిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. విని రాసినది యోహాను భక్తుడు. నేడు మరల చదివి, విని,   ధ్యానించేది  మనమే. దేవుడు మనకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చెనో  చూడుడి.

అన్నిటికంటే సంఘం వెలుపట, లోపట జీవించే విధానము అత్యంత ప్రాముఖ్యమైనది. చాలామంది విశ్వాసులు లోపల ఒక రకముగా, బయట మరొక రకంగా జీవిస్తూ ఉంటారు. వీరిని వేషదారులు అని పిలుస్తారు. మనం వీరి వలె జీవించకుండా ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని ప్రభువు కోరుతున్నాడు.మత్తయి 23 అధ్యాయంలో వేషదారులు వారి క్రియలను గురించి  చూస్తాం. రెండవది మత్తయి 7:15 లో రెండవ గుంపును చూస్తాం. సంఘం యొక్క పరిశుద్ధత ఎంత అవసరమో జాగ్రత్తగా గమనించాలి. సంఘము పవిత్రమైనది గనుక కళంకమైనది మరి అట్టిది ఏదైనను లేకుండా జాగ్రత్తగా చూసుకునవలెను. మరియు పరిశుద్ధమైనది నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకునవలెని వాక్యమును ఉదక స్నానము చేత పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచునట్లు ఎఫెసి 5 వ అధ్యాయంలో మనం చూస్తాం.  మూడవదిగా ఎత్తబడే గుంపులో సంఘము ఉండవలెను. కారణం ప్రభువు రాకడ సమీపం గనుక విశ్వాసులు అందరు ఆయన ప్రత్యక్ష తను ఎొందుకు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవలెను.   నాలుగవది సంఘంలోని విశ్వాసులు అపవాదిని ఎదింరించుటకు ఎఫెసి పత్రిక 6వ అధ్యాయంలో 10- 18 వరకు ఉన్న వాక్య భాగంలో పేర్కొనబడిన యుద్ధ ఉపకరణములు దించుకోవాలి.

*సార్వత్రిక సంఘము*

సార్వత్రిక సంఘం అనగా విశ్వాసుల సమూహమని అర్థం. మరొక మాటలో ప్రపంచంలో ఉండే అన్ని సంఘాలను కలిపి సార్వత్రిక సంఘం అని పిలుస్తారు. సంఘం అనే మాట మత్తయి 16 :18 లో మనం గమనిస్తాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అని ప్రభువు సెలవిచ్చినట్లుగా చూస్తాం. సంఘ స్థాపకుడు యేసుప్రభు  వారు దాని బాధ్యతను ఈ భూమ్మీద తీసుకున్నది పేతురు భక్తుడు. పేతురు యొక్క సేవా పరిచర్య ప్రారంభంలో దేవుని యొక్క మహా అద్భుతాలు జరిగినట్లుగా చూస్తాం. అ.పొ. 2 అధ్యాయంలో పెంతకోస్తు పండుగ దినమున అందరూ అనగా యేసు క్రీస్తు శిష్యులు ఇంచుమించు 120 మంది ముందు. పేతురు మొట్టమొదటి ప్రవచనం పలికెను. ఈ ప్రవచనం అ.కా 1:16 లో చూడగలం. పేతురును ఒక నాయకుడిగా పరిశుద్ధాత్ముడు అభిషేకించెను.సంఘ నాయకత్వం నిర్వహించే ప్రతి సేవకుడు పరిశుద్ధాత్ముని దేవుని అభిషేకం పొందవలెను.  అలా పొందినప్పుడు సంఘము అభివృద్ధి జరుగును. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా సంఘము పెరగదు.

పేతురు పరిచర్యలో ఒక బలమైన అభిషేకం తో కూడిన సందేశం ద్వారా మూడు వేల మంది సంఘంలో చేర్చబడిన ట్లు అ.కా 2: 41 లో చూస్తాం. రెండవ కూడికలు 5 వేల మంది రక్షించబడిరి. ఆ తరువాత లక్షల మంది ప్రభువును నమ్మిరి.ఈ విధంగా అక్కడ ఉన్న సంఘం లను కలిపి సార్వత్రిక సంఘము అని పిలుస్తారు.

*సార్వత్రిక సంఘం యొక్క ప్రాముఖ్యమైన కార్యములు*

1 . విశ్వాసులను రక్షణలో నడిపించి సంఘంలో సభ్యులుగా చేర్చబడుటకు కృషి చేయవలెను.

  1. ప్రార్థనలో, వాక్యంలో బలపరచి దేవుని కొరకు జీవించుటకు నడిపించ వలెను.
  2. సార్వత్రిక సంఘం యొక్క ఆవశ్యకత సంఘం లోని విశ్వాసులు అందరు ప్రభువు రాకడ లో ఎత్తబడే సంఘంలో ఉండేందుకు అందర్నీ సిద్దపరచాలి.

* సార్వత్రిక సంఘం యొక్క ప్రాధాన్యత*

ఎత్తబడే సంఘం ప్రభువు రాజ్యంలో వారి వారి కర్తవ్యాలను నిర్వర్తించడానికి దేవుడు వారికి బాధ్యతలు అప్పగిస్తాడు.

సార్వత్రిక సంఘంలో  విశ్వాసులు అందరు ఏక మనసుతో బేధాభిప్రాయాలు లేకుండా పరిశుద్ధతతో ప్రేమతో జీవించారు.

సార్వత్రిక సంఘంలో విశ్వాసులు అందరు ఐక్యమత్యంతో జీవించాలి. ఎందుకంటే అపవాది సంఘంలో జొరబడి చిచ్చు పెట్టును. అంతేకాక సంఘమును పాడు చేయను.         సార్వత్రిక సంఘంలో మూలము ప్రేమనే. సంఘంలో విశ్వాసులు అందరు ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక ప 10వ అధ్యాయం 24వ వచనం లో స్పష్టంగా తెలియజేశాడు. కావునా మనం అందరం పరిశుద్ధత అనే పరిపూర్ణత లో ప్రవేశించి ఆత్మకు ,శరీరమునకు కల్మషము అంటుకోకుండా ఆయన రాకడకు సిద్ధపడి అయత్తమవుదుము గాక.