అణు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది?


  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Articles
  • Reference: Jesus Coming Soon Ministries

క్రీస్తునందు ప్రియమైన పాఠకులారా యేసు నామమున మీకు శుభములు కలుగును గాక ! అణు యుద్ధం గురించి ధ్యానించుటకు ప్రభువు ఇచ్చిన సమయమును బట్టి దేవునికి స్తోత్రములు. యుద్ధం అనే మాట విని విని  మనందరికీ బోర్ గా అనిపిస్తుంది.మరి యుద్ధం చేయాలని ఆశ పడుతున్న    వారి కథ ఏమిటి? వారు కూడా నిరాశలో మునిగి అసహనంతో ఉన్నప్పుడు ఎవరో ఒకరు విరుచుకుపడతారు.

యుద్ధం అనివార్యం కాదు అని అనుకునే సమయంలో ఆకస్మికంగా జరిగేదే  యుద్ధం. ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఉండకపోతే చెల్లించక తప్పదు. ఇలాంటి పరిస్థితిల గుండా ప్రతి దేశం ముందుకు కొనసాగుతుంది. ఉదాహరణకు కార్గిల్ యుద్ధం.ఈ యుద్ధం జరుగుతుందని ఎవరు భావించ లేదు. అలాంటి పరిస్థితుల మధ్య ఇరు దేశాల రాయబారులు, దేశాధినేతలు చర్చించినా చర్చలు విఫలం కావడం, ఉన్నట్లుండి పాకిస్తాన్ యుద్ధం ప్రారంభించడం మనకు విదితమే. అయితే యుద్ధంలో చివరికి భారతదేశం సైన్యం జయ పతాకం ఎగరేసింది.

నాశనం చేస్తానని మాట్లాడిన నేతలు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? మర్చిపోయారా ? 2018లో ఎందుకులే అని అనుకుంటున్నారా? నరనరాలలో ఉదికిపోతున్న సైనికులలో యుద్ధం చేసి యుద్ధం చేసి సర్వ నాశనం చేయాలన్న తపన ఇరుదేశాల మధ్య   అగ్గి మీద గుగ్గిలం  వేసినట్లే ఉంది. ఏమైందో ఏమో అంతా నిషబ్ధ  వాతావరణం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు .

ఇవన్నీ గమనిస్తుంటే ప్రభువు రాకడ అతి సమీపంలో ఉందని మనం గుర్తెరగాలి.తన రాకడముందే ఎలా ఉంటుందో, ఏమేమీ జరుగుతుందో మత్తయి 24 అధ్యాయాల్లో మనము విపులంగా చూస్తాము..

యుద్ధమంటే రక్తపాతం. దానివల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇవి ఎగురుతూ చివరకు చేరేది ఆకాశం మండలం లోనే. ఈ ఆకాశ మండలంలో ఉండే కక్ష లోని గ్రహాలను దాటి చివరకు చేరేది చంద్రుని దగ్గరకు. దేవుడు ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాడు.ఎప్పుడు కనబడే సూర్యుడు ఈ భయంకరమైన యుద్ధాల తాకిడివల్ల ఎరుపు రంగులోనికి మారిన సంఘటనలు గత ఐదు వేల సంవత్సరాలలో అనేకసార్లు జరగడం మనం విన్నాం మరియు చరిత్ర లో చదువుతున్నాము. యూదుల యుద్ధభూమిలో భీకర  యుద్ధ పోరు జరిగినప్పుడెల్లా అనేక వేల ప్రాణాలు పోయినప్పుడు. ఆకాశంలో సూర్యుడు రక్త వర్ణం ఆగడం మనకు విదితమే కాబట్టి చంద్రుడు రక్తవర్ణం అవ్వడం మనకు విదితమే.

కాబట్టి చంద్రుడు రక్త వర్ణమయ్యాడంటే  ఒక భయంకరమైన యుద్ధం జరిగిందనో జరగబోతుందనో అర్థం. దీని వల్ల అవసరం లేదు. ఈ మధ్య కాలంలోనే రెడ్ మూన్ వచ్చినట్లు మనం పేపర్లో చదివాం.   దాని  అర్థం ఏంటి? ఏదో జరగబోతుంది ?  అది భీకర యుద్ధమే, వినాశకర యుద్ధమే.

లేఖనాలు మనం పరిశీలిస్తే ఆంతర్యం బయటపడుతుంది.  యోవేలు గ్రంధము 2:30, 31 వచనాలు మనం చూస్తే *”మరియు ఆకాశమందును, భూమియందును  మహాత్కార్యములు అనగా రక్తమును అగ్నిని దూప స్థంభంలు గా కనపరచేను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడు ను అగును, చంద్రుడు రక్త వర్ణ అగును”*.

ఈ వాక్యంలో మనకు స్పష్టంగా గమనిస్తున్న దేమనగా ఆశ్చర్యకార్యములే అద్భుతములే అంత్య దినమున జరగబోతున్నాయి అన్నది నగ్నసత్యం. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ అని యే షయ 9 :6 లో చూస్తాం. కావున జరుగబోయే సంఘటనలన్ని జరిగించేది దేవుడే .కొన్నిటిని దేవుడు తన సేవకుల ద్వారా జరిగిస్తాడు. కొన్నిటిని దేవుడే స్వయానా జరిగిస్థాడు. ఇప్పటివరకు 9 ప్రపంచ అద్భుతాలు విన్నాం అయితే ఈ అద్భుతాల కంటే ఇంకా ఆశ్చర్యకరమైన అద్భుతాలు అల్ప ఓమేగా ఉన్న దేవుడు జరిగిస్తాడు. ఏం జరుగ బోతున్నా యి?

ఆకాశమందు భూమియందు మహాత్కార్యములు అని వ్రాయబడి ఉంది. కనీ వినీ ఎరుగని ఆశ్చర్యకరమైన అద్భుతాలు దేవుడు జరిగించు పోతున్నాడని  అర్థం. చనిపోయినవారు లేపబడుతారు, ఇలాంటి సూచక క్రియలు ఎన్నో మనం చూడబోతున్నాం. ఇవి రెండు స్థలాల లో జరగబోతున్నయి. ఒకటి ఆకాశం రెండవది భూమి. అంతేకాక రక్తము మరియు అగ్ని అనే దుపస్తంబములను  చూడబోతున్నాం.

ఇదంతా ఒకెత్తయితే యోహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు కనుమరుగై పోతాడు చంద్రుడు రంగులోనికి మార్చబడుతుంది. ఈ అద్భుతమైన సన్నివేశం భూమ్మీద ఉండే నీవు ఆకాశంలో జరుగబోయే సంఘటనను వీక్షించి దేవుని శక్తి ఏమిటో తెలుగు  తెలుసుకోగలుగుతావు. కాబట్టి ప్రభువు రాకడ ముందు యుద్ధాలు ఉంటాయన్నది సుస్పష్టం. ఆ యుద్ధంలోని రక్తపాతం, ఆ రక్తపాతమే సూర్యుని రక్తవర్ణము గా మార్చినట్లుగా గమనించగలం. *కాబట్టి యుద్ధం అనివార్యం అనివార్యం అనివార్యం*

కావున ప్రభువు రాకడ సమీపముగా ఉందని గుర్తెరిగి, రక్షించబడి, బాప్తిసం తీసుకొని ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొనుటకు సిద్దపడాలి. మెలుకువగా ఉండి ప్రార్థనచేయుచు ఆయన వైపు చూస్తూ ముందుకు  సాగిపోదుము గాక.!