ప్రకటన గ్రంథము వ్రాసిన భక్తుడైన యోహాను సజీవ సాక్ష్యం


  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Articles
  • Reference: Jesus Coming Soon Ministries

జెబెదాయి, సలోమి కుమారులు యోహాను, యాకోబులు వీరు యోసేపుకు మనుమలు, యోసేపుకు మరియ ప్రధానము చేయబడినప్పుడు వీరిద్దరు అక్కడే వున్నారు. అప్పటికి యోహాను వయస్సు 12 సంవత్సరాలు సలోమి మరియకు అంతరంగికురాలు. కావున క్రీస్తు తన తల్లిని చూచుకొనుము అని యోహానుకు చెప్పడం సహజమే. యోహాను 19:25-27. తనను గూర్చి యేసు ప్రేమించిన శిష్యుడుగా చెప్పుకున్నాడు. యోహాను 13:23, 19:26, 20:2, 21:7, 20:7,20. పండ్రెండు మంది శిష్యుల్లో జాలరులుగా యోహాను, యాకోబు, పేతురు, తోమా, నతానియేలు, అంద్రెయ వున్నారు. యోహాను 21:2.

జెబెదయి షిప్పింగ్ యార్దులొ చేపల వ్యాపారము జరిపెడివాడు. మార్కు సువార్త 1:19,20. చేపల తాజాదనం కొరకు మగ్దల అనే ఊరుకు వాటిని తెచ్చెవారు. 1వ శతాబ్దంలో పాలస్తీనాలో ప్రధాన ఆహారం చేపలు. ఇలాంటి వ్యాపారంలో పైచేయి జెబెదయిదే. ఇతనికి సీయోను కొండమీద యెరూషలేములో సొంత ఇల్లు వుంది.

యేసుతో పాటు వున్న యోహాను :-

1) అంతరంగిక వలయంలో వున్నవారు యోహాను, యాకోబు, పేతురు.

2) పేతురు అత్త స్వస్థత సమయంలో – మార్కు 1:29

3) పండ్రెండు మంది అపోస్తలులను అభిషేకించునప్పుడు మార్కు 3:17

4) సమాజమందిరపు అధికారి కుమార్తె స్వస్థత సమయంలో. మార్కు 5:35-37

5) రూపాంతరము సమయంలో. మత్తయి 17:1

6) క్రీస్తు పేరిట దయ్యాలు వెళ్ళగొట్టేవాడు కనబడినప్పుడు. లూకా 9:49

7) వారిని ఆహ్వానించని సమరయను పరలోకమునుండి అగ్ని దిగిరావాలని. లూకా 9:54

8) తల్లి కోరినప్పుడు. మత్తయి 20:20

9) రహస్యముగా రాబోవు విషయాల గురించి మాట్లాడేటప్పుడు. మార్కు 13:3

10) చివరి భోజనం. లూకా 22:8

11) గెత్సెమనె తోటలో. మార్కు 14:32

12) సిలువ దగ్గర. యోహాను 19:26

13) ఉరిమెడివారు అని పేరు పొందిన యోహాను. మార్కు 3:17

అనేకమంది అపోస్తలుల వలె ఉపవాసం, ప్రార్థన, శరీర కోరికలను జయించి క్షణం క్షణం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం యోహాను అభిలాష. ఆ అభిలాష నీలో వుందా? సువార్త ముగింపులో యోహాను చావడని ఒక గాలివార్త వచ్చింది. యోహాను 21:23


యోహాను సంరక్షణలో యేసు తల్లి

పెంతెకోస్తు పండుగ తరువాత యేసు తల్లి యోహాను సంరక్షణలో ఉంది. ఈ పండుగ తర్వాత జెబెదయి మరణించాడు. ఆదిమ సంఘములో యోహానుది కీలక పాత్ర. క్రీ.శ. 44 లో తన సహోదరుడు యాకోబు చంపబడ్డాడు. అపోస్తలుల కార్యములు 12:1-3లో చూస్తాము. క్రీ.శ. 48 లో పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు అన్యులు సున్నతి చేసుకోవచ్చు అనే దానిమీద వాదోపవాదాలు జరిగినప్పుడు యోహాను అక్కడే ఉన్నాడు.

ఒక రోజు ప్రజలు యోహానును వెతుక్కుంటూ దియాస్కోరైడ్స్ ఇంటికి రాగా ఇంటిలో ఉన్న యోహాను తానే స్వచ్ఛందంగా లొంగిపోయాడు. క్రీ.శ. 81 లో డియోటిన్ హింస తిరిగి ప్రారంభించాడు. యోహానును కొట్టించాడు, ఒక గిన్నె విషం త్రాగించాడు, నూనెలో వేశాడు అయినా యోహాను చావలేదు. అప్పుడు ఈ పాలకుడు యోహానును చూచి ఇతడు చావులేనివాడు అని అతనిని పత్మాసుకు పంపాడు. అక్కడ అపోల్లో బోధకులు కొనోపస్ అనే మాంత్రికుని దగ్గరకు వచ్చి యోహానును చంపమని కోరినా ఆ మాంత్రికుని మంత్రాలు ఫలించలేదు. అప్పుడే అక్కడ దేవుని దర్శనాల ద్వారా ప్రకటన గ్రంథాన్ని యోహాను తన శిష్యుని ద్వారా వ్రాయించాడు. క్రీ.శ. 96 డియోటిన్ హత్య చేయబడ్డాక అతని వారసుడు నీవ్వా క్రైస్తవులను హింసించడం ఆపేశాడు. అనేక మంది అక్కడ ప్రభువును నమ్ముకున్నారు. 15 సంవత్సరాలు పత్మాసులో వుండి అక్కడ వారికి ప్రకటన గ్రంథపు వాక్యపు ప్రతులను యిచ్చి తిరిగి ఎఫెస్సుకు వచ్చాడు. క్రీ.శ. 101లో యోహాను చనిపోయాడు. తన 7 మంది శిష్యులు అతనిని పాతిపెట్టిరి.